నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, October 6, 2011

సైతాన్ పిల్లవాడికి సైతాన్ బాధ తొలగించిన డాక్టర్లు


ఆరేళ్ళ దీపక్ పాశ్వాన్ వీధిలోకి వెళ్ళాలంటే భయపడేవాడు. పిల్లలు అతన్ని చూస్తే అతని పైన రాళ్ళేసేవాళ్ళు. ఆడవాళ్ళు చాటు మాటుగా వీడు సైతాన్ పిల్లవాడు అని చెవులు కొరుక్కొనే వారు. కొందరయితే అతని మొహం మీదే అనే వాళ్ళు. అందుకు కారణం విక్రమార్కుడి వీపు మీది భేతాళుడిలాగా అతని చాతీకి అతుక్కొని ఉండే అతని కవల సోదరుడు. సోదరుడు అంటే పూర్తి మనిషి కాదు రెండు చేతులు, రెండు కాళ్ళు అంతే. దానివల్ల అందరిలా కాకుండా దీపక్‌కి నాలుగు చెతులు, నాలుగు కాళ్ళు ఉండేవి.


  
ఒకరికి ఒకరు అతుక్కొని పుట్టే సయామీస్ ట్విన్స్‌లో ఒక రకం పేరసైటిక్ ట్విన్(Parasitic twin). ఇందులో ఒకరు పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువు అయితే, ఇంకొకరు పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఏవో కొన్ని శారీరక భాగాలు మాత్రమే ఉంటాయి. దీపక్ విషయంలో అతని కవల సోదరుడికి కాళ్ళు, చేతులు మాత్రమే ఉన్నాయి. అవి దీపక్ చాతీకి అతుక్కొని ఉన్నాయి.


దీపక్ ఉండేది బెళహరి అని బీహార్‌లోని మారుమూల గ్రామం. అక్కడ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోవడమే ఉండదు. కాబట్టి ముందుగా అల్ట్రా సౌండ్ స్కాన్ తీసి అతనికున్న వైకల్యాన్ని పసిగట్టె అవకాశమే లేదు. దీపక్ పుట్టినప్పుడు కాన్పు కూడా చాలా కష్టమయింది. కాన్పు చేసిన మంత్రసానితో సహా అందరూ అతని వింత ఆకారాన్ని చూసి భయపడ్డారు. ఆ శిశువు సైతాన్ రూపమని కొందరంటే, గ్రహణం సమయంలో భయట తిరిగినందుకే అలా జరిగిందని కొందరన్నారు. ఏది ఏమైనా దీపక్ ఎదిగే కొద్దీ అతనికి అతుక్కొని ఉన్న ఆ చేతులు, కాళ్ళు కూడా ఎదగసాగాయి. ఆపరేషన్ చేసి వాటిని తొలగించే వీలున్నా ఆ ఆపరేషన్ చేయగల డాక్టర్లు దగ్గరలో లేక పోవడం, పెద్ద పట్టణాలకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొనే స్తోమత అతని తల్లి తండ్రులకి లేకపోవడంతో ఆరేళ్ళు చిన్నరి దీపక్ ఆ అంగాలని భరిస్తూ వచ్చాడు.


దీపక్ గురించి తెలుసుకున్న బెంగుళూరు లొని ఫోర్టిస్ హాస్పిటల్ ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు రావడంతో దీపక్‌కి తను మోస్తున్న సైతాన్‌ని వదిలించుకొనే అవకాశం దక్కింది. నాలుగు గంటల ఆపరేషన్ తరువాత దీపక్ శరీరంలోనుండి రెండు చేతులు, రెండు కాళ్ళూ తొలిగిపోయి అతను మళ్ళీ మామూలు బాలుడిగా మారి పోయాడు. ఆపరేషన్ చేసిన రామ్‌చరణ్ త్యాగరాజన్ ఇక దీపక్ అందరి పిల్లల లాగా తన భవిష్యత్ జీవితాన్ని గడప వచ్చునని, ముందు ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం లేదని భరోసా ఇచ్చాడు.
AFP/Getty Images
ఇప్పుడు దీపక్‌ని వాళ్ళ పల్లెటూరిలో ఎవరూ సైతాన్ పిల్లవాడు అని పిలవడం లేదు. ఎందుకంటే అతని చాతీకి అతుక్కొని ఉన్న సైతాన్‌ని బెంగుళూరు డాక్టర్లు తీసేశారు.1 comment:

paapam andhra said...

Enjoy the life now little chap!