నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Wednesday, May 29, 2013
టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క రోజులో రెండు హ్యాట్రిక్స్ నమోదు చేసిన బౌలర్
మూడు బంతుల్లో ముగ్గురు బ్యాట్స్ మెన్‌ని వరుసగా అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసుకోవడమనేది ప్రతి బౌలర్‌కీ కలగా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడో కానీ సాధ్యం కాదు. అందునా అత్యుత్తమ శ్రేణి క్రీడాకారులు అడే టెస్ట్ మ్యాచ్ స్థాయిలో మరీ కష్టం. ఇద్దరు అవుటయ్యాక తరువత వచ్చే బ్యాట్స్ మన్ తన కున్న స్కిల్ అంతా ఉపయోగించి కనీసం ఆ ఒక్క బంతికీ అవుటవకుండా బయట పడాలని ప్రయత్నిస్తాడు. అలాగే ప్రత్యర్థి కెప్టెన్ కూడా తన జట్టులోని మెరికల్లాంటి ఫీల్డర్స్‌ని బ్యాట్స్‌మన్ చుట్టూ మొహరింపజేసి ఆ మూడో బంతికి వికెట్ తీయాలని ప్రయత్నిస్తాడు. హ్యాట్రిక్ ఇంత కష్టమైన విషయం కాబట్టే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
అయితే ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్ సాధిస్తే అది ఇంకెంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు కదా! క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ అరుదైన ఘనత సాధించిన బౌలర్ ఒక్కడే ఉన్నాడు. అతను జిమ్మీ మాథ్యూస్ అనే ఆస్ట్రేలియన్ ఆటగాడు. 1912 మే28 న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అరుదైఅన్ ఘనత సాధించాడు. సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో చివరి మూడు వికెట్లు తీసుకున్న ఈ బౌలర్, ఫాలో ఆన్ ఆడిన తరువాత రెండవ ఇన్నింగ్స్‌లో తన రెండవ హ్యాట్రిక్ కూడా అదే రోజు నమోదు చేశాడు.
ఇందులో మరొక చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమంటే జిమ్మీ తీసుకున్న ఆరు వికెట్లలో మరొకరి పాత్ర లేదు. ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేసి, ఇద్దరిని ఎల్బీడబ్ల్యుగా, మరిద్దరిని కాట్ అండ్ బౌల్డ్ రూపంలో అవుట్ చేశాడు.
అయితే ఇంత అరుదయిన ఫీట్ సాధించిన ఈ మ్యాచ్ తరువాత మ్యాథ్యూస్ మరొక టెస్ట్ మ్యాచ్ ఆడకుండనే అతని కెరీర్ ముగిసిపోవడం ఎవరికీ అర్ధం కాని విషయం.
Saturday, May 11, 2013
నా సెల్ ఫోన్ కెమెరాలో బందీలయిన హిమాలయాలు (Mighty Himalayas in my Mobile) Photos
గత వారం మనాలీ వెళ్ళినప్పుడు నేను నా Sony Xperia Z ఫోన్ కెమెరాతో తీసిన ఫోటొలు ఇవి. అన్నీ కూడా ఆటో మోడ్ వాడి తీసినవే. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ టెక్నిక్స్ కానీ ఏమీ లేవు.
ఇది రోహ్‌తాంగ్ పాస్‌కి వెళ్ళే దారిలోని గులాబా అన్న చోట ఉన్న స్నో పాయింట్. రోహ్‌తాంగ్ పాస్‌కి వెళ్ళే దారిని మే రెండవ వారంలో తెరుస్తారట. అంచేత పర్యాటకులు ఈ స్నోపాయింట్‌లోనే మంచులో ఆడుకోవడం, సరదాగా స్కీయింగ్ చేయడం చెస్తారు.
స్నో పాయింట్‌లో కూర్చుని చూస్తే ఎదురుగా కనిపించే శిఖరం ఇది.
మనాలీకి కొంచెం దూరంలో ఉన్న సోలాంగ్ వ్యాలీలో కేబుల్ కారు ఎక్కి ఈ శిఖరం మీదికి చేరుకోవచ్చు.
ఈ ఫోటో మేము దిగిన మౌంటెన్ టాప్ హోటల్ టెర్రాస్ నుంచి తీసింది. శీతాకాలంలో ఆ టెర్రాస్ పైన కూడా మంచు నిండి పోయి ఉంటుందని ఆ హోటల్ స్టాఫ్ చెప్పారు. మా రూము కిటికీలోంచి కూడ మంచుతో కప్పబడిన హిమాలయాలు దర్శనమిచ్చాయి. నిప్పుల కొలిమిలోనుండి వెళ్ళిన మాకు ఆ శీతల వాతావరణం బాగా నచ్చింది.
ఈ ఫోటొ కూడా పైన ఉన్న ఫోటో తీసిన చోట తీసిందే, కొంచెం జూమ్ చేశానంతే.
ఇది రోహ్‌తాంగ్ పాస్‌కి వెళ్ళే దారిలోని గులాబా అన్న చోట ఉన్న స్నో పాయింట్. రోహ్‌తాంగ్ పాస్‌కి వెళ్ళే దారిని మే రెండవ వారంలో తెరుస్తారట. అంచేత పర్యాటకులు ఈ స్నోపాయింట్‌లోనే మంచులో ఆడుకోవడం, సరదాగా స్కీయింగ్ చేయడం చెస్తారు.
స్నో పాయింట్‌లో కూర్చుని చూస్తే ఎదురుగా కనిపించే శిఖరం ఇది.
Subscribe to:
Posts (Atom)