నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, August 22, 2011

జగన్,గెట్ రెడీ! తాజాగా మరో రౌండ్ చావులు మొదలయ్యాయి


జగన్ ఆస్తుల మీద, సన్నిహితుల మీద, అన్నిటికన్నా అతని ప్రతిష్ఠ మిద పునకం వచ్చినట్లు దాడులు చేస్తున్న సీబీఐ కాని ఆ దాడులు చేయిస్తున్న శక్తులు కానీ ఆలోచించాయో లేదో కానీ నేను భయపడినట్లు యువ నేత మీద ఈ దాడులు చూసి తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ లో కొన్ని గుండెలు ఆగిపోవడం అప్పుడే మొదలయింది. సాక్షిలో ఆది వారం ఒక చావు, సోమవారం ఒక చావు నమోదయ్యాయి. తండ్రి చనిపోయినప్పుడు ఆగిపోయిన గుండెల ఓదార్పు ఇంకా పూర్తి కానే లేదు అంతలోనే మరొక రౌండ్ చావులంటె ఎలా?
 


పాపం జగన్!


దానికి తోడు జగన్‌ని అరెస్టు చేయవచ్చునని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. లోకాన అందరి కన్నీళ్ళు తుడిచె చేయి జైలులో ఉంటే ఈ ఆగిపోయిన హృదయాల తాలూకూ కుటూంబాలని ఓదార్చే వారెవరు?

5 comments:

Anonymous said...

మీ తెలుగుదేశం వాళ్ళకి పండగ

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sorry, I am not from TDP.

Anonymous said...

సొనియా చెయ్యి మరియు కాంగ్రేస్ చెయ్యి ఉన్నాయి కదా!?

అవి కూడా జైలుకు పొతే, అప్పుడు వెతకాలి వరే చెతులకొసం.

Praveen Sarma / प्रवीण् शर्मा said...

గూగుల్ ప్లస్‌లో నేను వ్రాసినది: https://plus.google.com/111113261980146074416/posts/Ry5jbotznb4

rajasekhar Dasari said...

ఏమ్ తమాషాగా ఉందా? నా ముని మనవడు జగన్ వాళ్ళ ముని మనవడి గురించి ఆత్మా హత్య చేసుకుంటాడు (మా అమ్మాయికి ఐదు ఏళ్ళు కూడా లేవు). అప్పటి దాకా ఈ ఓదార్పు యాత్ర జరగాల్సిందే . మీరు కాదు అంటే చావడానికి ఇప్పుడే చాలా మంది ఉన్నారు!!!