గత కొన్ని నెలలుగా జరుగుతున్న సంఘటనలు చుస్తూంటే మన రాష్ట్రానికి పిచ్చి పట్టిందేమోననిపిస్తోంది. నాయకుడంటే ఎలా ఉండాలో అందుకు పక్కా వ్యతిరేక లక్షణాలున్న ఒక నాయకుడు రాష్ట్రాన్ని విభజించాలని ఒక నాటకంలాంటి ఆమరణ నిరాహార దీక్ష చేయడం దానికి స్పందించి ఆ దిశగా ఒక కమిటీ వేయడం, సరే కమిటీ వచ్చింది కదా అదేం చెబితే అలా నడుచుకుందామని వదిలేయకుండా అన్ని ప్రాంతాలకూ, అన్ని పార్టీలకూ చెందిన చోటా మోటా నాయకులు ప్రతి రోజూ వీధుల్లోకి ఎక్కడం, శుద్ధంగా చదువుకోండ్రా నాయనల్లారా అని తల్లి తండ్రులు కాలేజీలకు పంపిస్తే ఆ పిల్లలు రెచ్చిపోయి ధర్నాలు, బందులతో కాలాన్ని వృధా చేసుకోవడం, కొందరైతే కన్నవారికి కడుపుకోత మిగిల్చి అర్ధాతరంగా ఆత్మహత్యలు చేసుకోవడం, మా ప్రాంతానికి వస్తే తంతాం, చంపుతాం అని కొన్ని పార్టీల నాయకులని బెదిరించడం.......
పరీక్ష పత్రాలు దిద్దుతున్న గురువులని విధ్యార్ధులు తన్నడం, న్యాయస్థానాల్లో న్యాయవాదులు భీభత్సం సృష్టించి న్యాయమూర్తులని భయభ్రాంతులని చేయడం........
ఒక పక్క ఎరువులకోసం రైతులు అల్లల్లాడుతూ ఉంటే అవి నల్ల బజారుకి తరలి పోతూ ఉన్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు ఉండడం.....
ఇన్ని సమస్యలలో రాష్ట్రం అట్టుడుకుతూ ఉంటే యువనేత నేనూ నా ఓదార్పు అని కాలు కాలిన పిల్లిలా రాష్ట్రాన్ని చుట్టేస్తూ అధికార పక్షానికి, ముఖ్యమంత్రికీ క్షణం కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉండడం...
ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రానికి పిచ్చి పట్టిందని అనిపించడం లేదా?
3 comments:
రాష్ట్రానికి పిచ్చి పట్టలేదు.
నాయకులకి పట్టింది అధికార పిచ్చి.
వ్యవస్థలన్నీ కుప్ప కూలినప్పుడు అలానే అనిపిస్తుంది. CBN అధికారం లో ఉండగా విద్యార్థులకు రాజకీయాలు వద్దు. అందరూ చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి అనే వాడు.(తాను అదే విద్యార్ధి రాజకీయాల్లోంచి వచ్చానని మరచి పోయాడు). జైపాల్ రెడ్డి,వెంకయ్యనాయుడు,అరుణ్ జైట్లీ,సీతారాం ఏచూరి , వీళ్ళంతా విద్యార్ధి రాజకీయాల్లోంచి వచ్చినవాళ్ళే . ఆ విధంగా మంచి నాయకులు తయారయ్యే క్షేత్రానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.ఇక YSR అధికారం లోకి వచ్చాక తిను తినిపించు, దోచుకో దాచుకో,బయ్యారం మాకు : బియ్యం మీకు ,లాంటి పథకాలు పెట్టి మొత్తం వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించాడు. అందుకే ప్రస్తుతం ముసురు పట్టి , ఒక రాజకీయ శూన్యత ఆవరించింది. ఒక NTR లాంటి నాయకుడు రావడానికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు కొంతకాలం ఓపిక పట్టక తప్పదు.
దాడులు జరుగుతుంది నాయకుల మీదే... so not to worry about it
Post a Comment