యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నది నేడు ప్రపంచం అంతా అంగీకరించిన విషయం. అందువల్లనే నేడు పాశ్చాత్య ప్రపంచంలో ఇబ్బడి ముబ్బడిగా యోగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంతే కాక వెన్నునొప్పిని తగ్గించడానికి యోగా ఉపయోగపడుతుంది అని అమెరికన్ స్పైన్ అసోసియేషన్ శాస్త్రీయంగా కూడా ధృవీకరించింది.
అయితే ఇన్ని ఉపయోగాలు అందించే యోగాని సాధన చేయడాన్ని తప్పించుకోవడానికి చాలా మంది చెప్పే సాకు సమయం లేదు అని. రోజుకి కేవలం అర గంట వెచ్చిస్తే సరిపోయేదానికి కూడా సమయం చాలని బిజీ రాయుళ్ళు కేవలం ఓ అయిదు నిముషాలు వెచ్చించి సర్వాంగ ఆసనం ఒక్కటి వేస్తే చాలు. శరీరంలోని దాదాపు అన్ని భాగాలనీ ప్రభావితం చేస్తుంది ఈ ఆసనం.
వెల్లకిలా పడుకొని నిముషం పాటు కాళ్ళూ, చేతులూ ఆడించి వార్మ్ అప్ చేసి ఈ ఆసనం చేయవచ్చు. ఇందులో కాళ్ళు రెండు పైకెత్తి, నడుము భాగాన్ని రెండు చేతులతో సపోర్ట్ చేస్తూ కాళ్ళని వీలయినంత వరకూ లంబ కోణంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలి.
అలా చేశాక చేతులు క్రమేపీ కిందికి జరుపుతూ శరీరాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దృష్టి కాలి బొటన వేళ్ళ మీద నిలిపి వీలయినంత సేపు ఆసన స్థితిలో ఉండి ఆ పిమ్మట మెల్లిగా పూర్వ స్థితిలోకి రావాలి.
ఈ ఆసనం వెన్నెముకని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. తలకి, మెదడుకీ రక్త ప్రసరణ పెంచుతుంది, థైరాయిడ్ సమస్యలని తగ్గిస్తుంది, కాళ్ళ వాపులనీ, వేరికోస్ వెయిన్స్నీ తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
ప్రతి రోజూ కనీసం అయిదు సార్లు ఈ ఆసనం వేసినా సరిపోతుంది.
దీని వల్ల యోగా మీద ఆసక్తి పెరిగి ఆసనాల సంఖ్యని, సమయాన్ని క్రమేపీ పెంచుకుంటూ పోతే మరీ మంచిది.

2 comments:
ఎవరయినా యోగా గురువు ఉంటే కానీ...ఈ ఆసనం నేర్చుకోవడం సాధ్యం కాదేమో??
అవసరం లేదు. కొంచెం సాధన చేస్తే ఈ ఆసనం తేలిగ్గానే వేయవచ్చు.
Post a Comment