ఈ నెల 16 ఉదయం, పోర్ట్ బ్లెయిర్ నుంచి చెన్నైకి కింగ్ ఫిషర్ విమానంలో ప్రయాణం, 7:30 కి డిపార్చరు,గంట ముందుగా వెళ్ళి ఏర్‌పోర్టులో కూర్చున్నాం. ఏడు గంటలకు అనౌన్సుమెంటు...టెక్నికల్ రీజన్సు వల్ల అరగంట ఆలస్యంగా బయలు దేరుతుంది అని. అరగంటే కదా అని సర్దుక్కూర్చున్నాం. మరొక అరగంటలో మరో అనౌన్సుమెంటు. మరో అరగంట ఆలస్యం అని. అరగంటయినా, రెండు మూడు గంటలు ఆలస్యమయినా పెద్దగా పోయేదేం లేదు కాబట్టి నేను ఆలస్యానికి పెద్దగా ఫీలవలేదు కానీ, నాక్కొంచెం భయం వేసింది. ఆ మధ్య హిందూ పేపర్‌లో ఒక ఏవియేషన్ ఎక్స్‌పర్టు మూడు నాలుగు ఆర్టికల్సు రాశాడు. ఏర్‌లైన్స్ వాళ్ళు తగినంత మంది నిపుణులైన సిబ్బంది లేకుండా విమానాలు నడుపుతూ ప్రయాణీకుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతుందీ అందులో వివరించాడు.
ఇది కూడా అలాంటి కేసేనా అనిపించింది. విమానం నడిపేందుకు ఎవరూ లేక, ఎవరినో ఒకరిని చూసేలోగా ఇలా సాంకేతిక కారణాలని చెప్పి ఆలస్యం చేసి చివరికి ఎవడో ఒకడికి విమానం అప్పగించి మా ప్రాణాలు వాడి గుప్పిట్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందేమోననిపించింది
. నా భయాలని నివృత్తి చేస్తూ కాస్సేపటిలో అనౌన్స్‌మెంట్ వచ్చింది విమానం కేన్సిల్ అయినట్టూ, వివరాల కోసం కౌంటర్‌లో సంప్రదించాలని. అక్కడికి వెళ్తే ఎర్ర యూనిఫాంలో ఒక అమ్మాయి ప్రయాణీకులకి సర్ది చెప్పలేక నానా పాట్లు పడుతూ కనిపించింది.
మొత్తానికి తేలిందేమిటంటే ఆ రోజుకిక ప్రయాణం జరగదనీ, ఏర్‌లైన్స్ వాళ్ళు బస, భోజన వసతీ ఇస్తారనీ, మరుసటిరోజు ఉదయాన్న ఇంకో విమానంలో చెన్నై తీసుకెళ్తారనీను. మాకు పెద్దగా ఇబ్బందేమీ లేదు, ఆ రోజు ఎలాగూ ఆదివారం కాబట్టి forced holiday అని సర్ది చెప్పుకున్నాం. ఎటొచ్చీ చెన్నై నుంచి ఇతర ప్రదేశాలకీ, ఇతర దేశాలకీ వెళ్ళాల్సిన వారి బాధ, వాళ్ళ ఆవేశం చూస్తే పాపమనిపించింది.
ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళల్సి వచ్చినప్పుడు ఆ బస్సు చెడిపోయి కేన్సిలైతే మరొక బస్సు అరేంజ్ చేసి పంపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఎర్ర విమానం ఆ పని చెయలేక పోయింది. అయినా విమానానికీ, బస్సుకీ పోలిక పెట్టడం భావ్యం కాదనుకోండి. మరుసటిరోజు పొద్దున్నే మరొక విమానం ఎక్కించి క్షేమంగా చెన్నైలో దింపాక బతుకు జీవుడా అనుకొంటూ నిట్టూర్చాం.
5 comments:
మీ ఈ పోస్ట్ చూస్తే NTR సంక్షోభం అప్పుడు,లక్ష్మీపార్వతి గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్య గుర్తొచ్చింది.ఎర్ర బస్సుల్లో తిరిగే వాళ్ళను ఎయిర్ బస్సుల్లో తిప్పితే ఇంతే అవుతుందని!
miku vimanam late ga start ayete bayam vesindi naku first time london ravataniki vimanamlo ys rajshekar reddy chanipoyindi grtuku techukkuni chala bayam vesindi andukey yepattiki vimanam yekkalante a bayam ventadutundi
vimanam bayaludere mundu vighnesvarudini taluchukondi. antaa manchi jarugutundi. "praise the lord" ani meeru anukunna naaku ok :)
thanks sree garu
annattu krishna garu, indulo oka +v side kooda undi. Kingfisher lo veltoo meeru pote meeto patu o sexy ammayi (the beloved air hostess!) kooda swarganiki vastundi. akkada meeku full time pass. ponee accident ayina o andamaina ammayi cheta saparyalu cheyinchukune adrushtam kalisostundi. maga janma ki intakante em kavali cheppandi :):)
Post a Comment