నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, October 7, 2011

మతానికి మానసిక దౌర్భల్యం తోడయితే ఇంత దారుణంగా ఉంటుంది


మతం మత్తు మందు అని ఎవరో ఒక పెద్దాయన చెప్పాడు. ఈ మత్తుకి మానసిక బలహీనత తోడైతే జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో అనేదానికి ఈ రెండు సంఘటనలు నిదర్శనాలు.


ఈస్ట్ లండన్‌లో నివసిస్తున్న శ్యామా ఆలీతో తరచుగా దేవుడు సంభాషిస్తూ ఉంటాడని ఆమె నమ్మకం. దేవుడు ఆమెని దుష్ట శక్తులతో పోరాడమని చెప్తూ ఉంటాడు. ఆ దుష్ట శక్తులని తరిమేయడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి ఆమె పోరాటం చెస్తూ ఉంటుంది. ఆ పనిలో భాగంగా ఇంట్లోని బొమ్మల కళ్ళు పీకేయడం, డీవీడీ కవర్స్ మీద బొమ్మలకి కళ్ళు చెరిపేయడం చేస్తూ ఉంటుంది. ఒక రోజు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన నాలుగేళ్ళ కూతురుతో ఇంట్లో ఉన్న సమయంలో దేవుడి పట్ల తన ప్రేమని నిరూపించుకోవడం కోసం తన కూతుర్ని బలి ఇవ్వమని దేవుడు ఆమెని కోరుతున్నట్లు ఆమెకి అనిపించింది.

అంతే ఆ పిల్లని బరబరా వంటింట్లోకి ఈడ్చుకెళ్ళి గొంతు పిసికి చంపేసింది. అంతటితో ఆగకుండా మ్యూజిక్ సిస్టంలో కొరాన్ ప్రవచనాలు వింటూ ఆ పిల్ల దేహాన్ని వంటింట్లోని ఒక కత్తితో ముక్కలుగా కోసి, కాలేయాన్ని బయటకి తీసి తన దైవ భక్తికి నిదర్శనంగా దేవుడికి అర్పించింది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన భర్త ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి ఆమెని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వాళ్ళు ఆమెని మానసిక రోగుల ఆసుపత్రికి పంపి చికిత్స మొదలు పెట్టారు.
Tragedy: Shayma Ali told her husband 'if you really love Allah you would sacrifice your daughter'

జహంగీర్ పురి, డిల్లీ లో ఉంటున్న 35 సంవత్సరాల రొమిల్లాకి తానొక దేవతనని గట్టి నమ్మకం. ఆమె తరచుగా శక్తి పూజలు చెస్తూ ఉండేది. ఈ విషయంలొ ఆమెకి ఒక మంత్రగాడు పరిచయమై ఆమెతో పూజలు చేయిస్తుండేవాడు. ఒక సారి ఆ మంత్రగాడు ఆమెతో ఆమె కుటుంబం మీద ఒక దుష్ట శక్తి కన్నేసిందని, దానిని తరమడానికి కొన్ని ప్రత్యేక పుజలు చేయాలని నమ్మ బలికాడు. అయితే తాను దేవతనై ఉండి పూజలు చేయడమేమిటని ఆమె భావించింది. తనని, తన పిల్లల్ని అగ్నితో శుద్ధి చేస్తానని, తమని నిప్పు ఏమీ చేయలేదని ఇంట్లో వాళ్ళతో చెప్పేది. అయితే వాళ్ళు ఆ మాటల్ని అంతగా పట్టించుకోలేదు. ఒక రోజు భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి అగ్ని స్నానం చేయాలని నిశ్చయించుకొంది. తన కూతుళ్ళు, ఎనిమిదేళ్ల గీత, అయిదేళ్ళ జయల పైన, తన పైన కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఇరుగు పొరుగు అది చూసి మంటలు ఆర్పి వారిని హాస్పిటల్‌కి తీసుకు పోయినా అప్పటికే 95% కాలిన గాయాలతో ముగ్గురూ చనిపోయారు.


No comments: