నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 4, 2011

రోదసిలో హోటల్ గదులు, చంద్రుడి మీదకు ట్రిప్‌లు, మరో అయిదేళ్లలోనే!


చరిత్రలో ఎప్పుడూ లేనంతమంది మిలియనీర్‌లు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. మరి వీళ్ళ డబ్బు ఖర్చు కావడానికి మార్గాలు కూడా కావాలి కదా మరి. విలాసవంతమైన విల్లాలు, పడవలు, స్వంత దీవులూ ఇవన్నీ రొటీన్ అయిపోయాయి ఈ లక్ష్మీ పుత్రులకు. అందుకని వీరి కోసం ఇప్పుడు ఏకంగా రోదసిలో ఓ హోటల్ నిర్మించే ప్రయత్నంలో ఉంది ఒక రష్యన్ కంపెనీ. గత వారం మాస్కో సమీపంలోని జుఖోవ్‌స్కీ నగరంలో జరిగిన ఒక ఏర్ షోలో పాల్గొన్న కంపెనీలన్నీ ఇదే టాపిక్ మీద తమ దృష్టి పెట్టాయి.


   
అమెరికా తన స్పేస్ షటిల్స్‌ని అటకెక్కించడంతో అన్ని కంపెనీలు ఇప్పుడు ఈ లోటు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్బిటల్ టెక్నాలజీస్ సంస్థ ఏడు మంది అతిధులకి సరిపోయేల ఒక హోటల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. 2016 కల్లా దీనిని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  


అతిధులని హోటల్ గదులకే పరిమితం చేస్తే మజా ఉండదు కాబట్టి హోటల్ నుంచి చంద్రుడి మీదకీ, విశ్వాంతరాళలోకి ట్రిప్స్ కూడా ఉంటాయని సదరు సంస్థ చెప్తోంది. అయితే రోదసిలో జీరో గ్రావిటీ స్థితిలో ఉండాలంటే, దానికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. కక్ష్యలోని హోటల్‌కి ప్రయాణం కావడానికి ముందు మూడు నెలలపాటు కంపెనీ వాళ్ళే ఆ శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. 
అయితే ఈ హోటల్‌లో మందు బాబులకి నిరాశే ఉంటుంది. అక్కడ ఆల్కహాల్ ఉండదు. స్నానానికి బదులు స్పాంజ్ బాత్, వాక్యూమ్ టాయిలెట్లు, వ్యోమగాములు తీసుకొనే ఆహారం ఉంటుంది. అయితే ఇంటర్నెట్, కేబుల్ టీవీలు ఉంటాయట. తమ గదుల్లోంచి అతిధులు విశ్వాన్ని, భూమిని చూసే అవకాశం ఉంటుందట.


  
అయిదు రాత్రుల ప్యాకేజీకి ఒక మనిషికి సుమారు 75 లక్షల రూపాయలు బిల్లు ఉంటుంది హోటల్‌లో. అయితే రాను పోనూ ఖర్చుల రూపంలో మరో కోటీ తొంభై లక్షల రూపాయల మేరా జేబుకి చిల్లు పడుతుంది. అందుకు సిద్ధ పడితే త్వరలోనే అడ్వాన్సు బుకింగ్ మొదలు పెట్టబోతున్న ఈ స్పేస్ వెకేషన్ బుక్ చేసుకోవచ్చు. 


ఈ వెంచర్ విజయవంతమైతే 2030 కల్లా అంగారకుడి మీద కూడా హోటల్ నిర్మిస్తామని చెప్తున్నారు ఆర్బిటల్ టెక్నాలజీ వారు. 

No comments: