నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 9, 2011

ఆడ వారు అరటి పండు తాకకూడదు అని ఆర్డరేసిన మత పెద్ద


ఆడవారి మీద ఆంక్షలు విధించడంలో ఇస్లాం మత పెద్దల రూటే వేరు. ఈ విషయంలో విరి కున్న సృజనాత్మకతకు అంతు లేదు. అందంగా కనిపించే ఆడవారి వల్ల మగవారికి కలిగే ఇబ్బందులని, తద్వారా వారికి కలిగే ప్రమాదాలని నివారించాలన్న పెద్ద మనసుతో అమ్మాయిలని తల నుండి కాలిదాకా బురఖాతో కప్పేశారు. ఆడవాళ్ళు మగవారి తోడు లేకుండా బయట తిరగ కూడదని కొన్ని దేశాల్లో ఆంక్షలు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లో స్వంత బంధువు చేతిలో ఒకమ్మాయి రేప్‌కి గురయితే ఆ బాధితురాలిని జైలులో పెట్టి తనని రేప్ చేసిన వాడిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటే విడుదల చేస్తామని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ మత పెద్దలు.


 
సౌదీ అరేబియాలో ఆడవారు డ్రైవింగ్ చేయకూడదన్న నిబంధన ఎత్తి వేయడానికి ఈ మత పెద్దలు అంగీకరించడం లేదు. దానికి వారు చెప్పే కారణాలు చాలా వింతగా ఉన్నాయి. ఆడవారిని డ్రైవింగ్ చేయనిస్తే ఆడవాళ్ళందరూ తమ కన్యత్వాన్ని పోగొట్టుకుంటారట. దేశంలో వ్యభిచారం, బూతు, విడాకులు ఎక్కువవుతాయట.
 
ఇది చాలదన్నట్టు ఇప్పటికే కళ్ళు తప్ప మిగతా శరీరమంతా కప్పేలా బురఖా తగిలించుకునే ఆదవారు తమ కళ్ళు కూడ కప్పుకోవాలని కొత్తగా ఆర్డర్ వేశారు ఈ పెద్దలు.  Saudi Arabia's Committee for the Promotion of Virtue and the Prevention of Vice కి చెందిన పెద్దల ప్రకారం కొందరు అమ్మాయిల కళ్ళు కూడా ఆకర్షణియంగా కనిపించి మగవారిని టెంప్ట్ చేస్తాయట.
 
ఈ మూర్ఖ శిఖామణుల జాబితాలోకి ఇప్పుడు మరొకడు చేరాడు. el-Senousa News అనే ఒక మత పత్రికలో ఫత్వా జారీ చెసిన ఒక యూరోప్ ఇస్లాం మత పెద్ద ఆడవారు అరటి పళ్లు, దోస కాయలు, క్యారట్ లాంటి పళ్ళు, కూర గాయలని తాక కూడదు అని హుకుం జారీ చేశాడు. వాటి షేపు చూసి, వాటిని తాకితే ఆడవారిలో శృంగార పరమైన ఆలోచనలు తలెత్తు తాయట. ఒక వేళ ఎవరయినా అరటి పండు తినాలనుకుంటే ఇంట్లో మగ వారి చేత దాన్ని కట్ చేయించిన పిదప మాత్రమే దానిని తాకాలట.
  


 మరి వీటిని తాకి మగవాళ్ళు కూడా హోమో సెక్సువల్స్ అవుతారని ఈ పళ్లని ఆడా, మగా కాని వారే తాకాలని కూడా త్వరలో ఫత్వా వస్తుందేమో చూడాలి. అలాగే గుండ్రంగా ఉండే పళ్ళూ, కూరగాయలు మగవారిలో ఆడవారి శరీర భాగాలకి సంబంధించిన ఆలోచనలు రేకెత్తిస్తాయి కాబట్టి మగవారు వాటిని తాక కూడదు అని కూడ ఆర్డరేస్తారేమో?

15 comments:

Anonymous said...

asalu ilanti order vesina vadi arati pandu ni kosi kaakulaki graddalaki veyyali.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

ఇలాంటి తాలిబాన్‌గాళ్ళు ఇండియాలో కూడా ఉన్నారు నాయనా. గుంటూరులో కమ్మ కులానికి చెందిన విద్యార్థులు తమ కులానికి చెందిన అమ్మాయిలతో వేరే కులానికి చెందిన అబ్బాయిలు మాట్లాడకూడదని రూల్ పెట్టారు. తమ కులానికి చెందిన అబ్బాయిలతో వేరే కులానికి చెందిన అమ్మాయిలు మాట్లాడకూడదని రూల్ పెట్టలేదు. ఎంత కుల గజ్జి ఉన్నవాళ్ళైనా మగవాళ్ళ విషయంలో అలాంటి రూల్స్ పెట్టరు కదా. మత గజ్జి ఉన్నవాళ్ళైనా మగవాళ్ళకి అనుకూలం కాని రూల్స్ పెట్టలేరు.

Anonymous said...

కొన్ని సార్లు అవి మంచికేనేమో అనిపిస్తాయి.
మీరు స్థాపించిన ఒక చిత్రం చూసాకా అది మంచికి అనిపించింది.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

నీకు విషయం అర్థమైనట్టు లేదు. ఆడవాళ్ళ విషయంలో ఆ రూల్స్ పెట్టినవాళ్ళు మగవాళ్ళ విషయంలో ఆ రూల్స్ ఎందుకు పెట్టలేదు? మగవాళ్ళు ఆడవాళ్ళని ఏమైనా చెయ్యొచ్చు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని ఏమీ చెయ్యకూడదనా దాని అర్థం?

Anonymous said...

Praveen Sarma garu,

I am also belongs to kamma caste from Guntur. I never heard such rules in Guntur. If you don't know about the things in detail please keep quiet. Don't try to unpopular any particular person or caste with out proper reasons. Inter caste marriages are full swing in Guntur. Please remove Sarma in your name. Otherwise behave like a professional brahmin guy. Sorry if i said anything wrong. But dont try to divide the society. If possible try to develop relations among different groups otherwise please keep quiet. Thanks . Kiran

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

గుంటూరు నుంచి వచ్చిన కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు మాట్లాడుకుంటోంటే విన్నాను. ఆ రూల్ వల్ల ఒక కాలేజ్‌లో గొడవ కూడా జరిగిందని చెప్పారు.

Anonymous said...

Anonymous 11:51
dont lie...evryone knows what praveen sharma told is correct....might be not in guntur may be in Vizayavada or may be in ongole....kamma and kapu or other caste feeling is same same as talibans.....In US also, i heard in Mphasis fedex company only kamma's will able to join. they dont take any others... what a stupid caste feeling

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

అది గుంటూరు జిల్లాలోనే జరిగింది. అది ఏ మారుమూల పల్లెటూరులోనో కాదు, జిల్లా కేంద్రమైన గుంటూరు పట్టణంలోనే జరిగింది.

The One said...
This comment has been removed by the author.
The One said...

@praveen -- nuvvu emanna sakshi paper lo pani chesthunnava ? nuvvu cheppedi nijam aithe ikkada ah news link pettu, oka computer with internet connection undi ani timepass avvaka istam vachina raatalu raayaku..

@anonymous 2 -- how can u stereotype a whole community based on some baseless information ? Fedex emanna nee inti galli pakkana unna company ankunnava , get well soon..

Anonymous said...

@The One.
Cha only inti pakka company la gurinche thelusthinda....
Have u seen ABN news yeasterday... who the guys have kula gajji? Abt jr NTR fans and pavan kalyan fans fight with the caste feeling....kamma's and kappu's come out of caste feeling....Get well soon

Anonymous said...

@ The One...
If u want i can give u the link of ABN...

Anonymous said...

@ The One...
If u want i can give u the link of ABN...U need proofs right?

The One said...
This comment has been removed by the author.
The One said...

@anonymous -

Hello praveen babu direct ga nee Id tho reply cheyaleka anonymous ID tho posts esthunnava ? nee statements chusthe ne telustundi hw inferior u feel abt urself... roju ABN and other tv shows choosthoo evariki ekkuva kula gajji undo analyse cheskuni edusthu undu , I've got better things to do than watching our telugu news channels.. peace.. Ekkado PK and NTR fans kottukunte motham ah community andaru okate type ani brand chesesava, get out of the well u frog..