నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 30, 2011

రాష్ట్రానికి ALDS పట్టింది, వెంటిలేటర్ మీద పెట్టండి


ARDS అని ఒక కండీషన్ ఉంది. శ్వాస పీల్చుకోవడానికి కష్టపడుతుంటాడు ఇది వచ్చిన పేషంట్. దానితో ICU లోకి, వెంటిలేటర్ మీదికి అక్కడినుంచి మరణానికి చేరువవుతాడు. Acute Respiratory Distress Syndrome అంటారు దీనిని. ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా ఇలాంటిదే ALDS అన్న జబ్బు చేసింది. Acute Leadership Deficit Syndrome అని పిలవచ్చు దీనిని. సరయిన నాయకుడు లేక రాష్ట్రం ఊపిరాడక అల్లాడుతోంది. ప్రతిరోజూ పేపర్లో నాయకుల ఫోటోలు చూస్తూ ఉంటాం అలాంటిది నాయకుడే లేడు అంటాడు వీడెవడురా అనుకోవద్దు. కావాలంటే మీరే దీన్ని సాంతం చదవండి.
  


ఇప్పుడు నాయకుడయి ఒకాయన పాలిస్తున్నాడు. తాను నాయకుడినని గద్దెనెక్కే క్షణం వరకూ ఆయనకే తెలియదు. ఆయన నాయకుడని గద్దె నెక్కాక కూడా ఆయన కింద పనిచేసే మంత్రులకు తెలియదు, ఇప్పటికీ ప్రజలకు తెలియదు. లక్షలకు లక్షలు ఉద్యోగాలిస్తానని, కోట్లకి కోట్లు ఋణాలిస్తానని, ముందుంది ముసళ్ల పండగ, సారీ, మంచి కాలం అని రోజూ పేపర్లలో ప్రకటనలు దంచి పారేసి, చివరికి ముడ్డి కడుక్కోవడానికి కూడా డిల్లీ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తుంటాడు ఈ నాయకుడు. ఇక ఈయనకు పోటీగా కుర్చీ ఎక్కడానికి సిద్ధంగా నిరీక్షిస్తున్న మరొకాయన్ని చూస్తే ఈయన వంటి నిండా సారా కంపు, అవినీతి మరకలు. 
  


ఒకప్పుడు కుర్చీని మాయోపాయంతో దక్కించుకొని, తరువాత పోగొట్టుకుని తిరిగి ఎక్కడానికి శతవిధాల యత్నిస్తున్న ఒక బాబు గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల దాకా ఎందుకు ఆయన అనుచరులే ఆయన్ని నమ్మేలా లేరు. నా తండ్రి కుర్చీ నాకు ఇవాల్సిందే అని రాష్ట్రమంతా తిరిగి గీపెట్టి గోల చేస్తున్న యువరాజు ఎప్పుడు శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పోవల్సి వస్తుందో తెలియని స్థితి.
 
ఇప్పుడు ఉన్న వారందరూ చేతగాని సన్నాసులు, అవినీతి కంపు కొట్టే దరిద్రులూ, స్వచ్చమైన పాలన కావాలంటే నేను రాజకీయాల్లోకి రావల్సిందే అని రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఒక ఆశాజ్యోతి పదవుల్లేకపోతే నేను బతకలేనని ఆ సన్నాసులూ, దరిద్రులతోనే కలిసి పోయి వారి మోచేతి నీరు తాగడానికి సిద్ధమయి పోయాడు. ఇక రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా పని చేసే వాడొకడు, ఏం పని చేయాలో తెలియక పిచ్చిగా తిరుగుతూ, ఎక్కడో నక్కి అప్పుడప్పుడూ తాము బతికే ఉన్నామని కలుగులోఛి బయటకొచ్చే ఎర్ర ఎలుకలూ, సత్తా లేని, పత్తాలేని నాయకుడు ఇంకొకాయన... వీళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రానికి దిక్కు. 


  
కాబట్టి నాయకుడయి ముందుండి నడిపించేవాడు వచ్చే వరకూ ఈ రాష్ట్రానికి ఈ జబ్బు నయం అయ్యే అవకాశం లేదు.

Thursday, December 29, 2011

రాజన్న సినిమాలో మల్లమ్మ డిల్లీకి నడిచి వెళుతూ రాజస్థాన్‌కి ఎందుకు వెళ్ళి ఉంటుందంటే......


ఆదిలాబాద్ నుంచి డిల్లీకి నడిచి వెళ్ళే దారిలో రాజస్థాన్ వస్తుందా? రాజన్న సినిమా చూసి వస్తుంటే నా ఫ్రెండ్ నన్ను అడిగిన ప్రశ్న ఇది. వాడే కాదు, రాజన్న సినిమాని రివ్యూ చేసిన వాళ్ళు కొందరు తమ బ్లాగుల్లో కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపించారు. అయితే అదేమంత తప్పు కానీ, పొరబాటు కానీ కాదని నా ఉద్ధేశ్యం.

 
చిన్న పిల్ల ఏమీ తెలియకుండా, ఎవరూ తోడు లేకుండా ఒక్కటే అంత దూరం నడిచే వెళ్ళే సమయంలో దారి తెలియకుండా ఎక్కడో పొరబాటుగా వాయవ్య దిశగా  తిరిగి రాజస్థాన్ వెళ్ళి అక్కడ ఎవరో చెప్తే తిరిగి డిల్లీ దారి పట్టి ఉంటుందని అనుకుంటే సరి.

Sunday, December 25, 2011

వ్యోమగాముల వీధిలో ఇంటి పైన రాలి పడ్డ ఉపగ్రహం


2011 లో రష్యా ప్రయోగించిన ఉపగ్రహాలు ఎక్కువ భాగం నేల మీదే రాలిపోయాయి. ఈ సంవత్సరం మొత్తం ఆరు ఉపగ్రహాలు తమ కక్ష్యలోకి చేరకుండా రాలిపోయాయి. సాధారణంగా ఇలా భూమి మీద పడ్డ వాటిలో అధిక భాగం ఎక్కడో ఎడారులలోనో, సముద్రాలలోనో పడుతుంటాయి. అప్పుడెప్పుడొ స్కైలాబ్ గానీ, మొన్నీ మధ్య ఒక అమెరికన్ ఉపగ్రహం కానీ జనావాసాల మధ్య పడే అవకాశం ఉందని భయ పెట్టినా అవి చివరికి ఎక్కడో సముద్రాలలో కూలిపోయి ఎవరికీ హాని కలిగించలేదు.




అయితే శుక్రవారం రష్యన్లు సోయుజ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన మెరిడియన్ అనే ఉపగ్రహం మాత్రం అలా కాకుండా జనావాసం మధ్య పడడానికి ఎంచుకుంది. దీనిలో ఐరనీ ఏమిటంటే అది అందుకు ఎంచుకున్న ప్రదేశం. రష్యా దేశానికి చెందిన ఆసియా భూభాగంలోని సైబీరియా ప్రాంతంలో నోవోబిర్స్క్ ప్రాంతంలో ఒర్డిన్స్క్ జిల్లాలో వాగైత్సెవో అన్న గ్రామం ఉంది. ఈ ఊరిలో కాస్మొనాట్ వీధి ఉంది. కాస్మొనాట్ అంటే వ్యోమగామి. అమెరికన్లు ఆస్ట్రొనాట్ అంటే రష్యన్లు కాస్మొనాట్ అంటారు. తమ దేశానికి అంతరిక్ష రంగంలో పేరు తెచ్చి పెట్టిన యూరి గగారిన్, వాలెంటినా టెరిష్కోవా లాంటి వ్యోమగాములని పురస్కరించుకొని ఆ వీధికి ఆ పేరు పెట్టారు. 
  
ఆ వీధిలో ఆండ్రీ క్రివోరుచెంకోకి చెందిన ఇంటి మీద మెరీడియన్ ఉపగ్రహానికి చెందిన అర మీటరు వ్యాసం గల ఒక గోళం వచ్చి పడి ఇంటి కప్పుకి రంధ్రం చేసింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు. ఇంటికి జరిగిన నష్టాన్ని తాము భరిస్తామని రష్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.
Locator map 


 ఈ సంవత్సరం రష్యా అంతరిక్ష ప్రయోగాలకి అచ్చి రాలేదు. ఆరు ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇదే సోయుజ్ రకానికి చెందిన మరో రాకెట్ ప్రయోగం ఇవాళ(డిసెంబరు26) రష్యాలోని బైకనూర్‌లో జరగనుంది. అదైనా విజయవంతం కావాలని అధికారులు ఆశిస్తున్నారు.



Saturday, December 24, 2011

అక్కడ స్కూల్స్‌లో కాళ్ళూ చేతులూ నరకడమే సిలబస్


సౌదీ అరేబియాలో పాఠశాలల్లో పిల్లల పాఠ్య పుస్తకాలలో షరియా చట్తం విధించే శిక్షలకి అనుగుణంగా చేతులూ నరకడం ఎలాగా అన్నదే సిలబస్‌గా ఉంది. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల పిల్లల పుస్తకాలలో ఈ పాఠాలు ఉన్నాయి. యూదులని నాశనం చేయాలి అని, హొమో సెక్సువల్స్ సమాజానికి హాని కరం కాబట్టి వారిని నాశనం చేయాలి అని ఈ పాఠాల సారాంశం.


Barbaric: These textbooks handed out in Saudi Arabian schools teach children how to cut off a thief's hands and feet under Sharia law 

ఇది ఆ పుస్తకంలో ఒక పేజి

School prayers in Jeddah, Saudi Arabia, where children learn how to chop off the hands and feet of thieves, it is claimed  

చిన్నప్పటి నుండి ఇలా పాఠాలు చెప్తూ ఉంటే టెర్రరిస్టులు తయారు కాకుండా ఉంటారా అని వీటిని చూసిన వారు వాపోతున్నారు. యూదులు, స్వలింగ సంపర్కులనే కాకుండా ఆడవారి మీద కూడా ఈ పుస్తకాలలో తక్కువగా చూపిస్తున్నారు. ఆడవారు బలహీనులు, బాధ్యత లేని వారు అని వీటిలో ఉంటుంది.
 


యూదులతో యుద్ధం చేసి వారిని సమూలంగా నాశనం చేయడమే ప్రతి ఒక్కరి బాధ్యత అన్నది ఈ పాఠాలలో ముఖ్యమైన పాయింట్.

Friday, December 23, 2011

ఓహో మేఘ మాలా......(మేఘ మాల ఫోటోలు)


మేఘాలలో చాలా రకలున్నాయి. వాతావరణంలో తేమ, గాలి వేగం ఆధారంగా ఈ మేఘాల రంగు, ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు. ఆ మధ్య రాజ శేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు క్యుములో నింబస్ మేఘాలు అన్న పదం పాపులర్ అయింది.


కటకం(lerns) ఆకారంలో ఉండే మేఘాలని lenticular clouds అంటారు. గాలి పర్వత శ్రేణుల మీదుగా ప్రయాణం చేసే సమయంలో ఈ మేఘాలు ఏర్పడుతాయి. ఈ మేఘాలనే చాలా సార్లు ఫ్లయింగ్ సాసర్లు (UFO) లుగా భ్రమ పడుతుంటారు. 
Dramatic "saucer cloud" over Campbell Mesa, Flagstaff, Arizona  


ఇంగ్లండ్ లోని యార్క్‌షైర్‌లో BBC ఫోటోగ్రాఫర్ కెమెరాకి దొరికిన కొన్ని లెంటిక్యులర్ మేఘాల ఫోటోలివి.

Cloud over Holmfirth   Cloud over HorsforthClouds over windfarm at OxenhopeCloud over Denholme Cloud over Sowerby Bridge 
Cloud over Horsforth

Thursday, December 22, 2011

ఆ శిశువుకి రెండు తలలున్నాయి


రామాయణంలో రావణాసురుడికి పది తలలున్నాయని రాశారు. అయితే సినిమాలలో ఎంటీఆర్ ఒక తలతోనే కనిపిస్తాడు. యానిమేషన్ చిత్రాలలో రాముడితో చివరి యుద్ధం చేసే సమయంలో పది తలలు ఉన్నట్లు, రాముడు వాటిని ఒక్కొక్కదాన్ని తెగ వేస్తుంటే అవి మళ్ళీ మొలుస్తున్నట్టు చూపిస్తారు. అయితే మనకు తెలిసి మనుషులకు ఒకటే తల ఉంటుంది. శరీరాలు అతుక్కుని పుట్టిన సయామీస్ ట్విన్స్ విషయంలో రెండు తలలు ఉన్నా అవి రెండు శరీరాలు.
 


అయితే ఈ సోమ వారం బ్రెజిల్‌లో ఒక తల్లి రెండు తలల శిశువుకి జన్మనిచ్చింది. ఒకటే శరీరం, రెండు తలలు ఉన్న ఆ శిశువు నిజానికి ఒక రకం సయామిస్ (conjoined) ట్విన్స్  రకానికి చెందినది. ఆమె బ్రెజిల్‌లో మారు మూల ప్రాంతంలో ఉన్నందువలన కాన్పుకి ముందు స్కానింగ్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే కాన్పు కష్టం కావడం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళి సిజేరియన్ చేశాక కానీ విషయం తెలియలేదు.
Mother's pride: The mother insisted she was delighted with her newborn who weighed 9.9lbs     
డాక్టర్లు పరీక్షలు చేశాక ఆ శిశువుకి రెండు మెదడులు, వెన్నుపూసలు ఉన్నట్లు, అయితే గుండె, కాలేయం ఒకటే ఉన్నట్లు, కిడ్నీలు, ఊపిరి తిత్తులు కూడా ఒక జత మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలా జన్యు లోపాలతో పుట్టిన వారిలో ఇతర అవయవ సంబంధమయిన లోపాలు ఉంటాయి. అయితే ఈ శిశువులో అవేమీ లేవు. ఆ శిశువు రెండు తలలతోనూ స్తన్యం సేవిస్తుంది. చాలా అరుదుగా సంభవించే ఈ రకమయిన కవలలని dicephalic paraphagus అంటారు.


రెండు తలలు పూర్తిగా అభివృద్ధి చెంది ఆరోగ్యంగా ఉన్నందు వలన ఆపరేషన్ చేసి ఒక తలని తొలగించాలన్న ఆలోచన ఏదీ చేయడం లేదని డాక్టర్లు చెప్పారు. మరి కొన్నాళ్ళు వేచి చూసి ఒక నిర్ణయం తీసుకొంటామన్నారు. క్రిస్‌మస్ నెలలో పుట్టారు కాబట్టి వారిద్దరికీ ఇమ్మాన్యుయేల్, జీసస్ అని పేర్లు పెట్టారు తల్లి తండ్రులు.


అతి అరుదయిన ఇలాంటి జననం మరొకటి ఈ సంవత్సరం బ్రెజిల్‌లోనే జరిగింది. అయితె ఆ శిశువు పుట్టిన కొన్ని గంటల్లోనే మరణించింది.


అమెరికాలోని మిన్నెసోటాలో అబిగైల్, బ్రిటాన్నీ అనే ఇలాంటి జంట 1990 లో జన్మించి ఎలాంటి ఆరోగ్యపర సమస్యలు లేకుండా జీవిస్తూ ఉంది. వీరి గురించి డిస్కవరీ చానల్, ఓప్రా విన్‌ఫ్రే షొ లలో కూడా చూపించారు.
  
 శరీరాలు కలిసి ఉన్నా ఆలోచనలు వేరుగా ఉన్న వీరికి వ్యక్తిత్వాలు కూడా వేరుగా ఉన్నాయి. అభిరుచులు, ఇష్టాలు వేరు వేరుగా శరీరాలు ఒకటిగా వీరు బతుకుతున్నారు.