నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, September 2, 2010

కంప్యూటర్ల దెబ్బకి బలయిన మరొక పుస్తక దిగ్గజం

కంప్యూటర్లూ, ఇంటర్నెట్ కలిసి పుస్తకాల మీద జరిపే దాడిలో ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా పుస్తకరూపం చాలించి ఇప్పుడు కేవలం సీడీరూపానికే పరిమితమయ్యింది. సీడీలో పుస్తకంలో ఇవ్వలేనీ ఎన్నో ఫీచర్లు, వీడియో, ఆడియో లాంటివి, లభ్యమౌతున్నా, పుస్తకం చేతిలో పట్టుకొని చదివిన భావన మిస్సవుతుందని బాధ పడేవాళ్ళు ఉన్నారు.
ఆ కోవలోనే ఇప్పుడు మరొక పుస్తకం చేరబోతోంది. ఆంగ్ల బాష నిఘంటువుల్లో ప్రామాణికంగా పరిగణింపబడే "ఆక్స్ ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ" గత ఇరవై యేళ్ళుగా తన మూడవ ఎడిషన్ ముస్తాబు చేసుకొంటుంది. 80 మంది భాషా నిపుణులు(lexicographers) కలిసి ఈ ఎడిషన్ ని రూపొందిస్తున్నారు. అయితే ఇది పుస్తక రూపంలో వెలువడే అవకాశం లేదని ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ CEO నైగెల్ పోర్ట్ వుడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎడిషన్ కేవలం ఆన్ లైన్ లోనే లభించబోతోంది. కావలసిన వారు దీనిని ఆన్ లైన్ లొ డబ్బు చెల్లించి చూసుకోవచ్చు. అయితే ఆక్స్ ఫోర్డ్ డిక్షనరీకి పోటీదారయిన చాంబర్స్ డిక్షనరీ మాత్రం ఆన్ లైన్ లో ఉచితంగా లభిస్తుంది

4 comments:

Anonymous said...

We have to accept the change.

Anonymous said...

Good for environment.

gajula said...

maarpunu angikarinchaali.nenaithe encyclopedia of britanica anni volumes books chadivaanu.e speed tharamlo e maarpu aahvaaninchathaginademo.

Seo Jong Do said...

come to my blog!! seojongdo.blogspot.com