నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, November 24, 2012

సవితా బాబీని తగులుకోబోతున్న రామ్ గోపాల్ వర్మ


గత కొన్నేళ్ళుగా సరయిన హిట్ లేక విజయం కోసం మొహం వాచిపోయిన రామ్ గోపాల్ వర్మకి అర్జంటుగా ఒక సూపర్ హిట్ కావాలి. హిందీలో లాభం లేదని తెలుగులోకి వచ్చి కామెడీ పండిదామని అనుకుంటే అప్పల్రాజు ట్రాజెడీనే మిగిల్చాడు. ఎన్నాళ్ళుగానో తనకి కలిసివచ్చిన మాఫియా కూడా తనని ఆదుకోకపోయేసరికి రూటు మార్చి ఫాక్షన్ డైరెక్షన్‌లో పోయినా కలిసి రాలేదు. ఇలా లాభం లేదని తనకి ఇష్ట దైవాలయిన భూతాలని ఆశ్రయించినా వర్మ గారికి కలిసిరాలేదు.
 
 దానితో ఈ సారి ఎలాగయినా హిట్టు కొట్టాలన్న పట్టుదలతో ఇంటర్‌నెట్‌లో సంచలనం రేకెత్తించి బ్యాన్‌కి గురయిన శృంగార గృహిణి సవితా బాబీ మీద సినిమా తీయాలని డిసైడయ్యాడు వర్మ.

గత కొన్ని సంవత్సరాలుగా savitabhabhi.com అన్న సైట్‌లో తన శృంగార కార్యకలాపాలతో ప్రతి రోజూ లక్షలాది మందిని ఆకర్షించి అనేక బాషల్లోకి అనువదించబడ్డ కామిక్ కేరక్టర్ ఈ సవిత. ఈమెకి పెళ్లయి భర్త ఉంటాడు. అయినా సరయిన తృప్తి లేక తనకి నచ్చిన వారితో శృంగార సాగరంలో తేలియాడుతూ ఉంటుంది. శుద్ధంగా చీరకట్టు, బొట్టుతో అచ్చమయిన భారత నారిలా కనిపించే ఈమె బ్రాలు అమ్మడానికి వచ్చిన సేల్స్ మాన్‌తో, భర్త కొలీగ్‌తో, వీదిలో క్రికెట్ ఆడుతూ బాల్ ఇంట్లో పడితే దాని కోసం వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళతో ఇలా అనేక మందితో జల్సా చేస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ ఆ సైట్‌లో కామిక్ సీరియల్‌గా వచ్చేవి.

భారతీయ సంస్కృతిని ఈ కామిక్ నాశనం చేస్తూందని రాజకీయ నాయకులు పార్లమెంట్‌లో గోల చేసి ఆ సైట్‌ని నిషేధించారు. అయినా నెట్‌లో ఈ ఆంటీ సాహసాలు ఇప్పటికీ చూడొచ్చు. ఇక్కడ బ్యాన్ చేశాక ఈమె తన అడ్రస్ ఆస్ట్రేలియాకి మార్చి kirtu.com అన్న సైట్‌లో తన హవా అప్రతిహతంగా కనసాగిస్తూ ఉంది. అన్నట్టు ఈ బాబీకి ఫేస్‌బుక్‌లో కూడా అకౌంట్ ఉంది. www.facebook.com/BhabhiSavita.

ఈ సెక్సీ ఆంటీ మీద వర్మ గారి చూపు పడింది. తనని పరాజయాల పరంపర నుంచి తప్పించే శక్తి ఈ బాబీకె ఉందని డిసైడైన వర్మ ఇప్పుడు ఈమె గురించిన సినిమాకి స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నాడు. అప్పల్రాజు లాంటి కామెడీ సినిమాలో ఒక పాటలో డాన్సర్ తొడల మధ్య, రొమ్ముల మీద కెమెరా పెట్టి అందాలని తెర మీద ఆరబోసిన వర్మ ఇప్పుడు సవిత బాబీ అందాలని విప్పి చూపించబోతున్నాడు. వర్మ ఏం చూపించమంటే అంత కన్నా ఎక్కువగా చూపించడానికి రెడీగా ఉండే రోజ్లిన్ ఖాన్‌ని సవితా బాబీ పాత్రలో ప్లాన్ చేస్తున్నాడట వర్మ. అయితే బాలీవుడ్ కథనాల ప్రకారం వర్మ ఈ సినిమాకి నిర్మాతగా మాత్రమే ఉంటాడట. తన శిబిరంలోని ఒక శిష్యుడికి దర్శకత్వ బాధ్యత అప్పగిస్తాడట. 

ఫ్లాపుల పరంపరనుంచి వర్మ గారిని సవితా బాబీ, రోజ్లిన్ ఖాన్‌లు బయట పడేస్తారేమో వేచి చూద్దాం.

3 comments:

Anonymous said...

Savitha is sexier than Rozlyn.

Anonymous said...

సెప్పుదండ గారు: ఇలాంటివి మీ ఫేమిలీ సభ్యులతో చర్చించుకోవాల్సిన విషయాలు. ఇలా ఇక్కడ విప్పి వుతికి ఆరేసుకోవడం న్యాయంగా లేదు. మీ బ్లాగు తెలుగు బ్లాగుల్లో వుండటం సమాజానికి ఏవిధంగా వుపయోగపడుతుందనుకుంటున్నారు? ఆ బూతు రాతలు, బొమ్మలు వేయడం ద్వారా మీరు ఏమి చెప్పదలుచుకున్నారు?

Anonymous said...

ఈ పోస్టులో అంత బూతు ఉందంటారా?