నిన్న నల్గొండలో జరిగిన ఒక ఘాతుకాన్ని తలుచుకొంటే నాకు కలిగిన అనుమానం ఇది. నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో మంత్రాలతో ఊరిలోని వారికి అపాయం కలుగజేస్తున్నారన్న అనుమానంతొ ఉళ్ళోని వారంతా కలిసి ఇద్దరు వృద్ధులని కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టారు. ఇలాంటి అమానుష కృత్యాలు ఎక్కడో ఏ బీహార్ లాంటి వెనకబడ్డ ప్రాంతాల్లోనే జరుగుతాయనీ, మన రాష్ట్రంలో జరగవని నేననుకొనే వాడిని ఇన్నాళ్ళు.
అయినా ఎంత అనుమానం ఉన్నా మరీ ఇంత దారుణమా? ఆ చంపినా వారిలో అరవై మందికి పైగా ఆడవాళ్ళట! స్త్రీ శాంతిమూర్తి, దయా దాక్షిణ్యాలకు ప్రతీక అని చెప్పేవన్నీ ఒఠ్ఠి మాటలేనా? ఈ అనాగరిక స్థితిలోంచి ఈ మనుషులు ఎప్పటికి బయట పడతారో?దేవుడా నడిపించు ఈ జనాన్ని చీకటిలోంచి వెలుగులోనికి అన్న రవీంద్రనాధ్ ఠాగూర్ ప్రార్ధన ఏనాటికి ఫలిస్తుందో?
8 comments:
ఆంధ్రోల్ల కుట్ర అంటారేమో బాసు
చేతబడి నెపంతో జరిగే హత్యలలో మొదటి స్థానంలో ఉన్నది జార్ఖండ్. ఆ తరువాత చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, బీహార్, ఆంధ్ర ప్రదేశ్ ఉన్నాయని ఓ ఇంగ్లిష్ వీక్లీలో చదివాను.
నిన్న ఆ న్యూస్ చూసినపుదు ఒక్క సారిగా ఒళ్లు జలదరించింది
ఆలా అర్ధనగ్న స్త్రీ బొమ్మ పెట్టడం?
నేను చదివిన చైనా వీక్లీలో అలా లేదు, ప్రవీణూ. చైనా ఇంగ్లీస్ వీక్లీ చదువు అంతా బాగుంటది.
అది ఒక చెడు ఆడది.
ఎనోనిమస్ బాబూ ఎందుకు ఎప్పుడూ ప్రవీణ్ గారిని ఆడి పోసుకుంటూ ఉంటావు?
చైనా వీక్లీ చదవమని చెప్తే ఆడిపోసుకోవడ్మా! మీరేదో బూర్జువానో, వర్గశత్రువులానో వున్నారే. ;)
Sorry, dear Ano.
Post a Comment