సాక్షి మీ మనస్సాక్షి అని ఊదరగొట్టి ఒక రిప్రజెంటేటివ్ పదే పదే ఇంటికి వచ్చి మరీ నాచేత సాక్షిపత్రికకి చందా కట్టించాడు. నేను రోజూ హిందూ పత్రిక చదువుతున్నా సాక్షిలో వచ్చే ఫామిలీ పేపర్ అందులో పిల్లల కోసం వచ్చే బొమ్మలు,పజిల్సూ మా పిల్లలకి నచ్చినందువల్ల సాక్షిని ఆపకుండా కొనసాగిస్తూ వచ్చాను. కానీ గత కొంతకాలంగా సాక్షిలో ఈనాడుని, రామోజీరావునీ, చంద్రబాబు నాయుడినీ ఏకడానికే ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు.
ఒక పత్రికకి జీవం మెయిన్ పేజి. అలాంటి మెయిన్ పేజీ తరచూ ఈనాడుతో తమ తగవుని హైలైట్ చేసుకోవడానికి వాడుతున్నారు సాక్షివాళ్ళు. లేదంటే జగన్ ని ఫోకస్ చేయడానికి వాడుతారు. జిల్లా అనుబంధంలో రెండు పేజీలనిండా జగన్ ఫోటోలే. అది మా పత్రిక మా ఇష్టం అనడానికి వీల్లేదు.ఎందుకంటే నేను నెలనెలా చందాలు కడుతున్నాను కదా! సరే ఇప్పుడు ఆపెయ్యి అంటే, ఇప్పటిదాకా నేను కట్టిన డబ్బు మాటేమిటి? నేను ఆ పత్రికపైన వినియోగదారుల కోర్టులో కేసు పెట్టొచ్చా అన్న విషయమ్మీద ఎవరైనా నిపుణులు సలహా చెప్పండి.
వాళ్ళు ముందుగానే ఇది జగన్ పత్రిక, వై ఎస్ కుటుంబానికి బాకాలాగా ఉంటుంది అనిచెప్పి పత్రికని లాంచ్ చేసి ఉంటే నేను దాని జోలికి పోయి ఉండేవాణ్ణి కాదు. అప్పుడు వాళ్ళేం చేసుకున్నా నాకు సంబంధం ఉండేది కాదు.
మరి ఈనాడు మాటేమిటి అని ఎవరైనా అడిగితే దానితో నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను ఆ పత్రికకి చందాదారుణ్ణి కాదు కాబట్టి.
11 comments:
Very good.
కుదరదేమోనండి. వార్తలకి ప్రామాణికం అంటూ ఏమీ లేదు కాబట్టి.
నేను కూడా ఫామిలీ బావుందని తెప్పిస్తున్నా. రూమ్మేట్స్ తో తిట్లు తింటున్నా.
ముందు చందా కట్టేటప్పుడు మా పత్రిక ఇంత పొడుగు, ఉద్దరించేస్తాం , జనం మనః సాక్షి అని రకరకాలుగా బుట్టలో వేసుకుని తరువాత తమ వ్యక్తిగత అజెండాలను జనం పై రుద్దడానికి ప్రయత్నిస్తాయి ఈ పత్రికలు ( ఇది దాదాపు అన్ని పత్రికలకు వర్తిస్తుంది). ఆ పత్రికలలో తమకు నచ్చిన వాటికే ప్రచారం కల్పిస్తారు. ఈదంతా చందా కట్టే వినియోగదారుడికి సంబంధం లేకుండా జరిగిపోతుంటుంది. చందా కట్టడం మాత్రమే మీవంతు మాకు నచ్చిన వార్తలను ప్రచురించడం మావంతు అన్నట్టుంటుంది వీళ్ళ వరస. ఈ విషయంలో (వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించే విషయం) మీరు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది
same in eenadu also
అలా కుదరదండి... మీకు నచ్చకపొతే ఎప్పుడుకావాలనంటే మాంపించే సదుపాయం ఉన్నప్పుడు ఇది కుదరదు ..
అయినా మీరు ఈ కారణాలతొ కేస్ వెస్తే అన్ని వార్తాపత్రికలు, టి వి చానెల్స్ మీద కేసులేస్తారు... ఎందుకంటే అన్నిటికీ వాళ్ళ అజెండా వాళ్ళకి వున్నాయి కాబట్టి... మీకు ఒకదాంట్లొ కనిపిస్తె ఇంకొకరికి జ్యొతిలొ , ఈనాడులొ బాబు జపం కనిపించొచ్చు. :-)))
మీకు నచ్చపొతే మానిపించండి.. లేదు పిల్లలకొసం అంటే మెయిన్ పేజీ తీసేసి కెవలం పిల్లల్/మహిళల సెక్షన్ మాత్రమె వెయ్యమని పేపర్ వాడికి చెప్పండి :-)))))
మీరు తెలుగుదేశమా ?
నేను ఆంధ్రదేశమండీ!ఇదొక గొడవ మనకి నచ్చని విషయం గురించి మాట్లాడాలంటే మీరు ఆ పార్టీయా, ఈ పార్టీయా, ఆ కులమా ఈ కులమా అని సందేహాలు.
సందేహాన్ని తీర్చకుండా క్లాసు పీకడం బాగోలేదు.
కనీసం 2 years నుంచి నేను రోజు సాక్షి , ఈనాడు రెండు పత్రికలు చదువుతున్నాను. నేను గమనించినది ఏమిటంటే ఈనాడు ముందు ఒక కధనం మొదలు పెడుతుంది దానికి ప్రతిగా సాక్షి లో రెండవ రోజు ఈనాడు ఫై వ్యాసాలు వస్తాయి. ఈ బురద చల్లు కొనే పని రెండు పత్రికలు చేస్తున్నై. ఈ విషయం మీరు రెండు పత్రికలూ చదివితే స్పష్టం ఔతుంది. రోజు బ్లాగ్స్ రాసే మీకు ఇంటర్నెట్ editions చూడటం పెద్ద కష్టతరం కాక పోవచ్చు. చివరకు ఒక నిర్ణయని కి వచ్చాను, ఏమిటంటే , ఈనాడు లో జగన్ మీద రాసే వార్తలను, సాక్షి లో రామోజీ రావు మీద రాసే వార్తలను చదవకూడదు . కాని ఒకటి మటుకు నిజం ఈనాడు తప్పితే ఇంకొక పత్రిక చదవలేని పరిస్థితి నుంచి సాక్షి బయటకు తెచ్చింది. నాకు మటుకు పత్రికలేంటి Junk న్యూస్ చెప్పీ అన్ని TV చానల్స్ పైన consumer rights కింద కేసు పెట్టాలని ఉంది. అంతే కాకుండా సెన్సార్ ఐయ్యి రిలీజ్ ఐన సినిమాలు, పాటలని మళ్ళి సెన్సార్ చేసే TV ల ను చూస్తె అర్ధరహితం గా అనిపిస్తున్నది.
ప్రతి పార్టి కి ఒక పత్రిక , ఒక టీవీ చానెల్ ఉన్నాయి.
వీటిల్లో అనుకూల పార్టీ లని పొగడటం..వ్యతిరేక పార్టీ లని తిట్టటం,,దాంతో పాటే నాలుగు చావులు రాసేసి న్యూస్ పేపర్ అనిపించుకుంటారు.. కనక న్యూస్ పేపర్, టీవీ చూడటం మానేయండి.
మనఃశాంతి గా ఉంటుంది.
hi ..
they r i mean sakshi and eenadu ready to finish .behind the fight curruption so wait and see who vll win .
Post a Comment