నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, September 20, 2012

అందమంటే జీరో సైజు ఒక్కటే కాదు.


ఈ మధ్య హీరోయిన్లకి జీరో సైజు మీద మోజు ఎక్కువయింది. ఆ మధ్య ఒక హిందీ సినిమాలో కరీనా కపూర్ జీరో సైజులో కనిపించి అభిమానులని షాక్ చేసింది. అందమైన కొలతలతో ముద్దు ముద్దుగా ఉండే ఈ ముద్దు గుమ్మ పీక్కుఫొయినట్లు కనిపించే సరికి అభిమానులు ఖంగు తిన్నారు. తను ఆ సైజుకి రావడానికి పవర్ యోగా తన రహస్యమని సెలవిచ్చింది ఈ అమ్మడు. ఒకట్రెండు సినిమాల్లో ఇలా కనిపించి ట్రెండు సృష్టించి, ఆ తరువాత అక్కడక్కడా కొంత కండ పెట్టి మునుపటి రూపానికి వచ్చేసింది. అయితే ఆ తరువాత చాలామంది జీరో సైజు లుక్స్ కోసం కష్ట పడ్డారు. ఈ మధ్యనే జులాయి సినిమాలో పేషంటులాగా ఉన్న తన హీరోయిన్ ఇలియానా మీద కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసడర్‌లా ఉంది అని ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ ఓ సెటైర్ కూడా వేశాడు.

  
హీరోయిన్లూ మోడల్స్‌కి ఈ సైజ్ జీరో లుక్ తమ వృత్తిలో ఉపయోగపడుతుందని వాళ్ళు భావిస్తే అందులో తప్పు లేదు కానీ, వాళ్ళని చూసి చాలా మంది అమ్మాయిలు తిండి మానేసి, పస్తులతో పీక్కు పోయి సైజ్ జీరో కోసం కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొంటున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న వారికి మెదడూ, నాడీ వ్యవస్థ (nervous system) అభివృద్ధికి కొవ్వు చాలా అవసరం. సైజ్ జీరో కోసం ఆహారంలో ఫ్యాట్ పూర్తిగా తగ్గించి వేస్తే వీటి అభివృద్ధి దెబ్బ తింటుంది. ఈ విషయం తెలియక జీరో సైజుకోసం చాలా మంది కాలేజి అమ్మాయిలు కూడా కష్టపడుతూ చాలా నష్ట పోతున్నారు.
 
అసలు ఈ జీరో సైజ్ అనేది మన వాళ్ళు అరువు తెచ్చుకున్న వెర్రి. ఒకప్పట్లో మన అందగత్తెలు అందరూ ప్లస్ సైజులో ఉన్న వారే. సావిత్రిది కొంచెం భారీ సైజు అనుకున్నా, జమున, భానుమతి, కృష్ణ కుమారి, శ్రీదేవి, అలాగే హిందీలో చూసుకుంటే హేమమాలిని, మీనా కుమారి, రేఖ... ఇలా ఎవరూ జీరో సైజుతో పీక్కుపోయిన వాళ్ళు కాదు. ఉండాల్సిన చోట పుష్టిగా కొవ్వు ఉండి, వంపు సొంపులతో అభిమానులని కవ్వించిన వారే. 
 
ఈ జీరో సైజ్ వెర్రి రోజుల్లో కూడా ప్లస్ సైజులతో ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న కొందరు అందగత్తెలని చూడండి.
 
   

No comments: