ఒక ఆడ కుక్క ఒక రాత్రి వేళ బయటకి వచ్చింది. దానిని కొన్ని మగ కుక్కలు చూశాయి. ఆ మగ కుక్కల గుంపుని చూసిన ఆడ కుక్క మనసులో డిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన మెదిలింది. దానితో అది భయంతో వణికి పోయింది.
ఆ కుక్క భయాన్ని గమనించిన ఒక మగ కుక్క దాని దగ్గరికి వచ్చి ఇలా అంది:
"భయ పడకు. మనం కుక్కలం, మనుషులం కాదు."
4 comments:
Super!
adirindi
brahmandamaina cheppu debbaandi!
అహ్హహ్హా ... చాల బాగుంది.
లోగడ నా ’మౌక్తికం’ బ్లాగులో నేను వ్రాసిన " శునక సూక్తి ముక్తావళి " అన్న ఈ క్రింది పద్యం గుర్తుకు తెచ్చారు!
" విశ్వాస హీనులై విర్రవీగ, మనము
మానవులము కాము - మరచి పోకు!
సాటి వారనిన ఈర్ష్యా ద్వేషముల్ గల్గ,
మానవులము కాము - మరచి పోకు!
ఐకమత్య మొకింత లేక కాట్లాడగా,
మానవులము కాము - మరచి పోకు!
యజమాని యెడ విధేయత వీడి వర్తింప,
మానవులము కాము - మరచి పోకు!
శునకమన - కాస్త ’శునకత్వము’ ను గలుగుచు,
సాటి శునకాల గౌరవించవలె - " నంచు
పిల్ల కుక్కకు బోధించె పెద్ద కుక్క
శునక పరిభాషలో నీతి సూక్తులెన్నొ!"
Post a Comment