నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 21, 2010

తుఫానులకి పెట్టాలంటే మన పేర్లు లేవా?

తుఫానులకు పేర్లు పెట్టడం మనవాళ్ళు ఈమధ్య కొత్తగా నేర్చుకొంటున్నారు.ఇది అమెరికావాళ్ళను చూసి నేర్చుకొటున్న అలవాటు.ఆమధ్యన అమెరికా వాళ్ళు ఒక తుఫానుకు,వాళ్ళు దానిని హరికేను అని పిలుస్తారు, కత్రినా పేరు పెట్టడం నాకు భాధ కలిగించింది. కత్రినా కైఫ్ ఎంత అందంగా,నాజూగ్గా ఉంటుంది!అలాంటిది ఆమె పేరు అంత విధ్వంసకర తుఫానుకు పెట్టడం ఏమైనా పద్ధతిగా ఉందా అని ఆ పేరు పెట్టిన వాడినడుగుదామనిపించింది.అయినా వాడెవరో గాని కత్రినా కైఫ్ మొహం చూడని వాడైఉంటాడ్లే అని . సర్దుకొన్నాను

ఆయిన మనవాళ్ళకి తుఫానులకు పెట్టడానికి పేర్లే లేనట్టు ఈ ఐలా,లైలా లాంటి పేర్లేమిటండీ? విధ్వన్సాన్నీ,వినాశనతనీ సూచించడానికి మనకి పేర్లు కొదవా?ఒక్కసారి అలా పురాణాలు తిరగేస్తే చాలదూ?
తటకి, పూతన, శూర్పణఖ,లంఖిణీ,శాఖిణీ.ఢాఖిణీ, ఇలా ఎన్ని పేర్లు లేవు?

ఆయిన ఇలాంటి నాశనం చేసేవాటికి అన్నిటికీ ఆడపేర్లే పెట్టడం ఏమిటని ఫెమినిస్టులు గొడవ చేస్తే మగ పేర్లు కూడా ఉన్నాయి కదా?
కంస,రావణ,నరకాసుర,హిడింబాసుర, మారీచ, సుబహు,హిరణ్యాక్ష, హిరణ్య కశ్యప ఇలా ఎన్ని లేవు?

కాబట్టి వాతావరణ శాఖ వాళ్ళూ కొంత నేటివిటీ చూపండి.

Thursday, May 20, 2010

వయాగ్రా...ఆ..ఆ..ఆ..

1992 లొ వేల్సు లొని ఒక చిన్న నగరంలొ ప్రజలని ఫైజర్ కంపెని వారు తమ కొత్త ఔషధాన్ని ప్రయోగపుర్వకంగా పరిశీలించడానికి ఎన్నుకొన్నారు.గుండెపోటుమీద పనిచేసే మందు అది.మధ్యవస్కులైన వ్యక్తులను కొంతమందిని ఎంపిక చేసి వరిమీద ఆ మందు ఎలా పని చేస్తుందొ చూస్తారు.
గుండె నిండుగ రక్తం ఉన్నా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరొనరి రక్త నాళాలలో సరిగ రక్తం ప్రవహించకపోతే గుండెపోటు వస్తుంది.ఈ కొత్త మందు ఆ రక్త నాళాలు వ్యాకొచించేలాగా చేసి వాటిలో అధిక రక్త ప్రసారణ జరిగేలా చేస్తుంది.తద్వారా గుండెపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తల అంచనా.

కొంతకాలం పరిశోధనల తరువాత ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో ఆ కంపెనీ ఆ పరిశోధనని నిలిపివేసింది.అ విషయం ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్లకి చెప్పి వారి పారితోషికం చెల్లించి మిగిలిన బిళ్ళలు వెనక్కి ఇమ్మంటే చాలా మంది పురుషులు ఒప్పుకోలేదు.పైపెచ్చు తమకి ఇంకా కొన్ని టాబ్లెట్లు కావాలని అడిగారు.

సంగతేమిటా అని ఆ పరిశొధన నిర్వహిస్తున్న సైంటిస్టులు ఆరా తీస్తే తెలిసిందేమిటంటే ఆ మందు తీసుకోవడం మొదలు పెట్టిన నాటినుంచి వాళ్ళ శృంగార జీవితం అనూహ్యంగా మారింది.ఆ మందు పురుషాంగం లోని రక్తనాళాలలో రక్తం ఎక్కువ చేసి అంగ స్తంభన కలిగించింది.దాంతో అప్పటివరకూ అంగ స్తంభన లేక శృంగారం చేయలేకపోయిన మధ్యవయస్కులందరూ మదన కామరాజుల్లాగా రెచ్చిపోసాగారు.
ఈ విషయం కంపెనీ చీఫ్ సైంటిస్టులకి తెలిశాక అదే మందుని గుండెపోటుకి కాకుండా ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ అంటే అంగ స్తంభన లేకపోవడం అనే వ్యాధికి నివారణగా మార్కెట్ లో ప్రవేశ పెట్టారు.అది సూపర్ డూపర్ హిట్టైంది.అదే సిల్డెనఫిల్ సిట్రేట్ లేదా వయాగ్రా!
విదేశీ మార్కెట్లో వచ్చిన కొన్నాళ్ళకే మన దేశంలో కూడా ఈ మందుని స్వదేశీ కంపెనీలు చవకగా ప్రవేశ పెట్టాయి.మరి భారతీయ పురుషులు కూడా అనందాన్ని అనుభవించాలిగా!
కాకపోతే మన కంపెనీలు వయగ్రా గియాగ్రా అని తలా తోకా లెని పేరు కాకుండా పెరులోనే అంతా తెలిసేలాగా నామకరణం చేశాయి.కొన్ని ఉదాహరణలు చూడండి.


Air bus,Adam's delite, D'zire,Erectra,Funn,Getup,Kamagra,Lifty, Man force,Manly,Raise,Reforce, Rocky,Stallion,Stand, Target, Uplift,Yuvagra,Zaneman.

Thursday, May 13, 2010

ఆడపిల్లల్ని చూసి నేర్చుకోండిరా నాయనా!

ఒక మ్యాచ్ కి కోట్లలో పారితోషికం చెల్లింపు,కోటాను కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో,ఇవి చాలవన్నట్టు ఐపీఎల్ ద్వారా మరిన్ని కోట్లు, టీవీ పెడితే ప్రకటనల్లోనూ,వార్తల్లోనూ,ప్రత్యేక ప్రోగ్రాముల్లోనూ వీళ్ళ ముఖాలు అను క్షణం మన వద్దన్నా తప్పించుకోలేనంత హంగామా!
పగలు ఆట,పొద్దు పోతే తెల్లవారేంత దాకా పబ్బులూ, పార్టీలూ,చేతుల్లో సినిమా హీరోయిన్లూ,ఎక్కడికి పోయినా ఎగబడి అటొగ్రాఫులు తీసుకొనే వాళ్ళు ఎగబడి ముద్దులు పెట్టే ఆడ అభిమానులూ ... ఇంత చేసీ టీ ట్వంటీ ప్రపంచ కప్పులో సూపర్ ఎయిట్ లొ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తిరుగు ముఖం పట్టడం!
మన క్రికెటర్ల ఆట తీరు ఇదీ!అయినా వాళ్ళనని ఏమి లాభం?ఈ చెత్త వెధవలకి ఇంతలేసి చెల్లించే బోర్డునీ, ఈ చెత్త ముఖాలని నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూసే మనల్నీ తిట్టుకోవాలి.

అదే మన మహిళా క్రికెట్ టీం చూడండి.అదే వెస్ట్ ఇండీస్ లో అదే కప్పులో సెమీ ఫైనల్స్ కి చేరుకొన్నారు.పాపం వాళ్ళకి ఇంతింత పారితోషికాలు లేవు,ఇంత కవరేజి లేదు, అసలు వాళ్ళు ఆడుతున్నట్టు,ఇంత బాగా ఆడుతున్నట్టూ చాలా మందికి తెలియనే తెలియదు.
కాబట్టే వాళ్ళు అంత బాగా ఆడుతున్నారేమో?
క్రికెట్ బోర్డు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మగ క్రికెటర్లకిచ్చే పారితోషికం తగ్గించి ఆ డబ్బుతో మహిళా క్రికెటర్లని ప్రోత్సహించడం, దేశ వాళీ క్రికెట్ ని అభివృద్ధి చేయడం లాంటి పనికొచ్చే పనులు చేయడం మంచిది.మన కూడా దేభ్యం మొహాలేసుకొని వీళ్ళ ఆట చూడ్డం మానేసి కొంచెం పనికొచ్చే పనులు చూసుకొంటే మనక్కూడా మంచిది.అలా చేస్తే మన పెళ్ళాలు కూడా సంతోషిస్తారేమో!

Tuesday, May 11, 2010

చదరంగపు రారాజుకి జేజేలు!!!!!


అసలైన చాంపియన్లని చిన్న చిన్న అడ్డంకులు ఏమీ చేయలేవని మన చదరంగపు చాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ నిరూపించాడు.ఐస్ లాండ్ అగ్నిపర్వతం పుణ్యమ అని 40 గంటలు రోడ్డు మీద ప్రయాణం చేసి బల్గేరియా చేరుకొని ఆ పక్క రోజే తొపాలోవ్ తో మ్యాచ్ ఆడ్డం ప్రారంభించి తొలి గేము లోనే పరాజయం పాలయినా వెంటనే తేరుకొని చివరి గేము వరకు సమవుజ్జిగా కొనసాగి చివరి గేములో నల్లపావులతో డ్రా చేసుకొంటాడని అందరూ భావించినా ప్రత్యర్ధిపై తిరుగులేని విజయం సాధించి ప్రపంచ చాంపియన్ గా అవతరించిన విషీ ఆనంద్ కి ఈ బ్లాగ్ తరఫునా బ్లాగ్ పాఠకుల తరఫునా వందనాలు జేజేలు. ఇలాగె మరిన్ని విజయాలు సాధించి చదరంగపు పుట్టినిల్లయిన భారతదేశంలో ఆ క్రీడకు మరింత ఆదరణ తెచ్చి మరెందరో చాంపియన్లని తయారు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

ఆరోగ్యశ్రీ నిజంగా అంత సూపరా?

ఆరోగ్యశ్రీ పధకం వల్లనే గెలిచామని కాంగ్రెస్సోళ్ళూ,దాని వల్లనే ఓడామని అపోజిషనోళ్ళూ మొన్న ఎన్నికలలో చెప్పుకొన్నారు.దేశ విదేశాల నుంచి ఈ పధకాన్ని పరిశీలించడానికి ప్రతినిధులు వస్తున్నారని ఏలిన వారు గొప్పలు చెప్పుకొంటున్నారు.ప్రతిపక్షాల వాళ్ళూ కూడా ఈ పధకానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడానికి కూడా జంకుతున్నారు.
నిజంగా ఇది అంత సూపర్ డూపర్ స్కీమా?

ఈ పధకం గురించి చెప్పడానికి నాకు ఒక ఉదాహరణ గుర్తుకొస్తూంది.ఒక ఊరిలో వెయ్యి మంది జనం ఉంటారు.వారికి తాగు నీటి సమస్య ఉంటుంది,దాన్ని నివరించుకోవడానికి ఒక లక్ష రూపాయలు నిధి ఉంటుంది.ఆ లక్ష పెట్టి ఒక తాగు నీటి బావి తవ్వుకోకుండా తలా మూడో నాలుగో మినరల్ వాటర్ బాటిళ్ళు కొంటే ఎలా ఉంటుందో ఈ పధకం కూడా అలాగే ఉంది అని నా అభిప్రాయం.

కార్పొరేట్ హాస్పిటళ్ళ జెబులు నింపేబదులు ఆ డబ్బు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులని బాగు చేసి అందులొని సిబ్బందికి ఇన్సెంటివ్ గా ఇస్తే బావుండేదేమోనని అనిపిస్తుంది.

ఇప్పటికి బానే ఉంది గానీ కొన్నాళ్ళకి ప్రభుత్వం చేతులెత్తేసి అరోగ్యశ్రీని అటకెక్కించేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు.









Monday, May 10, 2010

వీళ్ళు కచ్చితంగా చోకర్సే!!!!!!!1

నేను మొదటినుండీ సౌతాఫ్రికా క్రికెట్ టీం అభిమానిని.వాళ్ళు అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి అడుగు పెట్టినప్పటినుంచీ ఆ జట్టు నన్ను ఆకట్టుకొంటూ వచ్చింది.వాళ్ళ తొలి అంతర్జాతీయ పర్యటన భారత్ లోనే జరిగింది.క్లైవ్ రైస్ సారధ్యంలోని ఆ జట్టు తొలి రెండు మ్యాచులు ఓడిపోయి మూడవ మ్యాచ్ లో మంచి విజయం సాధించింది.
వాళ్ళు తొలి వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఆడారు.అందులో సెమీఫైనల్ లో గెలిచే దశలో వర్షం వచ్చింది.ఆ టోర్నమెంటులో ఒక చెత్త రూలు మూలంగా 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన ఆ జట్టు పది నిమిషలు వర్షం అంతరాయం వలన ఒక బంతిలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది.అయ్యో పాపం అని బాధపడి ఆ తిక్క రూలు పెట్టిన ఆస్ట్రేలియా మెంటల్ గాళ్ళని తిట్టుకొని తరువాతి కప్ ఇంక వీళ్ళదే అని డిసైడై పోయాను.

తరువాతి కప్పు ఇండియా,లంక,పాకిస్తానులో జరిగింది.హ్యాన్సీ క్రోన్యే నాయకత్వంలొ ఆ జట్టు చాలా పటిష్టంగా కనిపించింది.ఇమ్రాన్ ఖాన్ కూడా వాళ్ళ ఆట చూసి ముచ్చట పడి పోయి వాళ్ళ బౌలర్లు వికెట్లు తీయలేకపోతే ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ని ఔట్ చేయడానికి జాంటీ రోడ్స్ వున్నాడుగా అని కితాబిచ్చాడు.దానికి తోడు లీగ్ దశలో ఆడిన అయిదు మ్యాచులూ గెలిచి అజేయుల మనిపించుకున్నారు.కోచ్ బాబ్ వూల్మర్ తన ల్యాప్ టాప్ పైననే మ్యాచ్ గెలిపించేస్తాడన్న నమ్మకం కలిగించాడు.క్వార్టర్ ఫైనల్లొ వాళ్ళ ఖర్మ కాలి బ్రియన్ లారా అరివీరభయంకర సెంచరీ సాధించి వాళ్ళని ఇంటికి పంపాడు.
2000 కప్పులో కూడా లీగ్ దశలో ఎదురులేకుండా సాగి సెమి ఫైనల్ లో లాన్స్ క్లూసెనర్ వీరోచిత బ్యాటింగుని అలాన్ డొనాల్ద్ మూర్ఖత్వం డామినేట్ చేయడంతో ఇంటిదారి పట్టింది.
తరువాతి కప్పు సౌత్ ఆఫ్రికాలో జరగడంతో ఇంక ఈసారి అయినా వీళ్ళు గెలవక తప్పదు అనుకొన్నాను.క్రికెట్ ప్రపంచానికి కంప్యూటర్లొ ప్రత్యర్ధి జట్ల బలాలు బలహీనతల్ని విశ్లేషించి ప్రణాళికల్ని రూపొందించడాన్ని నేర్పిన జట్టు ఒక చిన్న కాన్వెంటు పిల్లవాడికి సైతం అర్ధమయ్యే విషయాన్ని అర్ధం చేసుకోలేక వర్షం దెబ్బకి వెనుతిరిగింది.శ్రీలంకతో గెలిచి తీరాల్సిన మ్యాచ్ వర్షం వలన ఆగే సమయానికి సౌత్ ఆఫ్రికా డక్ వర్త్ లూయీస్ పద్దతిలో గెలుపుకి కావలసిన పరుగులు సాధించింది.అయితే వర్షం వచ్చెముందు ఇంకొక బంతి వెయడానికి టైం ఉన్నది.ఆ బంతికి మరొక పరుగు తీసి ఉంటే విజయం దక్కేది.పరుగు తీసె అవకాశం ఉన్నా గెలిచేశం కద రిస్కు ఎందుకు అని సౌత్ ఆఫ్రికన్లు పరుగు తీయలెదు.ఇంకొక బంతి వెయడంతో ఈక్వేషన్లు మారిపోయి సౌత్ ఆఫ్రికా ఓడిపొయింది.
2007 లో నంబర్ వన్ టీముగా సెమీ ఫైనల్ చేరుకున్నా అక్కడ ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ తిని నిష్క్రమించింది.

సరే 20-20 లొ చూద్దామంటే తొలి సారి స్వదేశంలో జరిగిన కప్పులో సెమీ ఫైనల్స్ చేరకుండానే మటాషై పోయింది.తరువాతి కప్పులో సెమీ ఫైనల్లో గెలుపు ముంగిటిలో తచ్చాట్లాడి అలవాటు ప్రకారం ఓటమిని కౌగిలించుకొంది.ఈ రోజు కూడా ఒక దశలో గెలుస్తుంది అనిపించి పరాజయం పాలయ్యింది.

కాబట్టి సౌత్ ఆఫ్రికన్లని ప్రోటియాస్ అనేకన్నా చోకర్స్ అని పిలవడం బావుంటుంది.