ఆడవారికి తమ శరీరం గురించి, అందులోనూ ముఖ్యంగా తమ వక్షోజాల సైజు గురించి పట్టింపు ఎక్కువ. అందరికీ ఆస్తి పాస్తులు ఎక్కువగా ఉండనట్టే ఈ సైజులో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. తగినంత సైజు లేకపోతే ఒకప్పుడు మన సాంప్రదాయక చీరకట్టులో కొద్దోగొప్పో దాచిపెట్టే వీలు ఉండేది. కానీ ఇప్పుడు టీ షర్టులూ జీన్సు వచ్చాక ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ప్యాడెడ్ బ్రాలతో కొంతవరకూ మానేజ్ చేయవచ్చు కానీ, అప్పుడు లోనెక్ షర్టులు వేయడానికి వీలు కాదు. ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు కదా అంటే ఆడవారి శరీరం ఈ సైజుల్లో ఉండాలని 34-26-36, 36-28-38 ఇలా కొలతలు తీర్మానించేశారు సినిమాలూ, టీవీలు, మ్యాగజైన్స్ వాళ్ళు.
ఈ సైజులలోకి రావడానికి ఓపిక డబ్బూ ఉన్నవాళ్లు మరి ముఖ్యంగా సౌందర్యాన్ని పెట్టుబడిగా వాడే వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్లని ఆశ్రయించి చిన్నవిగా ఉంటే breast augmentation అని, మరీ పెద్దవిగా ఉంటే breast reduction అని, బిగి సడలి జారిపోయినట్లు ఉంటే mastopexy అని రకరకాల ఆపరేషన్లతో తమ శరీరాన్ని తమకు నచ్చినట్లు మలచుకొంటున్నారు. అయితే ఆపరేషన్ అంటే భయం ఉన్నవాళ్ళకి ఆపరేషన్ లేకుండా సైజు పెంచుతామని నకిలీ వైద్యులు సొమ్ము చేసుకుంటారు.
సౌత్ డిల్లీలో ఒక బ్యూటీ పార్లర్ నిరావహుకురాలు ఇలాగే నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చి వక్షాల సైజు గ్యారంటిగా పెంచుతానని డబ్బులు దండుకొని అక్కా చెల్లెళ్ళు ఇద్దరి మీద ప్రాయోగం చేసి కటకటాల పాలయింది.
"నాలుగంటే నాలుగు ఇంజెక్షన్లు వేయించుకుంటే చాలని, కావాలంటే రాత పూర్వకంగా గ్యారంటి ఇస్తానని డబ్బు తీసుకుని రొమ్ములలోకి పదిహేను ఇంజెక్షన్లు చేసింది. సైజు పెరగడం మాట దేవుడెరుగు, ఇప్పుడు రూమ్ములపైన నీలంరంగు మచ్చలు, ఒకటే నొప్పి దురదా వచ్చాయి" అని ఆ అక్కా చెల్లెలు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు మామూలుగానేIPC 420,337 సెక్షన్ల కింద
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.