అప్పటికే మేము AP టూరిజం వాళ్ళ కాటేజీలో భోజనం ఆర్డర్ చేశాం కాబట్టి సినీ రాములమ్మ తల్లి చేతి నాటుకోడి రుచి చూడలేకపోయాం కానీ ఆ బోర్డు వెనకాల కథా కమామీషు తెలుసుకోవాలని మాకు భోజనం తెచ్చిన వాడినడిగాను దాని గురించి.
అతడు చెప్పిన దాని బట్టి విషయమేమిటంటే, ఒసేయ్ రాములమ్మ సినిమా కొంత భాగం షూటింగ్ తలకోనలో జరిగింది. అందులో విజయశాంతి చిన్న నాటి పాత్రని ఈ హోటల్ నడుపుకొనే శాంతమ్మ అనే ఆమె కూతురు పోషించింది. ఆ అమ్మాయి నటనకి మెచ్చిన విజయ శాంతి ఆమెని తనతో హైదరాబాద్ తీసుకెళ్ళి మరికొన్ని సినిమా అవకాశాలిప్పించింది. కొన్నాళ్ళకి వాళ్ళీద్దరికి పొరపొచ్చాలొచ్చాయి. దానితో ఆ అమ్మాయి విజయశాంతి నుండి విడిపోయి, తరువాత ఒక సినిమా వ్యక్తితో ప్రేమలో పడి, అతన్ని పెళ్ళి చేసుకుని తిరుపతిలో సెటిలై హాయిగా జీవిస్తోంది.
తన కూతురు ఒసేయ్ రాములమ్మా సినిమాలో నటించిందన్న విషయాన్ని తన హోటల్ పబ్లిసిటీకి వాడుకోవచ్చునన్న సంగతి తెలుసుకున్న శాంతమ్మ ఆ పేరుతో బోర్డు చేయించి అలా తగిలించిందన్న మాట.
3 comments:
super idea,nice post
అవును. నాక్కూడా తెలుసు. ఒసేయ్ రాములమ్మా షూటింగ్ అక్కడ జరుగుతున్నప్పుడు సదరు శాంతమ్మ కూతురు అక్కడ జామకాయలు అమ్ముకునేది. ఆమెను చూసిన దాసరి మిగతా వాళ్ళు విజయశాంతి చిన్నప్పటి పాత్రకు చక్కగా సరిపోతుందని తీసుకున్నారు.
Thanks for the info.
Post a Comment