నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, December 1, 2011

వీర్యం కోసం మగవారిని రేప్ చేస్తున్న జింబాబ్వే మహిళలు


వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. జింబాబ్వేలో ఎన్నాళ్ళగానో సాగుతున్న ఈ అరాచకంలో ఇప్పుడే అరెస్టుల పర్వం మొదలయింది. తనని ముగ్గురు మహిళలు మానభంగం చేశారని ఒక యువకుడు ముందుకు రావడంతో మొట్ట మొదటి కేసు నమోదయింది. టెలివిజన్‌లో అతడి మొహం చూపకుండా తనకి జరిగిమ దారుణాన్ని అతను చెప్పుకున్నాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్న తనకి ఒక కారులోని వారు లిఫ్టు ఇస్తానంటే ఎక్కానని, కారులో ముగ్గురు ఆడవారు ఉన్నారని, తను ఎక్కిన వెంటనే ఒకామె తన మొహమ్మీద నీరు పోస్తే, ఇంకొకామె ఒక ఇంజెక్షన్ పొడిచిందనీ, దానితో తనలో విపరీతమైన లైంగిక వాంఛ ఏర్పడిందనీ, వారు తనని ఒక నిర్జన ప్రాంతానికి తీసుకెళ్ళి కండోమ్స్ తొడిగి ఒకరి తరువాత ఒకరిగా మళ్ళీ మళ్ళీ రేప్ చేశారనీ చెప్పాడు అతను. ఆ తరువాత తనని అలాగే వదిలేసి వాడిన కండోమ్స్ మాత్రం జాగ్రత్తగా పట్టుకెళ్ళారని చెప్పాడు. ఆడవారు మగ వారిని రేప్ చేయడం అన్నది జింబాబ్వే శిక్షా స్మృతిలో లేనందువలన దాడిగా మాత్రమే ఈ విషయంలో కెసు నమోదు చేశారు పోలీసులు.


 
ఈ సంఘటన జరిగి దాదాపు ఒక ఏదాడి జరిగింది. ఇన్నాళ్ళకి పోలీసుల తనిఖీలో ఒక కారులో ముగ్గురు ఆడవాళ్ళు, ముప్పయి వాడేసిన కండోమ్‌లూ కనిపించడంతో వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారు మాత్రం అలాంటి నేరాలకూ తమకూ సంబంధం లేదనీ, తాము వేశ్యలం మాత్రమేననీ, బిజీగా ఉండడం వలన వాడిన కండోమ్‌లు పారవేయలేకపోయామని చెప్పుకొచ్చారు.అసలు ఇంతకీ ఈ ఆడవాళ్ళు ఇలా మగవారిమీద పడి అత్యాచారాలు చేయడం, అందులోనూ కండోమ్‌లు తొడిగి మరీ చేయడం ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమెస్తుంది. ఇదంతా మగవారి వీర్యం కోసమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా రేప్‌ల ద్వారా వీర్యాన్ని సేకరించే పెద్ద ముఠా ఒకటి ఉందని, ఇలా సేకరించిన వీర్యంతో వ్యాపారాలని అభివృద్ధి చేయడానికీ, డబ్బు సంపాయించడానికి రహస్య పూజలు చేస్తారని అనుమానిస్తున్నారు.


అయితే ఇలా మహిళల చేతిలో మానభంగానికి గురి అయినట్లు చెప్పుకోవడం తమ మగతనానికి అవమానంగా చాలామంది భావిస్తూ ఉండడంతో ఇలా రేప్‌కి గురయిన వారు చాలామంది ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మగవాళ్ళెవరూ అపరిచితులు ముఖ్యంగా ఆడవాళ్ళు కారులో లిఫ్ట్ ఇస్తామంటే తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
People standing by mini bus taxis in Harare, Zimbabwe
ఆడవాళ్ళు మగవారికి కండోమ్ తొడిగి రేప్ చేసి వీర్యం సేకరించడం అనేది నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం. ఇది సాక్షాత్తూ BBC వారి కథనం. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ చూడవచ్చు.
http://www.bbc.co.uk/news/world-africa-15876968
అయినా వీర్యమే కావాలి అనుకుంటే ఇలా రేప్ చేయడం లాంటి రాక్షస కార్యాలు కాకుండా మరెన్ని సరసమైన దారులు లేవు

No comments: