నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, November 7, 2013

అటో చార్జీ కన్నా తక్కువ ఖర్చుతో అంగారక గ్రహ యాత్ర చేస్తున్న ISRO

మొత్తానికి మన వాళ్ళ అంగారక గ్రహ యాత్ర మంగళయాన్ రాకెట్ విజయవంతంగా దూసుకెళ్ళింది. అయితే ఇది అంగారక గ్రహాన్ని చేరాలంటే మరో పది నెలలు పడుతుంది. అప్పుడే ఈ ప్రయోగం విజయవంతం అని చెప్పగలం. అసలే పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ప్రజలందరికీ సరిగా ఆహారం అందించలేని మనకు ఇవి అవసరమా అని కోంతమంది చేసే విమర్శల సంగతి అటుంచితే మనవాళ్ళు సాధించిన ఈ విజయాన్ని అభినందించకుండా ఉండలేం.
  
ఈ ప్రయోగానికి సంభందించిన ఖర్చునీ, ఈ రాకెట్ వెళ్ళే దూరాన్నీ చూస్తే మన శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో ఈ విజయాన్ని సాధించారని చెప్పెక తప్పదు. దాదాపుగా 80 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రాకెట్ ప్రయోగానికి అయిన ఖర్చు 450 కోట్ల రూపాయలు. అంటే ఒక కిలోమీటర్ ప్రయాణానికి ఆరు రూపాయల కన్నా తక్కువ. ఇది ఆటో చార్జీ కన్నా తక్కువే!

3 comments:

సూర్య said...

లెస్స పలికితిరి !

durgeswara said...

జయహో జయభారతం

కమనీయం said...



కొన్నాళ్ళకిందట పేదదేశమైన మనకు టీ.వీలు ,కంప్యూటర్లు ఎందుకన్నారు.అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.నెహ్రూ,భాభా ముందుచూపుతో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే రోదసి,అణు పరిశోధనలకు నాంది పలికారు.(spaceprogram,and atomic research ) వాటి ఫలితాలను ఇప్పుడు చూడగలుగుతున్నాము.మనదేశపు 10 లక్షల కోట్ల బడ్జెట్లో 400 కోట్లు ఏపాటి?పేదరికం నిర్మూలించడానికి తగినచర్యలు,ఖర్చు తప్పక చెయ్యవలసిందే.కాని దానికి,దీనికి ముడిపెట్టకూడదు.''మంగళ్ యాన్ '' నిజంగా మనం గర్వించదగిన అద్భుతప్రయోగం.