నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, September 7, 2011

విమానానికి మేకలని బలి ఇచ్చి శాంతి జరిపించారు!!


రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఒక బోయింగ్ 757 విమానం కొన్నాళ్ళుగా ఆ కంపెనీ ఇంజినీర్లని వేధించుకు తింటోంది. చీటికి మాటికి రిపేర్లతో అనేక సార్లు టేకాఫ్ కోసం రన్ వే మీదకి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకు రావడం జరిగేది. ఏవో చిన్న చిన్న రిపేర్లు చేయడం మళ్ళీ కొన్నాళ్ళకి కథ మొదటికి రావడం... ఇలా జరుగుతున్న ఈ కథకి ఫుల్ స్టాప్ పెట్టడానికి అధికారులు ఒక మార్గం ఆలోచించారు.
 


ఆ కంపెనీ లోగోలో భైరవుడి బొమ్మ ఉంటుంది. ఆ భైరవుడికి శాంతి చేయిస్తే పరిస్థితి చక్క పడుతుందని భావించిన అధికారులు రెండు మేకలని తెచ్చి ఆ విమానం ముందు నిలబెట్టి బలి ఇచ్చారు. తరువాత కాక్‌పిట్‌లో ఎలక్ట్రికల్ వైరింగ్‌లో ప్రాబ్లమ్ ఉందని కనిపెట్టి సరి చేశాక విమానం తన మార్గంలో ప్రయాణమయి పోయింది.
  


ఇది చదివాక మన పల్లెలలో పోలేరమ్మలకీ, నాంచారమ్మలకీ మేకలని బలి ఇచ్చే వారిని తెలివి తక్కువ వారు అని అనుకోవడం తప్పు అని నాకు అర్ధం అయింది.

2 comments:

sree said...

ఒకనాటి క్రైస్తవులు, యూదులు కూడా ఇలా బలులు ఇచ్చ్హేవారు. అంతే కాదు, వాల్లచే చంపబడ్డ వివిధ జాతులవారు కూడా దేవతలకు బలులు ఇచ్చేవారు. కావాలంటే K A Paul ని అడగండి చెప్తాడు!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ చల్లని వేళ వాడి గురించి ఎందుకు లెండి?