నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, October 14, 2012

భార్యల్ని మోసే పోటీ (Wife Carrying Championship)


భర్త అంటే భరించేవాడు అని అర్థం. దీనిని నిజం చేయడానికా అన్నట్లు ఫిన్‌లాండ్‌లో భార్యల్ని మోయడంలో పోటీలు నిర్వహిస్తారు. Wife carrying championships అని పిలిచే ఈ పోటీలలో ఖచ్చితంగా భార్యల్నే మోయాలి అని ఏమీ లెదు. 49 కిలోలకన్నా ఎక్కువ బరువు ఉన్న అమ్మాయి ఎవరయినా సరే భార్య కింద లెక్క. అలాంటి అమ్మాయి ఎవరినయిన మోస్తూ 253.5 మీటర్ల దూరం పరుగెత్తి ఈ పోటీలలో నెగ్గవచ్చు. ఇందులో గెలిచిన వారికి అమ్మాయి బరువు బీర్. అంతకు అయిదు రెట్లు కాష్ బహుమతిగా ఇస్తారు.ఈ పోటీలలో మధ్యలో రెండు చోట్ల హర్డిల్స్, ఒక చోట మీటరు లోతున్న నీటి గుంట ఉంటాయి. భార్యని పడేయకుండా ఈ అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. 
  
ఫిన్‌లాండ్‌లో ఒకప్పుడు పెళ్ళికాని యువకులు ఊర్ల మీద పడి కంటికి నదురుగా కనిపించిన అమ్మాయిని భుజాల మీద వేసుకుని ఎత్తుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకొనేవారట. అదే కాలక్రమేణా పెళ్ళాల్ని మోసే పోటీగా మారింది అని అంటారు. ఈ పోటీలో పెళ్ళాన్ని వీపు మీద వేసుకొని కానీ, ఒక భుజం మీద వేసుకుని కానీ మోస్తారు. అయితే బహుమతి పొందినవారిలో ఎక్కువమంది ఉపయోగించేది ఎస్టోనియన్ టెక్నిక్. ఇందులో అమ్మాయిని తలకిందులుగా వీపుమీద వేసుకుంటారు.

ఎస్టోనియన్ టెక్నిక్

ఇప్పుడిప్పుడే ఈ పోటీలు ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి అక్టోబర్ నెలలో అమెరికాలోని మెయిన్‌లో కూడా ఈ పోటీలు పెడుతారు. ఎకోరన్ ఇండియా అన్న సంస్థ జనవరి 1,2011న భార్యా సమేతం అన్న పేరుతో ఈ పోటీని కేరళలోని త్రివేండ్రంలో నిర్వహించింది.

No comments: