నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, September 15, 2012

డయానా కుటుంబాన్ని పాపరాజీ గండం ఇంకా వదల్లేదా?


బ్రిటన్ అందాల యువరాణి డయానాని వెంటాడి ఆమె మరణానికి కారణమైన ఫోటో జర్నలిస్టులు ఆమె కుటుంబాన్ని ఇంకా వదల్లేదు. సెలబ్రిటీలని వెంటాడి, వేధించి ఫోటోలు తీసే జర్నలిస్టులని ముద్దుగా పాపరాజ్జీ అని పిలుస్తారు. మొనాకోలో కారులో వెళ్తూ ఉండగా ఫోటోగ్రాఫర్లు వెంబడించడంతో వారిని తప్పించుకొనే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ వేగం పెంచి ఆ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యి ఆమె మరణించింది.
 
ఇప్పుడు ఆమె రెండవ కుమారుడు ప్రిన్స్ హ్యారీ గత నెల లాస్ వేగాస్‌లో మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా నగ్నంగా ఉన్న ఫోటోలని ఒక పత్రిక ప్రచురించింది.

 ఈ మధ్యనే వజ్రోత్సవం జరుపుకున్న బ్రిటన్ రాణి, హ్యారీ నాయనమ్మ ఎలిజబెత్ మగరాణిని ఈ విషయం ఆవేదనకి గురి చెసింది. దానితో హ్యారీకున్న ప్లేబాయ్ ముద్ర చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా అతడిని ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బ్రిటన్ సైన్యంలోకి పంపింది రాజ కుటుంబం. 

ఈ విషయం సద్దుమణిగే లోపే, డయానా పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం తన భార్య కేట్ మిడిల్‌టన్‌తో కలిసి ఫ్రాన్స్‌లో విహారయాత్రలో ఉండగా, ఒక ప్రైవేటు రిసార్ట్‌లో కేట్ టాప్‌లెస్‌గా సన్ బాత్ చేస్తున్న ఫోటోలని ఒక ఫోటోగ్రాఫర్ దొంగ చాటుగా ఫోటోలు తీశాడు. వాటిని క్లోజర్ అన్న ఫ్రాన్స్ పత్రిక ప్రచురించింది.
bruce adams

 
సదరు పత్రిక మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజ కుటుంబం ఆలోచిస్తూంది. చూడబోతే ఈ పాపరాజ్జీలు డయానా పిల్లల్ని కూడా వదిలేట్టు లేరు.

No comments: