అయిదారు రోజుల్లో అయోధ్యపైన కోర్టు తీర్పు చెప్పబోతుంది. ఆ తీర్పు ఎలా ఉంటే ఏమౌతుందోనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిక్కు బిక్కు మంటూ ఎదురు చూస్తూ ఉన్నాయి. అయోధ్యకి నేను రెండు పరిష్కారాలు అలోచించాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.
I. రెలిజియస్ మాల్/ మల్టిప్లెక్స్: ఇది అన్ని రకాల మతాలకి సంబంధించిన ప్రార్ధనా మందిరాల సమూహము. వివాదంలో ఉన్న స్థలాన్ని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి, ఒక్కో మతానికీ ఆ మతానికి సంబంధించి దేశంలో ఉన్న జనాభాని బట్టి స్థలాన్ని కేటాయించి అందులో వాళ్ళ ప్రార్ధనా మందిరాలని నిర్మించుకోవడానికి అనుమతినివ్వాలి. ఇందులో అన్ని మతాలు ఉంటాయి,హిందూ, ముస్లిం,సిక్కు,బుద్ద, జైన, పార్శీ ఇలా.
ఇంక గుడి ఇంటే దానితో బాటే మిగతా వ్యాపారాలు కూడా వస్తాయి, ఉదాహరణకి పూలు, పండ్లు,టెంకాయలు, దేవుడి ఫోటోలు అమ్మే దుకాణాల లాంటివన్నమాట. అక్కడికి వచ్చే భక్తుల కోసం అల్పాహారశాలలు లాంటివి కూడా వెలుస్తాయి. ఇలా చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది.
II.శ్మశానం కాంప్లెక్స్: మతాభిమానం కానీ మత దురభిమానం కానీ మనిషి బతికి ఉన్నప్పుడే. చచ్చిన వాడికి ఇవేమీ ఉండవు. కాబట్టి ఆ స్థలంలో అన్ని రకాల మతాలకి సంబంధించిన శ్నశానాలు కట్టేస్తే ఓ పనయిపోతుంది. పర్యావరణానికి హాని కలిగించకుండా శవాలని తగలేయడం, తగలేశాక ఆ చితా భస్మాలని అయిన వారికి అందచేయడం, దానికి ఇంతని ఫీజు వసూలు చేయడం ఇలా దీన్ని కూడా లాభసాటి వ్యాపారం కింది మార్చవచ్చు.
ఏదైనా పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో రెండు రూపాయలకే అంత్యక్రియలు అనే వాగ్ధానం చేసి ఓటర్లకు గాలం వేయడానికి కూడా పనికొస్తుంది. దీనికి అనుబంధంగా 109 వాహనాలు ఏర్పాటు చేస్తామని ఇంకో వాగ్ధానం కూడా చేయవచ్చు. తెల్ల కార్డుదారులకు అంత్యశ్రీ అన్న పధకం ఒకటి పెట్టి ఓట్లకు గేలం వెయవచ్చు.
11 comments:
అంత్యశ్రీ కాదు "రాహుల్ అంత్యశ్రీ".
రెండో ఆప్షనే బెటర్
ముస్లింస్ ఆ స్థలంపై హక్కును హిందువులకు ఇచ్చి పరిహారంగా ఆపాటి భూమిని తీసుకోవాలి. ఎందుకంటే
1. ఆక్రమిత గుడులను కూల్చి, కట్టిన మసెదుల్లో అదొకటి మాత్రమే. బాబరు ఓ దురాక్రమణ దారు, అల్లా కాదు.
2. హిందువులకు రాముడు దేవుడు, అదే చోట పుట్టాడనే నమ్మకము, ఆర్కియాలజీ రిపోర్ట్ ప్రకారము అందుకు సాక్ష్యాలూ వున్నాయి.
ఏవిధంగా చూచినా అది హిందువులకు చెందడం ధర్మమవుతుంది. అలా కానపుడు కోర్ట్ చెప్పే న్యాయం కోసం చూద్దాం.
అంతవరకూ నో కామెంట్స్, ప్లీజ్.
ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది జాతి మేధస్సు ?
చెతురుగానే కదా ఇది రాసింది?
దుర్గ గారూ కొంచెం ఎలాబొరేట్ చేయండి. నూటికి నూరు పాళ్ళూ ఇది చతురేనండీ. సీరియస్ అయితే అంత్యశ్రీ లంటివి ఉంటాయా?మీరే చెప్పండి.
నిర్ణయం తప్పకుండ ముస్లిమ్స్ కి అనుకూలం గా వుంటుంది. హిందువుల గురించి పట్టించు కున్న ప్రభుత్వానికి పెద్ద ఒరిగేది ఏమి లేదు.
మూడో మార్గం వుంది. ఆ స్థలాన్ని మాకివ్వండి. ఎంచక్కా ఓ నాస్తిక కేంద్రాన్ని పెట్టేసుకుంటాం. ఓ పని అయిపోతుంది.
jaathi gourava pratishtala vishayamlo chaturlavasaramaa ?
ఈ సమస్యకి పరిష్కారం ఏమీ లేదు.
మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం ఈ సమస్య అలాగే ఉంటుంది.
హైకోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా రెండోవాళ్ళు సుప్రీం కోర్టుకి వెళతారు. అంతే.
దుర్గ గారు ,
జాతి గౌరవ ప్రతిష్టలన్నారు. ఎప్పుడో 16 వ శతాబ్దంలో జరిగిన సంఘటన గురించి మీరింత భావోద్వేగం చెందాల్సిన అవసరం లేదు. అప్పటికి జాతి అనే భావమే లేదన్నసంగతి బహుశా మీకు తెలియదేమో !
Tarakaram's answer is my answer too.
Post a Comment