నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, September 30, 2012

అమ్మడు చీర కట్టినా విప్పినట్లే ఉంటుంది



అర్ధ నగ్న, ముప్పావు నగ్న చిత్రాలతో ట్విట్టర్‌ని ఏలుతూ లక్షలాది అభిమానులని ఏర్పరచుకున్న పూనమ్ పాండేకి రక్తితో పాటు భక్తి కూడా ఉంది. అంధేరీలోని ఆజాద్ నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి వెళ్ళి గత సంవత్సరం ఈమె పుజలు చేసింది. అయితే అలా వెళ్ళడం తనకి అలవాటైన రీతిలో టీ షర్ట్, షార్ట్ ధరించి వెళ్ళింది.
 


 
 దానితో ఖంగు తిన్న ఆ మండపం నిర్వాహకులు ఈ సారి కూడా ఈమె గానీ, ఈమె లాంటి వాళ్ళు కానీ వస్తారేమోనని భయపడి ఈ సారి భక్తులకి షార్ట్స్, స్లీవ్ లెస్ షర్ట్స్‌తో మండపంలోకి భక్తులు రాకూడదని డ్రస్ కోడ్ పెట్టారు.
Poonam Pandey in ganesh pooja

Poonam Pandey Meets Ganesha Poonam Pandey Meets Ganesha
ఈ సంవత్సరం ఈ డ్రెస్ కోడ్ వల్ల పూనమ్ మండపంలోకి రాదేమోనని అందరూ భావించారు. అయితే ఈ అమ్మడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ చీరతో ప్రత్యక్షమయింది. అయితే అమ్మడి చీరనీ, ఆ చీర కట్టిన విధానాన్ని చూసి మండపంలోని వాళ్ళు మరొకసారి ఖంగు తిన్నారు. చీరలో కన్నా పోయిన సారిలా షార్ట్ వేసుకొని వచ్చినా బావుండేదేమోననుకున్నారు అమ్మడి చీరకట్టు చూసి.

ఏ రకమయిన బట్తలు వేసుకోవాలో చెప్పగలం కానీ ఆ బట్టలు ఎలా కట్టుకోవాలో కూడా మేమే చెప్పాలంటే ఎలా అని విస్తు పోతున్నారు ఆ గణేష్ పండాల్ నిర్వాహకులు.

130 సంవత్సరాల క్రితం బొంబాయి హార్బర్ దృశ్యం

బొంబాయి, ఇప్పుడు ముంబయి అయింది లెండి, బొంబాయి హార్బర్‌ని ఆనుకుని ఒక చిన్న కుటుంబాల సమూహంగా మొదలయింది. అందుకే ఈ హార్బర్‌ని ఫ్రంట్ బే అని పిలుస్తారు.

 దీనిలో ఆరు చిన్న దీవులున్నాయి. వీటిలోని ఘరాపురి దీవిలో ప్రసిద్దమైన ఎలిఫెంటా గుహలు ఉన్నాయి.


 ఇప్పుడు అతి రద్దీగా ఉండే ఈ హార్బర్ 1880లో ఎలా ఉండేదో ఈ పాత ఫోటోలో చూడొచ్చు.

Bombay+(Mumbai)+Harbour+Scene+-+c1880's

Thursday, September 27, 2012

గజినీ బ్లాగరైతే/బ్లాగర్ గజినీ అయితే?(PHOTO)

INSTANT కన్యత్వం


పైకి ఎన్ని ఆడర్సాలు వల్లించినా, ఎంత విశాల హృదయులయినా పెళ్ళి దగ్గరకి వచ్చేసరికి తమ భాగస్వామి ఫ్రెష్ అయిఉండాలని, మొదటి రాత్రే వారికి మొదటి అనుభవం అయి ఉండాలని కోరుకుంటారు. మొదటి సెక్స్ టీనేజ్‌లోనే జరుగిపోతున్న ఈ రోజుల్లో పెళ్ళికి ముందు ఎన్ని ఆటలాడినా పెళ్ళయ్యాక నమ్మకంగా ఉంటే చాలు అన్న అభిప్రాయం ఈ మధ్య యువతీ యువకుల్లో వస్తూ ఉంది. భాగస్వామి ద్వారా తమకి నచ్చినట్లుగా లైంగిక ఆనందం దొరక్కపోతే ఆ అనుభవం బయట వెతుక్కోవడం తప్పు కాదు అని కొందరు శరత్ లాంటి ఓపెన్ మైండెడ్ వ్యక్తులు భావించినా వారి సంఖ్య చాలా స్వల్పం.

అయితే ఎక్కువమంది మగవారు తాము పెళ్ళికి ముందు ఎన్ని గ్రంధాలు నడిపినా తమకి వచ్చే భార్య మాత్రం కన్యగానే రావాలి అని ఆశిస్తూ ఉంటారు. కొన్ని సమాజాల్లో ఆడవారికి కన్యత్వం అనేది ఆప్షనల్ అయితే మరికొన్ని సమాజాల్లో మాండేటరీ అవుతుంది. సిడ్నీ షెల్డాన్ నవల అదర్ సైడ్ ఆఫ్ మిడ్‌నైట్‌లో హీరోయిన ఒక అమెరికన్. తాను టీనేజీ దాటిపోతూ ఉన్నా తనకి కన్యత్వం వదల్లేదే అని తెగ మధనపడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎక్కడో యాక్సిడెంట్ అయి తను చనిపోతే, పోస్ట్‌మార్టంలో తను కన్యని అని తెలిస్తే అందరూ ఎంతగా నవ్వుకుంటారో అని తెగ బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అమెరికన్. కాబట్టే కన్నెచెర వదిలించుకోవడానికి అంత ఆరాట పడుతుంది ఆ అమ్మాయి.

అయితే మరీ సాంప్రదాయక సమాజాలు కొన్నింటిలో పెళ్లికి ముందు ఆడవారికి శృంగారం అన్న అవకాశమే ఉండదు. ఇలాంటి కుటుంబాలలో అమ్మాయిలు శోభనం రాత్రి మాత్రమే తమ కన్యత్వాన్ని వదిలించుకోవలసి ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలో పెళ్లికి ముందు వధువుకి శృంగార అనుభవం ఉంది అని వరుడికి అనుమానం వస్తే ఆ అమ్మాయికి మానసికంగా, శారీరకంగా హింస తప్పదు. అయితే శోభనం రాత్రి తన భార్య కన్య అవునో కాదో ఏ వరుడూ చెప్పలేడు. ఏ డాక్టరో వచ్చి వజైనల్ ఎగ్జామినేషన్ చేస్తే కానీ తెలిసే విషయం కాదు అది. అయితే చాలామంది అమ్మాయి కన్య అవునో కాదో తెలుసుకోవడానికి మూడు కొండగుర్తులు చెప్తూ ఉంటారు.
 
తొలి కలయిక స్త్రీకి నొప్పి కలిగించాలి, అప్పుడు కన్నెపొర చిరగాలి, రక్త స్రావం కావాలి అని. కన్నె పొర(hymen) యోని లోపల ఉండే ఒక పొర. చాలా మందిలో ఇది చాలా పలుచగా ఉంటుంది. కొందరిలొ ఇది స్పష్టంగా ఉండక పోవచ్చు. పెళ్ళికి ముందు ఆటల్లో గానీ, హస్త ప్రయోగం ద్వారా గానీ, బహిష్టు సమయంలొ వాడే టాంపన్స్, శానిటరీ నాప్కిన్స్ వల్ల గానీ ఈ కన్నెపొర చిరిగి పోవచ్చు.

 అయితే కన్నెపొర శోభనం రాత్రి ఖచ్చితంగా ఉండాలి అనుకునేంత ఆర్థడాక్స్ ఫ్యామిలీస్‌లో అమ్మాయిలు పెళ్ళికి ముందు అనుభవాల వల్ల అది డామేజ్ అయిఉంటే దాన్ని మళ్ళీ సృష్టించడానికి హైమెనోప్లాస్టీ అన్న అపరేషన్ ఉంది. ఈ ఆపరేషన్ ఖర్చుతో, శ్రమతో కూడుకున్న విషయం. దీని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. పైపెచ్చు ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరికీ తెలుస్తుందేమోనన్న భయం ఒకటి ఉంటుంది. 

ఎటువంటి బాదరబందీ లేకుండా, మూడవ కంటికి తెలియకుండా కేవలం 30 డాలర్ల ఖర్చుతో, అరగంటలో తాము కోల్పోయిన కన్యత్వాన్ని తిరిగి పొందే అవకాశం కల్పించింది అలీషియా వింధామ్ అన్న అమ్మడు. ఈమె నడిపే hymenshop అన్న వెబ్‌సైటుకి 30 అమెరికన్ డాలర్లు పంపితే కృత్రిమ కన్నెపొరని ఒక పాకెట్‌లో పంపిస్తుంది. ఇందులో రెండు కన్నెపొరలు ఉంటాయి. ఒకటి ముందుగా ప్రాక్టీసు చేయడానికి, మరొకటి అసలు సీన్‌లో వాడడానికి. సెక్స్‌కి ఇరవై ముప్పై నిముషాలు ముందుగా ఆ పొరని బయటకి తీసి యోనిలో పెట్టుకుంటే అక్కడి తేమని పిల్చుకొని అది కొద్దిగా ఉబ్బి శృంగారం సమయంలో మగవాడికి కన్నెపొర అడ్డువచ్చినట్లు, అది చినిగినట్లూ అనుభూతి కలుగుతుంది. పైపెచ్చు అందులో ఉన్న కొన్ని పదార్ధాలు బయటకి స్రవించి రక్తస్రావమయినట్లు కనిపిస్తుంది.
 

దీనికి తోడు శృంగారం సమయంలో తనకి నొప్పిగా, బాధగా ఉన్నట్లు ఆమె కొంచెం మూలిగి అబ్బా,అబ్బా అని శబ్ధాలు చేస్తే ఎంత అనుమాన పక్షి అయినా ఆమె కన్య కాదని చెప్పలేడు.

పెళ్ళి నాటికే కన్యత్వం కోల్పోయి నరకం చవి చూస్తున్న అమ్మాయిలకి ఉపయోగకరంగా ఉండాలని తను ఈ కృత్రిమ కన్నెపొరని తయారు చేశానని అలీషియా వింధామ్ చెప్తూంది.

Thursday, September 20, 2012

అందమంటే జీరో సైజు ఒక్కటే కాదు.


ఈ మధ్య హీరోయిన్లకి జీరో సైజు మీద మోజు ఎక్కువయింది. ఆ మధ్య ఒక హిందీ సినిమాలో కరీనా కపూర్ జీరో సైజులో కనిపించి అభిమానులని షాక్ చేసింది. అందమైన కొలతలతో ముద్దు ముద్దుగా ఉండే ఈ ముద్దు గుమ్మ పీక్కుఫొయినట్లు కనిపించే సరికి అభిమానులు ఖంగు తిన్నారు. తను ఆ సైజుకి రావడానికి పవర్ యోగా తన రహస్యమని సెలవిచ్చింది ఈ అమ్మడు. ఒకట్రెండు సినిమాల్లో ఇలా కనిపించి ట్రెండు సృష్టించి, ఆ తరువాత అక్కడక్కడా కొంత కండ పెట్టి మునుపటి రూపానికి వచ్చేసింది. అయితే ఆ తరువాత చాలామంది జీరో సైజు లుక్స్ కోసం కష్ట పడ్డారు. ఈ మధ్యనే జులాయి సినిమాలో పేషంటులాగా ఉన్న తన హీరోయిన్ ఇలియానా మీద కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసడర్‌లా ఉంది అని ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ ఓ సెటైర్ కూడా వేశాడు.

  
హీరోయిన్లూ మోడల్స్‌కి ఈ సైజ్ జీరో లుక్ తమ వృత్తిలో ఉపయోగపడుతుందని వాళ్ళు భావిస్తే అందులో తప్పు లేదు కానీ, వాళ్ళని చూసి చాలా మంది అమ్మాయిలు తిండి మానేసి, పస్తులతో పీక్కు పోయి సైజ్ జీరో కోసం కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొంటున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న వారికి మెదడూ, నాడీ వ్యవస్థ (nervous system) అభివృద్ధికి కొవ్వు చాలా అవసరం. సైజ్ జీరో కోసం ఆహారంలో ఫ్యాట్ పూర్తిగా తగ్గించి వేస్తే వీటి అభివృద్ధి దెబ్బ తింటుంది. ఈ విషయం తెలియక జీరో సైజుకోసం చాలా మంది కాలేజి అమ్మాయిలు కూడా కష్టపడుతూ చాలా నష్ట పోతున్నారు.
 
అసలు ఈ జీరో సైజ్ అనేది మన వాళ్ళు అరువు తెచ్చుకున్న వెర్రి. ఒకప్పట్లో మన అందగత్తెలు అందరూ ప్లస్ సైజులో ఉన్న వారే. సావిత్రిది కొంచెం భారీ సైజు అనుకున్నా, జమున, భానుమతి, కృష్ణ కుమారి, శ్రీదేవి, అలాగే హిందీలో చూసుకుంటే హేమమాలిని, మీనా కుమారి, రేఖ... ఇలా ఎవరూ జీరో సైజుతో పీక్కుపోయిన వాళ్ళు కాదు. ఉండాల్సిన చోట పుష్టిగా కొవ్వు ఉండి, వంపు సొంపులతో అభిమానులని కవ్వించిన వారే. 
 
ఈ జీరో సైజ్ వెర్రి రోజుల్లో కూడా ప్లస్ సైజులతో ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న కొందరు అందగత్తెలని చూడండి.
 
   

Tuesday, September 18, 2012

PHOTO BOMBS


ఇవి పేలే బాంబులు కావు.అలా అని బాంబుల్లాంటి ముద్దు గుమ్మలున్న ఫోటోలు కావు. ఎప్పుడైనా చాలా ముఖ్యమైన సందర్భాలలో ఫోటోలు దిగుతున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా ఫ్రేములోకి జొరబడి అందమైన ఫోటోని నాశనం చేయడాన్ని ఫోటోబాంబ్ అంటారు.అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు.
 ఈ మధ్య సింసిన్నాటి ఎన్నికల సభలో అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామాకి ఈ అనుభవం ఎదురయింది. ఆయన ఉపన్యసిస్తుండగా కొంచెం దూరంలో ఒక మనిషి అటువైపు తిరిగి మూత్ర విసర్జన చేయడం ఫోటోలో వచ్చింది. గతంలో కూడా ఒకట్రెండు చిన్నపాటి ఫోటోబాంబుల్లో ఒబామా చిక్కుకున్నారు. వాటిని మరిన్ని చిలిపి ఫోటోబాంబులనీ దిగువన చూడండి.

PhotOBAMA

We Need Nothing Butt Freedom


President Obama Photobombed






Nice photobomb

ramantic photobomb


Photobomb Level... Yah, That Happened



Saturday, September 15, 2012

డయానా కుటుంబాన్ని పాపరాజీ గండం ఇంకా వదల్లేదా?


బ్రిటన్ అందాల యువరాణి డయానాని వెంటాడి ఆమె మరణానికి కారణమైన ఫోటో జర్నలిస్టులు ఆమె కుటుంబాన్ని ఇంకా వదల్లేదు. సెలబ్రిటీలని వెంటాడి, వేధించి ఫోటోలు తీసే జర్నలిస్టులని ముద్దుగా పాపరాజ్జీ అని పిలుస్తారు. మొనాకోలో కారులో వెళ్తూ ఉండగా ఫోటోగ్రాఫర్లు వెంబడించడంతో వారిని తప్పించుకొనే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ వేగం పెంచి ఆ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యి ఆమె మరణించింది.
 
ఇప్పుడు ఆమె రెండవ కుమారుడు ప్రిన్స్ హ్యారీ గత నెల లాస్ వేగాస్‌లో మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా నగ్నంగా ఉన్న ఫోటోలని ఒక పత్రిక ప్రచురించింది.

 ఈ మధ్యనే వజ్రోత్సవం జరుపుకున్న బ్రిటన్ రాణి, హ్యారీ నాయనమ్మ ఎలిజబెత్ మగరాణిని ఈ విషయం ఆవేదనకి గురి చెసింది. దానితో హ్యారీకున్న ప్లేబాయ్ ముద్ర చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా అతడిని ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బ్రిటన్ సైన్యంలోకి పంపింది రాజ కుటుంబం. 

ఈ విషయం సద్దుమణిగే లోపే, డయానా పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం తన భార్య కేట్ మిడిల్‌టన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో విహారయాత్రలో ఉండగా, ఒక ప్రైవేటు రిసార్ట్‌లో కేట్ టాప్‌లెస్‌గా సన్ బాత్ చేస్తున్న ఫోటోలని ఒక ఫోటోగ్రాఫర్ దొంగ చాటుగా ఫోటోలు తీశాడు. వాటిని క్లోజర్ అన్న ఫ్రాన్స్ పత్రిక ప్రచురించింది.
bruce adams

 
సదరు పత్రిక మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజ కుటుంబం ఆలోచిస్తూంది. చూడబోతే ఈ పాపరాజ్జీలు డయానా పిల్లల్ని కూడా వదిలేట్టు లేరు.