నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, August 25, 2011

రాజ రాజ చోళుడు Vs జగన్ మోహన్ రెడ్డి


తమిళ నాడునే కాదు, పూర్తిగా దక్షిణ భారత దేశంతో బాటు, సింహళన్ని, మాల్దీవులను కూడా జయించిన రాజ రాజ చోళుడికీ జగన్ మోహన్ రెడ్డికీ వెయ్యి సంవత్సరాల పైనే గ్యాప్ ఉంది. అలాంటిది ఇద్దరికీ పోలికేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇద్దరి జీవితాలలో కొంత సాపత్యం, కొంత వైరుధ్యం ఉంది. ఒక సారి చూడండి.
 
అప్పటి వరకూ అధికారం  కోసం చిన్నా చితకా రాజులతో పోరాడుతూ వచ్చిన చోళులకి రాజ రాజ చోళుడు సార్వభౌమత్వం కల్పించాడు. తమిళ నాడుని పూర్తిగా జయించి, పడమరగా కేరళ ప్రాంతంలో చేర రాజులని, ఉత్తరాన చాళుక్య రాజుల్ని ఓడించి వింధ్యకి ఇవతల ఉన్న భూభాగమంతా జయించి, సముద్రాన్ని దాటి శ్రీలంకని, మాల్దీవులని కూడా జయించి ఒక విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు రాజ రాజ చోళుడు. ముగ్గు రాళ్ళ గనులని తవ్వుకుంటూ ఉన్న రాజా రెడ్డికీ, రాజకీయాల్లో డక్కా మొక్కీలు తింటు వస్తున్న రాజ శేఖర్ రెడ్డికీ సాధ్యం కాని పని, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడం చేశాడు జగన్.


తన స్థాయికి తగ్గట్టుగా ఒక చిరకాలం నిలిచే చిహ్నాన్ని నిర్మించాలని తంజావూరు బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు చోళ రాజు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఒక ప్యాలస్‌ని, బెంగుళూరు, పులివెందులలో రెండు ప్యాలస్‌లనీ, సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని చిరకాలం నిలిచేలా నిర్మించాడు పులివెందుల యువ రాజు.
  
మరొక కీలక అంశంలో సాపత్యం, వైరుధ్యం రెండూ కనిపిస్తాయి. పరాంతక సుందర చోళుడి కుమారుడు రాజ రాజ చోళుడు. తండ్రితో కలిసి కొన్ని, తండ్రి లేకుండా స్వయంగా తను కొన్ని దండయాత్రలలో పాల్గొని ఎన్నో అద్భుత విజయాలు సాధించి తన సామర్ధ్యాన్ని నిరూపించుకొన్నాడు. అయితే తన అన్న ఆదిత్య చోళుడు తండ్రి తరువాత సింహాసనం ఎక్కాల్సి ఉండగా ఒక కుట్రలో హత్యకి గురవుతాడు. దానితో అంతఃపురంలో, అస్థానంలో, ప్రజలలో ఎంతో పేరున్న రాజ రాజ చోళుడికి సింహాసనం దక్కాలని అందరూ అభిలషించారు. కానీ ఆయన పదవిని తిరస్కరించి, తన చిన్నాన్న మధురాంగధన్ చోళుడిని రాజుగా చేసి 19 సంవత్సరాల తరువాత, అతని తదనంతరం సింహాసనమెక్కాడు. 
 
ఈ విషయంలో యువ నేత రాజ రాజ చోళుడికి భిన్నంగా వెళ్ళాడు. బహుశా వెయ్యి సంవత్సరాల అంతరం ఇందుకు కారణం కావచ్చునేమో!? రాజ రాజ చోళుడు ఇప్పుడు పుట్టి ఉంటే ఇలాగే ప్రవర్తించి ఉండే వాడేమో?


1 comment:

Anonymous said...

దొంగేదవల్ని రాజరాజచోళునితో పోల్చడమేమిటి? ఇదేమీ బాగోలేదు, చెప్పూ, లెంపలేసుకో.