నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 2, 2011

అమ్మ నీ, ఏం ప్లానేశావే మాయావతీ?


గత కొన్ని రోజులుగా మాయావతి కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తూ ఉంది. జాట్ కులస్తులకి OBC కేటగిరీలో, అగ్ర వర్ణాల్లోని పేదలకి ఆర్ధిక ప్రాతిపదికన, వెనక పడ్డ ముస్లిములని OBC లలో చేర్చాలని, బాగా వెనక పడ్డ OBC కులాలని, ముస్లిములని, క్రిస్టియన్లని SC,ST లలో చేర్చాలనీ, జాతీయ రహదారులని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని, రైతులకి సరిపడా ఎరువులని అందించాలని ఇలా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాలమీద ఎడా పెడా ఉత్తరాలు గుప్పిస్తూంది.
 


ఇప్పుడు తాజాగా న్యాయమూర్తుల నియామాకంలో కూడా రిజర్వేషన్లు పాటించాలని ఒక లేఖ రాసి పడేసింది. 2012 లో రానున్న అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొనే ఆమె ఇవన్నీ చేస్తుందన్నది ఎవరైనా చెప్తారు. అగ్ర వర్ణాలకీ, వెనక పడ్డ కులాలకీ, ముస్లిములకి, దళితులకీ అందరికీ ఏదో ఒక తాయిలం ఇమ్మని ఈమె లేఖలు రాసి పారేస్తే కేంద్ర ఆ తాయిలాలు ఇచ్చినా ఇవ్వకున్నా ఈమెకి దక్కే క్రెడిట్ ఈమెకి దక్కుతుంది. ఇస్తే అది నావల్లే వచ్చింది అని ప్రచారం చేసుకోవచ్చు. ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం మీద నింద మోపవచ్చు.
 


ఈమె ఎజెండాలో తదుపరి అస్త్రాలు ఏమిటో? సైన్యంలో రిజర్వేషన్లు, రాష్ట్రపతి, ప్రధాని పదవుల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో CEO పదవుల్లో రిజర్వేషన్లు ఇలా ఉంటాయేమో! పోయేది మనది ఏమీ లేనప్పుడు ఏమైనా అడగొచ్చు.

5 comments:

Anonymous said...

అమ్మ నీయమ్మ ఏం ప్లానేశావే మాయావతీ?
అమ్మ నీయమ్మ ఏం ప్లానేశావే మాయావతీ?
.....
ఈ అన్ పార్లమెంటరీ భాషను వాడి మిమ్మల్ని మీరు చెప్పు దెబ్బలు కొట్టుకోవడం దేనికి?
ఇదే విమర్శని సభ్య పదజాలం తో చేయడం చేతకాదా?

Anonymous said...

మాయ మీద మనసుపారేసుకున్న ముదురు బెండకాయ దళిత బ్లాగర్ల మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన లేకుంటే ఎలాగండి?

praveensarma@teluguwebmedia.in said...

భూసంస్కరణలు అమలు చేస్తామని ఏ పార్టీవాళ్ళూ వాగ్దానం చెయ్యరు. అలా చేస్తే అగ్రకులాలవాళ్ళ భూములే పోతాయని వాళ్ళకి తెలుసు. ఉద్యోగాలంటారా? ఈ రాజకీయ నాయకుల పిల్లలు ఎలాగూ ఉద్యోగాలు చెయ్యరు కాబట్టి ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఎంత అమలు చేసినా వాళ్ళకి నష్టం రాదు. ఎంత దళితవాదం పేరు చెప్పుకున్నా ఆ దళిత అజెండాలో తమకీ, తమ పిల్లలకీ నష్టం లేకుండా చూసుకుంటారు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

భలే చక్కగా చెప్పారు ప్రవీణ్.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మొదటి ఎనోనిమస్, మీ కామెంట్ చదివాక టైటిల్ మార్చాను. థాంక్స్.