నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, June 1, 2012

Kamikaze పద్ధతిలో జగన్‌తో పోరాడుతున్న కాంగ్రెస్


Kamikaze అన్నది రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ వైమానిక దళం అమెరికన్ యుద్ధ నౌకలపైన పోరాటంలో అనుసరించిన విధానం. ఇందులో నౌకలమీద బాంబులో, క్షిపణులో ప్రయోగించడం ఉండదు. కొంత మందు గుండునో, లేకుంటే టాంకు నిండా ఇంధనంతోనో విమానం నేరుగా వెళ్ళి నౌకని ఢీకొంటుంది. పెద్ద శబ్ధంతో రెండూ పేలిపోతాయి. జపాన్ వారికి పోయేది ఒక విమానం, అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది అంతే. కానీ ఎదుటి వైపున ఒక యుద్ధ నౌక, దాని మీద ఉన్న విమానాలు, చాలా మంది నావికులు, ఇతర సిబ్బంది పోతారు. యుద్ధం చివరి దశకి వచ్చే సరికి జపాన్ పుర్తిగా దెబ్బ తినిపోయింది. దాని కర్మాగారాలన్నీ శత్రువుల దాడుల్లో నాశనమైపోయాయి. చాలా మంది సుశిక్షితులైన పైలట్లు యుద్ధంలో మరణించారు. ఆర్ధికంగా దేశం కోలుకోలేని విధంగా తయారయింది. విమానాలకి బాంబులు, క్షిపణులూ అందించే స్థితిలో జపాన్ లేదు. అలాగని లొంగిపోవడానికి ఇష్టం లేదు. ఆటువంటి స్థితిలో వాళ్ళు అనుసరించిన వ్యూహం Kamikaze. తమ వైపు నుంచి తక్కువ నష్టంతో ప్రత్యర్ధికి ఎక్కువ నష్టం కలిగించే వ్యూహం అది. అయితే ఇది పరాజయం అంచులో ఉన్న వారు ఎన్నుకొనే పద్ధతి.
  
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్‌తో పోరాటంలో ఇదే వ్యూహం అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్‌ని జైలులో పెట్టడం స్ట్రాటజిక్‌గా వారికి లాభించే విషయమే కానీ, జగన్ తల్లి విజయమ్మపైన కూడా దాడి చేయడం, మాటల తూటాలు సంధించడం ప్రజల్లో ఒకరకమైన నెగటివ్ ఫీలింగ్ పుట్టించే ప్రమాదం ఉంది. ఎండలో, పోలింగ్ బూత్ ముందు క్యూలో నించుని ఓటు వేసే వాళ్ళు ఆర్ధిక నేరాలు సంఘానికి, దేశానికి చేసే నష్టం గురించి, జగన్ ఉల్లంఘించిన చట్టాల గురించి పట్టించుకోరు. వారికి విజయమ్మ కార్చే కన్నీళ్ళు, నా బిడ్డకి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పే మాటలే కనిపిస్తాయి. కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే వీపులు చిట్లిపోతాయి.


ఆమె చేతులు జోడించి నించుంటే చాలు.


జగన్ పార్టీలో ఒక లెవెల్లో ఉన్న నాయకుడు నా మిత్రుడు. 2014 ఎన్నికలలో ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి కేండిడేట్‌గా పోటీలో ఉన్నాడు. "జగన్ మొదట్లో ప్రతి మాటనీ, పాటలాగా సాగ దీసి పాడినా తరువాత్తరువాత బాగా లాక్కొచ్చాడు. ఈ విజయమ్మ గట్టిగా రెండు వాక్యాలు కూడా స్పాంటేనియస్‌గా మాట్లాడలేకపోతుంది. ఈమె కేంపయిన్‌తో మీకు లాభమెలా వస్తుంది" అన్నాను అతనితో. 
 
"ఆమె ఎక్స్‌టెంపోర్ స్పీచ్‌లు ఇచ్చి ప్రజల్ని మేల్కొలపాల్సిన అవసరం లేదు. జనం మధ్య నించుని చేతులు జోడిస్తే చాలు. మాకు కావలసిన ఓట్లు మాకు పడిపోతాయి" అన్నాడు అతను.


నిజమే కదా!

3 comments:

Anonymous said...

Yedo peekagalanu anukuni untaaru Lakshmi Parvathi garu kuda. aavida paristhithi yento manaki telusu kada. kannella ki dandaala ki janam padipoye rojulu kaadu. intlo sonta vaadi gurinche yevadu pattinchukokunda yevadi swaardham vaadu choosukune rojulu ivi. inka eevida mosali kannella ki karigedi yevaru? YSR veerabhimanulu dandettina sare. nijam yento impartial gaa logical gaa alochinchagala andariki ardham avutundi.

knmurthy said...

vishleshana bagundi. ayithe sanubhuthi pavanalu balam gaa veestayaa ???

Anonymous said...

Chaalaa balamga veesthunnattu kanipisthondi.