నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, March 25, 2011

మరో ఫుకుషిమా భారత దేశంలో!!!!


జపాన్‌లో సంభవించిన భూకంపం, దానివలన వచ్చిన సునామీలే కాకుండా జపాన్‌నీ, చుట్టుపక్కల దేశాలనీ వణికించిన మరొక ప్రమాదం జపాన్‌లోని అణు విద్యుత్ కేంద్రాలలో సంభవించిన పేలుళ్ళు, తద్వారా కలిగిన రేడియేషన్. ఈ ప్రమాదం చూశాక అన్ని దేశాలూ అణు విద్యుత్ పైన పునరాలోచనలో పడ్డాయి. జర్మనీ తన దేశంలోని మూడు అణు విద్యుత్ కేంద్రాలని వాటి కాలపరిమితికన్నా ముందుగానే మూసి వేసింది. అమెరికా అన్ని కేంద్రాల పటిష్టతను పునఃసమీక్ష చేయడం మొదలు పెట్టింది. 
  


 


ఫుకుషిమా పేలుడువలన భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అధికారులు చెప్పినా అరేబియన్ తీరంలో, మహరాష్ట్రలోని జైతాపూర్ వాసులు మాత్రం వణికి పోతున్నారు. జైతాపూర్‌లో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అన్ని అనుమతులూ మజూరయి త్వరలో అక్కడ ఒక ప్లాంటు ఏర్పాటు కానుండడమే అందుకు కారణం. భూకంపమో, సునామీయో వస్తే కదా ప్రమాదం అని అనుకోకండి. గత ఇరవై సంవత్సరాలలో జైతాపూర్‌లో 92 భూకంపాలు సంభవించాయి. 1993లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలు పైన 6.2గా నమోదయింది. ఈ వివరాలు ఈ ప్లాంట్ ఏర్పాటు కాకుండా పోరాడుతున్న కార్యకర్తలో, ఎలాగైనా దీనిని అడ్డుకుంటామని హెచ్చరించిన శివసేన వాళ్ళో చెప్పినవి కాదు. భారత ప్రభుత్వ సంస్థ, Geologocal Survey of India వెలువరించిన డేటా ఇది. 


  
ఇక్కడ భూమి అస్థిరమైనదనీ, అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏమాత్రం అనువైనది కాదని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదు. ఫుకుషిమా పేలుళ్ళ నేపధ్యంలో ఇక్కడ ఏర్పడనున్న అణు కేంద్రం మరింత పటిష్టంగా ఏర్పాటు చేసేందుకు బధ్రతా ప్రమాణాల స్థాయి పెంచుతామని నిన్న కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేసిన ప్రకటన ఇక్కడి ప్రజల భయాన్ని ఏమాత్రం తొలగించలేక పోయింది. 


ఈ చుట్టుపక్కల భూకంపం గానీ సునామీ గానీ సంభవించకుండా ఆ దేవుడే రక్షించాలని ఇక్కడి జనం బిక్కు బిక్కు మంటున్నారు.

No comments: