మొన్న హైదరాబాద్ శివారులో జరిగిన ఇంజినీరింగ్ విద్యార్ధిని విద్య హత్య గురించిన పోస్టు ఇది. ఆమెని ఆమె కాలేజిలోనే చదువుతూ, కొన్నాళ్ళుగా ఆమెకి సన్నిహితంగా ఉంటూ ఇప్పుడు ఆమె స్నేహానికి దూరమయిన శేఖర్ అనే ఉన్మాది ఆమెని అతడి గదిలో బేస్ బాల్ బ్యాట్ తో తలమీద కొట్టి హతమార్ఛాడు.
ఒక ఫెమినైన్ కోణంలో ఈ విషయాన్ని నేను వాదించబోవడం లేదు. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా టీవీ చానళ్ళలో తప్పక కనిపించే వ్యక్తి సంధ్య. ఆమెకి బాగా ఇష్టమయిన యాంగిల్ ఆడదాన్ని మగవాడు ఆస్తిగా చూడటం. ఈ పిల్ల నాకు స్వంతమవ్వాలి లేదా ఇంకెవరికీ దక్కకూడదు అని మగవాడు అనుకోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అని ఆమె భావన,వాదన.
నాకు చాలా క్లియర్ గా ఈ ఇన్సిడెంట్ లో కనిపించేది ఆ శేఖర్ అనే ఉన్మాది తల్లితండ్రుల నిర్లక్ష్యం. వాడు గదినిండా వందల బీరి బాటిళ్ళు, విస్కీ,బ్రాందీ బాటిళ్ళు పెట్టుకొని ఉంటే ఆ తల్లితండ్రులు ఒక్కసారి వాడి గదికి వచ్చి అప్పుడైనా కొడుకు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చూసినట్లయితే వీడు సరయిన దారిలో లేదని వాళ్ళకి తెలిసిపోయేది కదా?
పిల్లలు ఏం చేస్తున్నారో అన్నది చూడకుండా వాళ్ళు ఏం అడిగితే అది అందించి వాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా తయారయితే అందులో తల్లితండ్రుల పాత్ర కూడా ఉంటుంది. ఇది కాదనలేని సత్యం.
వాడు పిలవగానే ఈ పిల్ల వాడి రూంకెందుకెళ్ళింది, అక్కడ ఆ మద్యం సీసాలు చూడగానే వెంటనే ఎందుకు బయటకి వచ్చేయలేదు అన్న ప్రశ్నలు ఇక్కడ నేను అడగడం లేదు. చచ్చిపోయిన పిల్ల గురించి డిస్కషన్ పెట్టడం బావుండదని.
4 comments:
Yes there should be punishment for parents as well
ఇంత తీవ్రమైన సంఘటనల వెనుక అమ్మాయి అబ్బాయిల ప్రేమ రాహిత్యం కనపడుతుంది, ప్రకటనా విధానం వేరు గా వుంటుందేమో కాని అసలు సమస్య వాళ్ళ ప్రేమ రాహిత్యమే. మరి దానికి 100% తల్లి తండ్రులనే కదా నిందించవలసింది.
అంటే వాళ్ళు తల్లిదండ్రులమాట జవదాటని శ్రీరామచంద్రులు వంటివారనుకోను. మంచి చెబితే తల్లిదండ్రుల నెత్తిన కూడా బండరాయి వేసే రకాలు. బేస్ బాల్ బ్యాట్ కేసులోని అమ్మాయి కూడా అలాంటిదే అనిపిస్తోంది. డ్రగ్స్,విలాసాలకు మరిగి అలా అయిపోతున్నారు.
దీనిని వెంటనే ఏపీ మీడియా రాముకి తెలియచెప్పి తాడేపల్లి వివరణ కోరాల్సినది గా కోరుతున్నాను.
Post a Comment