నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, August 30, 2011

ఒక్క రోజు జిమ్‌కి వెళ్ళకుండా సిక్స్ ప్యాక్ కావాలంటే....


అమ్మాయిలకి ఎత్తైన వక్షాలు సన్నటి నడుము ఉంటే ఎలా ఉంటుందో, అబ్బాయిలకి సిక్స్ ప్యాక్ పొట్ట అలా ఉంటుంది. అందుకే ఓమ్ శాంతి ఓమ్ సినిమా కోసం షారుఖ్ ఖాన్, గజినీ కోసం అమిర్ ఖాన్ నెలల తరబడి జిమ్‌లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ సాధించారు. అయితే అలా ప్రతి రోజూ గంటల తరబడి జిమ్‌లో కూర్చోవడం అందరికీ అయ్యే పని కాదు. అయితే ఒక్క రోజు కూడా జిమ్‌కి వెళ్ళకుండా సిక్స్ ప్యాక్ వచ్చే వీలుంటే? ఇది ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోకండి.
  
బాడీ కాంటూర్(Body Contour) అనే ఒక క్లినిక్ దీనిని నిజం చేస్తుంది. ఛానల్ ఫైవ్ అనే ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనే పోటీలో పాల్గొంటున్న డారిన్ ల్యోన్స్ అనే మీడియా అధినేత తన సిక్స్ ప్యాక్ ఆబ్స్ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నలభై ఆరేళ్ళ ల్యోన్స్ తన జీవితంలో ఎప్పుడూ జిమ్ మొహం చూసి ఎరగడు. అయినా అతను చొక్కా విప్పితే లోపల సిక్స్ ప్యాక్ కండలు ఉంటాయి. 
  


సినిమా హీరోలనూ, బాడీ బిల్డర్లనూ సిక్స్ ప్యాక్‌లతో చూసి మోజు పడ్డ ల్యోన్స్ తనకూ అలాంటి కండలు కావాలని బాడీ కాంటూర్ క్లినిక్‌ని సంప్రదించాడు. వాళ్ళు అతని కడుపు మీద కొన్ని చోట్ల ఉన్న కొవ్వును లైపో సక్షన్ ద్వారా తొలగించి సిక్స్ ప్యాక్ అబ్స్ కనిపించేలా చేశారు. అయితే ల్యోన్స్ కడుపు మాత్రం చూడడానికి కొంచెం వికారంగా ఉంటుంది. వళ్ళంతా కొవ్వుతో కడుపు మీద మాత్రం కండలతో కృత్రిమంగా అనిపిస్తుంది. 
  


టీనేజ్ మ్యుటాంట్ నింజా టర్టుల్ వేషం వేసి నట్లుంది అని కొందరు, పీపా మీద గీతలు గీసినట్లుంది అని మరి కొందరు కామెంట్ చేశారు. కానీ ల్యోన్స్‌తో కలిసి బిగ్ బ్రదర్ షోలో పాల్గొంటున్న ముప్పై సంవత్సరాల కెర్రీ కాటోనా మాత్రం ల్యోన్స్‌ని చూసి బాగా ఇంప్రెస్సయి పోయింది. షో ముగిశాక తనూ అతనిలా ఆపరేషన్ చేయించుకొని పొట్టమీద కొవ్వు తొలగించుకొని అందంగా కనిపించాలని అనుకొంటున్నట్టు చెప్పింది. బ్రయాన్ మెక్‌ఫాడెన్ అనే పాప్ సింగర్ మాజీ భార్య అయిన ఈ అమ్మడు నలుగురు పిల్లల తల్లి. ఈమె ఇంతకు ముందు వక్షోజాల సైజు తగ్గడానికి ఒక సారి, వంట్లో కొవ్వు తగ్గించుకోవడానికి ఒక సారి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని ఉంది. 

సిక్స్ ప్యాక్ అంటే ఏమిటి?

ఉదరం భాగంలో రెక్టస్ అబ్డామినిస్ అనే ఒక జత కండరాలు ఉంటాయి. ఇవి మధ్య మధ్యలో లోపల ఉన్న కండరాలకు అతుక్కొని ఉంటాయి. ఆ అతుక్కున్న భాగాల మధ్య భాగాలు కొంచెం ఉబ్బుకొని ఉంటాయి. ఈ ఉబ్బుకొని కనిపించే కండరాలే సిక్స్, ఎయిట్ ప్యాక్‌లు. 
  
ఇవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అయితే పొట్టమీద పేరుకొన్న కొవ్వు వీటిని కప్పివేస్తుంది. ఆ కొవ్వుని కరిగించడానికి ఎక్సర్‌సైజ్ చేసిన వారికి కొవ్వు కరగడంతో బాటు, ఈ కండలు కూడా బాగా ఉబ్బి సిక్స్, ఎయిట్ ప్యాక్‌లు కనిపిస్తాయి.

No comments: