నిన్న మా వీధిలోని విశ్వనాధ శాస్త్రి గారు మరణించారు.గుండెపోటు అని డాక్టర్లు, ఆయన ఇంటిలో వారు చెబుతున్నారు కానీ అసలు కారణం అది కాదని నాకు తెలుసు. గత అయిదు రోజులుగా నా బ్లాగులో కొత్త పోస్టు లేదేమిటా అని ఆయన అదేపనిగా మధనపడి ఆవేదన చెందేవారు. ఆ ఆవేదనతొ ఆయన గుండె ఆగి మరణించారు.
అలాగే రెండు రోజుల క్రితం కాకినాడలో దీప అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొంది. పరీక్షలో మార్కులు తక్కువ రావడం వల్లనో, ప్రేమ వ్యవహారం వల్లనో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు.తను రెగ్యులర్ గా నా బ్లాగ్ చదివేదనీ, ప్రతి పోస్టుకీ అందులోని కామెంట్లకీ విపరీతంగా స్పందించేదనీ ఆమె స్నేహితురాళ్ళు చెప్పారు. పులి సినిమా గురించి నా ప్రెడిక్షన్ నిజమైంది అని నేను రాసిన పోస్టుకి వచ్చిన ఒక కామెంటుకి, నువ్వు భవిష్యత్తు చెప్పగలవా, అలా అయితే నీ భవిష్యత్, నీ కుటుంబం భవిష్యత్తూ చెప్పుకో చూద్దాం అని ఆ కామెంట్, ఆమె విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యిందనీ, అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని ఆమె ఫ్రెండ్స్ చెప్పారు.
వీళ్ళు కాక రాష్ట్రం మొత్తమ్మీద, దేశంలో ఇతర ప్రాంతల్లో, అమెరికా, యూరప్ లాంటి చోట్లా పలువురు నా బ్లాగు కోసం ఆత్మహత్యలు చేసుకోవడమో, ఉద్వేగానికి లోనయ్యి గుండెలు ఆగడం ద్వారా మరణించడమో జరిగింది. త్వరలో నేను వీళ్ళ కుటుంబాలని కలిసి ఓదార్చి, వారి కంటి నీరు నేను తుడిచి, నా కంటి నీరు వారితో తుడిపించుకోవాలి. ఈ నా ఓదార్పు యాత్రలో ఎవరైనా పాలు పంచుకోవాలంటే ఆనందంగా రావొచ్చు.
23 comments:
అయితే మీరు వాళ్ళ కుటుంబాలకు తలా లక్షరూపాయలు ఇస్తారన్న మాట!మీరు లక్షరూపాయలు గ్యారంటీగా ఇస్తానంటే మా ఏరియాలో కూడా మరణించిన వాళ్ళందరి జాబితా (వాళ్ళ ఇళ్ళల్లో కంప్యూటర్ లేకపోయినా సరే)తయారు చేసుకుని,ఫిక్సింగులు చేసుకుంటాం!:))
ఓహో మరి మీ రాకకి ఘనమైన ఏర్పాట్లు అవి చెయ్యాలి, ఒక చెంచాడు పెరుగన్నం వండించాలి.. చాలా అవ్వుద్ది..
ఒక పది కోట్లు నాకు పంపండి మరి.
:))
:) :)
చేతులకి రాఖీలు కట్టడం మరవొద్దు సుమా!
చావడం ఏముందీ, ఓ లక్ష కోసం ఎవరయినా ఛస్తారు లెండి కానీ మీ బ్లాగు కోసం ఎవరయినా తగలడ్డారో (అనగా వంటిమీద కిరోసినూ, పెట్రోలూ గట్రా పోసుకొని) లేదో ముందు చెప్పండి.
తగలబెట్టుకొన్న వాళ్ళ లెక్కలు సేకరించలేదు సుమండీ.
ఎందుకైనా మంచిది, పూలకి దూరంగ ఉండండి, కళ్ళకలక రావొచ్చు. :)
మీ బ్లాగ్ కోసం కాదుట వాళ్ళు మరణించింది
నేను వాకబు చేశా
మీ బ్లాగ్ చదవలేక ఆత్మహత్యలు చేసారట
హిహిహిహిహి............
నా జోకు కేకా ? లేక డోకా ?
మాంఛి సెటైరు :)
@ అప్పారావు శాస్త్రి గారు, ఏమిటి అండీ మీరు సాచ్చి టీవీలో ఈటీవీ విలేఖరిలా ... మీదంతా కచ్చి, మేము నమ్మము పొండీ:)
Good joke,Sastry.
"చెప్పు దెబ్బలు" పార్టీ జెండాలు తయారు చేసుకున్నారా?
మీ యాత్ర కు highcomand (అంటే మీ ఆవిడ ) అనుమతి ఉందొ లేదో మీరు మీ ఉత్తరం లో వ్రాయలేదు. ఏ కూడలి లో విగ్రహాలు పెట్టాలో మీ చెంచా ల తో కబురు పంప లేదు. ప్రజాప్రతినిధులను మీ యాత్రలో పాల్గొనమని ఎవరితోనూ ఫోన్ చేయించలేదు. కాబోయే ముఖ్యమంత్రి మీరేనని అరవడానికి చిల్లర జనాన్ని పోగు చేయలేదు . ఇలా అయితే ఎలా పైకి వస్తారు మాస్టారూ ?
జెండాలు తయారు చేసే పనిలొ ఉన్నాం సార్.మంచి డిజైన్ ఉంటే చెబ్దురూ.
తారకరామ్ గారూ ఇదే మొదటిసారి కాబట్టి అనుభవం లేక తప్పులు చేస్తున్నాం. దయచేసి బ్లాగులోక సభ్యులందరూ తలొక చెయ్యేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని ప్రార్ధన.
ఓహో మీరు పిలవగానే వచ్చేస్తామా ఏంటి?
మాకెంటి వస్తే మాకేంటంట?
బయ్యారం ఓబుళాపురం ఏది కావాలో చెప్పండి.రాసిచ్చేస్తా.ఆయినా ఇవన్నీ ఇలా పబిగ్గా మీరు అడక్కూడదు, నేను చెప్పకూడదు.లోలోపల జరిగిపోవాలంతే.
చిన్న correction అండి. నా పేరు తారకం. మీ యాత్ర కు నా పూర్తి సహకారం ఉంటుంది ( నేను కూడా నా highcommand అనుమతి తీసుకోవాలి ). కానీ కొన్ని సందేహాలను మీరు తీర్చాలి . మీ యాత్ర వ్యక్తిగతమా లేక పార్టీ పరంగాన ? మేము మా సొంత కార్లో రావాలా లేక ఆ ఏర్పాట్లు మీరు చూసుకొంటారా ? పూలు జల్లి నందుకు , మీరే మా కాబోయే ముఖ్యమంత్రని అరిచినందుకు మందు ,బిర్యాని ఏర్పాట్లు ఉన్నాయా ? వీటన్నిటికి మీరు సకారాత్మక జవాబు చెబితే మీకే నా పూలదండ లేక పొతే చెప్పు ......
ఎవరండీ బాబు మీరు తారకంగారు.
మందు లేకుండా పనులెలా జరుగుతాయి?
ఓకే . అలాగైతే నేను వస్తున్నా ........
తారకంగారూ,అన్నీ ఉంటాయి.కుమ్మేద్దాం రండి.
మీ యాత్రలో పాల్గోటానికి నేనూ సయ్యేనండి. అయితే ఒక షరతు.. వాటేసుకుని వీపు పామెయ్యడం, మొహం రుద్దెయ్యడం లాంటివి చెయ్యనంటేనే!
మీ "బ్లాగు" కోసం మరణించినవారికోసమా?
లేక మీ "బాగు" కోసం మరణించినవారికోసమా?
Post a Comment