నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, September 8, 2011

దాని పొడవు చూసి మగవాడిలో కామానురక్తిని అంచనా వేయవచ్చు


ఆగండాగండి. మీరు అనుకొంటున్న పొడవు ఇక్కడ నేను రాయబోతున్న పొడవు ఒకటి కాదు. మగవాడి చేతికున్న ఉంగరపు వేలు పొడవు  అతనిలోని కామానురక్తిని సూచిస్తుందని శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు. గర్భస్త శిశువుగా ఉన్నప్పుడు ఆ పిండం మీద హార్మోన్ల ప్రభావాన్ని అనుసరించి ఆ వేలు పొడవు ఉంటుంది అని కనుగొన్నారు. టెస్టోస్టెరాన్ లేదా పురుష లైంగిక హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటే ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా పొడవుగా ఉంటుందట. అందుకనే మగవారిలో సాధారణంగా ఉంగరపు వేలు చూపుడు వేలుకన్నా పొడవుగా ఉంటుంది.
  
ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకల మీద జరిపిన ప్రయోగాలలో ఈ విషయాన్ని కనుగొన్నారు. ఇక్కడ ఎలుకల ప్రసక్తి ఎందుకా అని ఆశ్చర్యపోకండి. ఎలుకల వేళ్ళ నిష్పత్తి మనుషులని పోలి ఉంటుంది. గర్భంతో ఉన్న ఎలుకలని పురుష, స్త్రీ లైంగిక హార్మోన్లయిన టెస్టోస్టేరాన్, ఈస్ట్రోజన్ ప్రభావానికి గురి చేసి వాటికి పుట్టిన పిల్లల వేళ్ళ పొడవుని కొలిచి ఈ శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయానికి వచ్చారు.
The levels of testosterone in the womb determines the length of a ring finger - explaining why men's fourth fingers are usually longer than women's 
ఇక నుండీ అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్‌ని ఎన్నుకొనే ముందు వాళ్ళ చేతి వేళ్ళని పరీక్షిస్తారేమో?!

7 comments:

Anonymous said...

అతికాముకులూ, మేషోలూ అయిన మగవాళ్ళ మూలంగా ఆడవాళ్ళు మరిన్ని కష్టాలనుభవిస్తారు తప్ప సుఖపడరు. సెక్సు కూడా ఏవరేజిగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది.

ఆత్రేయ said...

మీ టపా నన్ను ఆలోచనలో పడేసింది.........

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు.

ఆత్రేయ గారూ! ఏ ఆలోచనలో అండీ?

ఆత్రేయ said...

మొదటగా చెయ్యి చూసుకున్నాను వేళ్ళు ఎలా ఉన్నాయా అని.
ఇంక ఆలోచన సంగతి మర్చిపోయా మూడు రోజులయింది కదా ..:P :P :P

Praveen Sarma / प्रवीण् शर्मा said...

నువ్వు నీ బ్లాగ్‌లో అడల్ట్స్ ఓన్లీ అని లేబెల్ పెట్టుకో. సెక్స్‌కి సంబంధించిన విషయాలు దొరికితే నోరు కార్చుకుని వ్రాస్తావు కదా.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ప్రవీణ్, ఇది anthropomorphic అనే కేటగిరీలోకి వస్తుంది. సెక్స్ కాదు. ఒక సారి నా గత పోస్టులన్నీ చూడు. సెక్స్ సమ్బంధించినవి ఎన్ని ఉన్నాయో లెక్క వేసి చూడు. అప్పుడు నీ అలెగేషన్ తప్పు అని నీకే అర్ధం అవుతుంది.

REDDY said...

ప్రవీణ్, సెక్స్ గురించి రాస్తే తప్పేమిటో నాకు అర్ధం కావడం లేదు. అయినా ఈ పోస్టు టైటిల్‌లో కొంచెం సెక్స్ ఉందేమో గానీ, లోపల విషయంలో ఏమీ లేదు అని నా అభిప్రాయం. ఈ బ్లాగరు అదేదో ఇంగ్లీషు పదం వాడాడు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికే anthropomorphic అని నా ఉద్ధేశ్యం. అయినా ఇప్పుడు ఎక్కడ చూసినా సెక్స్ వరదలై ప్రవహిస్తూ ఉంది. సినిమాలు, పత్రికలు, సకుటుంబ సపరివార సమేతంగా చూసే టీవీ సీరియల్సు, కాలేజీ, హైస్కూలు పిల్లల సెల్ ఫోన్స్‌లో...ఇలా సెక్స్ అందు గలదిందు లేదని కాకుండా ఎందెందు వెదికిన అందందు కనిపిస్తున్న ఈ రోజులలో బ్లాగులలోకి రాకుండా ఎలా ఉంటుంది.

లోగడ ఒక బ్లాగరు సెక్స్‌లో భంగిమల గురించి ఏ భంగిమలో చేస్తే వారి మానసిక ప్రవృత్తిని విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఇది Times Of India లో వచ్చిన ఒక ఆర్టికల్‌ని తెలుగులో రాయడమే అనుకో. అలాగే మరొకాయన కృష్ణశ్రీ అనుకొంటాను ఇద్దరు కజిన్స్ మధ్య శృంగారం గురించి సీరియల్ పోస్టులు పెడితే ఆయన తన్ కూతుళ్ళతో ఆ విధంగా చేస్తారా అని కొందరు నీచమైన బాషలో కామెంట్లు రాయడం, ఆయన వాటిని డిలీట్ చేసి వారి మీద విరుచుకు పడడం కూడా నేను ఇక్కడే చూశాను.

అయినా ఎప్పుడూ మావో బోధనలూ, ఆ విధానాలూ అనుకుంటూ మావో మార్గంలో వెళ్ళే మావోయిస్టులు కూడా సెక్స్ విషయంలో ఏమీ తక్కువ తినడం లేదు. మహిళా మావోయిస్టులూ తరచూ అబార్షన్లకి గురి అవుతుంటారని ఎన్ని సార్లు మనం పేపర్లలో చదవ లేదు. కాబట్టి అసభ్యకరంగా లేకుండా శృంగారం గురించి రాయడం తప్పేమీ కాదని నా అభిప్రాయం.

దీని మీద మిగతా బ్లాగర్లు ఏమంటారో చూద్దాం. మనది ప్రజాస్వామ్యం కదా. అధిక సంఖ్యాకులు ఎటు వెళితే అందరూ అటు వెళ్ళక తప్పదు మరి.