నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, August 30, 2011

డూప్లికేట్ అన్నా హజారే


ఏదైనా ఒక వస్తువు బాగా పాపులర్ అయితే అలాంటి డూప్లికేట్‌లు పుంఖాను పుంఖాలు పుట్టుకొస్తాయి. ఆపిల్ కంపెనీ వారి ఐ ప్యాడ్ సృష్టించిన సంచలనం చూసి ఐడియా ప్యాడ్, టచ్ ప్యాడ్, థింక్ ప్యాడ్‌ల పేరిట లెక్కకు మించిన టాబ్లెట్ పీసీలు మార్కెట్‌ని ముంచెత్తాయి.
  


 అలాగే ఇప్పుడు దేశంలో అన్నా హజారే హవా నడుస్తుండండం చూసిన చిన్నా చితకా నాయకులందరూ అవినీతి వ్యతిరేక బాట పట్టారు. ఈ గుంపులో హైటెక్ రత్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే అందరిలా పత్రికా ప్రకటనలకో, ఉపన్యాసాలకో పరిమితం కాకుండా ఎందుకో ఈ సారి విద్యార్థులతో మమేకం అన్న ప్రోగ్రాం పెట్టుకున్నారు. 
 
నేటి విద్యార్థులే రేపటి ఓటర్లు అన్న స్పృహతోనో, ఈ మథ్య అందరూ ఓటేయాలి అన్న స్పృహ వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా కేవలం ఊకదంపుడు మాటలకు పరిమితం కాకుండా పోలింగ్ బూత్ వరకూ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొంటూ ఉండడం చూసి ఆయన ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారేమో. అయితే ఈ కార్యక్రమాన్ని ఆయన పక్కాగా ప్లాన్ చేశారు. తన వాళ్ళ యాజమాన్యంలో నడిచే కాలేజీలనే ఎంచుకొన్నారు. ఆ యాజమాన్యాలు కూడా ఏయే ప్రశ్నలడగాలో, ఎవరు అడగాలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. 

అయినా కథ అడ్డం తిరిగింది. విద్యార్థులతో వచ్చిన తల నొప్పె ఇది. ఆ వయసులో ఆవేశం, ఆలోచనా అలాంటివి మరి. వాళ్ళలో కొంతమంది స్క్రిప్ట్‌ని పక్కన పడేసి బాబు గారి తల తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్నలు సంధించారు. మీరు అవినీతికి పాల్పడలేదా? మీకు వేల కోట్ల ఆస్తులెక్కడి నుంచి వచ్చాయి? సింగపూర్‌లో మీకు హోటల్ లేదా? స్విస్ బ్యాంక్‌లో అకౌంట్ లేదా? అని ప్రశ్న మీద ప్రశ్న సంధించేసరికి బాబు గారు ఇబ్బంది పడ్డారు. 


అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అని ఆయన ఆ ప్రశ్నలడిగిన వాళ్ళ మీద ఎదురు దాడి చేశారు. నా ఆస్తులెక్కడున్నాయో ఆథారాలు తీసుకురా, నీకే రాసిస్తాను అని కోపగించుకొన్నారు. తెలుగు తమ్ముళ్ళకు మాత్రం తమ నాయకుడి తీరు నచ్చడం లేదు. ఎక్కడో ఒక చోట వేదిక మీద నిలబడి ఉపన్యాసమిస్తే పోయేదానికి ఇదంతా ఎందుకని వాళ్ళ ఆలోచన. స్టేజెక్కి లెక్చర్లు దంచితే వినే వాడు వింటాడు, వినని వాడు మూసుకొని ఉంటాడు. అంతేకానీ ఎవరూ ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలడిగి విసిగించరు కదా అన్నది వాళ్ళ లాజిక్. 


నిజమే మరి నాయకులు ప్రజలముందుకొస్తే ఇలానే ఉంటుంది మరి.

No comments: