జగన్ బాబు దీక్ష-1 ని విజయవాడ కృష్ణా నది ఒడ్డున విడుదల చేస్తే బాగా హిట్టయింది. ఈ సినిమా హిట్టో ఫట్టో సరిగా తెలియలేదు. జగన్ మీడియా సూపర్ డూపర్ హిట్టు అని ప్రచారం చేస్తే యెల్లో మీడియా అట్టర్ ఫ్లాపని చెప్పింది. సాక్షి బులెటిన్‌లలో ఇసక వేస్తే రాలనంత జనం కనిపిస్తే, ఆంధ్రజ్యోతి, స్టూడియో-N లు ఖాళీ గ్రౌండ్‌ని చూపించాయి.
సరే మొత్తానికి ఫలితం ఎలా ఉన్నా, ప్రొడ్యూసరు హాపీ అయినట్టే ఉన్నాడు. కాబట్టే దీక్షకి సీక్వెల్ తీస్తున్నాడు. ఈ సారి నిడివి 48 నుంచి 24 గంటలకు తగ్గించాడు. కాకపోతే సినిమా బ్యాక్‌గ్రౌండ్ హైదరాబాద్ నుండి డిల్లీకి మార్చాడు. అసలు జగన్ ఏం చేసినా అది భారీ ఎత్తున ఉంటుంది. అశ్వినీ దత్, సుభాష్ ఘాయ్ సినిమాల్లాగా.
ఫస్ట్ పార్ట్ అందమైన నది ఒడ్డున, భారీ సెట్టింగు వేసి, లక్ష మంది ఎక్స్‌ట్రాలతో తీస్తే, సెకండ్ పార్ట్‌లో హైదరాబాద్ నుండి డిల్లీకి ప్రత్యేక రైలు, 1500 మంది ఎక్స్‌ట్రాలతో మొదటి దానికి ఏం తీసిపోకుండా తీయబోతున్నాడు. దీక్ష-2 హిట్టయితే, తరువాతి భాగం మాటేమిటి అన్న అనుమానమొచ్చిన వాళ్లకోసం ఈ పోస్టు.
డిల్లీ నడిబొడ్డున దీక్ష చేసి సోనియాకు, ప్రధానికీ తన సత్తా చాటాక జగన్ తదుపరి వేదిక కానున్నది న్యూయార్క్. న్యూయార్క్ నడిబొడ్దున, ఐక్యరాజ్య సమితి ముందు్, హైదరాబాద్ నుండి బోయింగ్ విమానంలో తరలించిన అయిదారొందల మందితో 12 గంటల నిరాహార దీక్ష చేసి బాన్ కి మూన్‌కి తన సత్తా ఏమిటో చాటాలి మన జగన్ బాబు.
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ, మన్ మోహన్ సింగ్‌లే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకూ జగనన్న సత్తా తెలిసి వస్తుంది. కమాన్ జగన్, అదేదో యాడ్‌లో సైఫ్ అలీ ఖాన్ చెప్పినట్లు let's make ut large.
5 comments:
బాబ్బాబు అదేదో మా డెట్రాయిట్లో పెట్టించండి. అసలే ఆర్ధిక మాంద్యం దెబ్బకి శోష వచ్చి పడిపోయేలా ఉన్నది మా నగరం! :)
లక్షల కోట్లు దొబ్బేస్తూన్నా..రెండో సారి అధికారం లోకి తెచ్చాడు రాజన్న... అనుకున్న అధిష్టానానికి దూల తీరాల్సిన్దే...ఇ౦కా నయం ఏ ఆఫ్ఘనిస్తాన్ వాడికో రాస్ట్రాన్ని అమ్మేయలేదు అబ్బా కొడుకులిద్దరూ...తూ బాడుకో నా కొడుకుల్లారా ... ఇంకా వాడి వెనకాల గొర్రెల్లా... జనాల్ని ...చూస్తూంటే...అమ్మా భారత మాతా ఎంత ఎదవల్ని కన్నావమ్మా....ఇంత వెధవలు భూమ్మీద ఎక్కడా ఉండరు తల్లీ...
krishna garu,
ఎట్టాగొట్టా ఎగదోసి మా జగన్ బాబును అమెరికా తోలిందాకా మీరు నిదరోయేట్టు లేరు.దీక్ష 4 ఇక చంద్రమండలం మీదేనా?
deeksha-5 on planet pluto.
asulu ee jagan deekshalu "daani kosamenaa ?
Post a Comment