నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, September 10, 2011

సోనియాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకయ్యే కార్డు జగన్ బయటకి తీయగలడా?



సినిమాలలో, తెలుగయినా హాలీవుడ్ అయినా, జేమ్స్ బాండ్ సినిమా అయినా, హీరో, విలన్ కలిసి మూడు ముక్కలాట ఆడుతున్నపుడు సీన్ ఒకేలాగా ఉంటుంది. ముందుగా విలన్ తన మూడు ముక్కలను టెబుల్ మీద పెడతాడు. రెండు రాజులు, ఒక రాణి ఉంటాయి. విలన్ మొహంలో గెలిచానన్న ఆనందం. అప్పుడు హీరో తన ముక్కలు చూపిస్తాడు. మూడు ఆసులుంటాయి. దిమ్మ తిరిగి , మైండ్ బ్లాంకయిన లుక్కిస్తాడు విలన్.
 
ఇప్పుడు మన రాష్ట్రంలో ఆధిపత్యం కోసం సోనియా గాంధీ, జగన్ మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్న పోరు కూడా మూడు ముక్కలాటని తలపిస్తుంది. సోనియా తన దగ్గరున్న మూడు ముక్కలనీ చూపించేసింది. సీబీఐ విచారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ, జగన్‌కి వ్యాపార, ఆర్ధిక లావాదేవీల ద్వారా సన్నిహియుడైన గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు అనేవి ఆ మూడు ముక్కలు. సోనియా వైద్యం కోసం అమెరికాలో ఉన్నా ఆట అడించేది ఆమే అన్న విషయం అందరికీ తెలుసు.
 

జగన్ కూడా తన వైపు నుంచి రెండు కార్డులు ఆడేశాడు. ఒకటి డిల్లీలో గల్లీలన్నీ తిరిగి, పెద్దా చిన్నా, కోన్ కిస్కా పార్టీల నాయకులని కలిసి మద్ధతు కూడ గట్టుకోవడం, అవసరమైతే కాంగ్రెస్ పార్టీకయినా మద్ధతు ఇస్తానని సంధికి సంసిద్ధం అని చెప్పడం ఆ రెండు కార్డులు అయితే, జగన్ దగ్గర ఇవి కాక మరేదయినా కీలక అస్త్రం ఉందా? Any ace up his sleeve?


వైఎస్సార్ బతికి ఉన్నపుడు రెగ్యులర్‌గా పెట్టెలు పెట్టెల నిండా క్యాష్ సోనియా గాంధీకి అందించేవాడని, అందు చేతనే రాష్ట్ర వ్యవహారలలో వేలు పెట్టకుండా, కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజెన్ లాంటి అంతర్గత కుమ్ములాటలు ఇక్కడ లేకుండా పోయాయనీ, ఆ కారణం చేతనే అడిగే వారు లేక, ఇక్కడ రాజ శేఖర్ రెడ్డి ఆడింది ఆట, పాడింది పాటలాగా తయారయి ఎమ్మేల్యేలలో సింహ భాగం తనకి వీర విధేయులని ఎంచుకున్నారని చెప్తారు. ఆ వీర విధేయ గణమే ఇప్పుడు అధినేత్రికి కంట్లో నలుసులా తయరయి కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు.


సెజ్‌లు, కాంట్రాక్టులూ, గనులూ పందేరం చేయడం, తనకి రావాల్సింది దండుకోవడం తప్ప జగన్ అప్పట్లో మరేమీ పట్తించుకోకుండా ఉండేవాడా? డిల్లీకి సూట్ కేసుల తరలింపు వ్యవహారం జగన్‌కి తెలియకుండా జరిగేదా? వైఎస్ కూడా ఇచ్చినదాన్ని ఇచ్చినట్లు మర్చి పోయేవాడా? ఎప్పటికైనా అవసరం అవుతుందని ఏ రోజు ఏ సూట్‌కేసులో ఎంత ఇచ్చింది నోట్ల నంబర్లతో సహా రాసి బధ్రపరచాడా? ఆ వివరాలన్నీ జగన్ దగ్గర ఉన్నాయా? నిజంగా ఈ విషయాలన్నీ జగన్‌కి తెలిస్తే వాటిని బయటకి తీసి సోనియా పైకి ప్రయోగిస్తాడా? ఒకవేళ అలా చేస్తే ఇప్పటికే కంపు పట్టిన తన తండ్రి ఇమేజి మరింత డామేజి అవుతుందని తెలిసినా తెలియనట్టు ఉంటాడా? లేక చనిపోయినవారికోసం ఆలోచించి బతికున్నవారు ఇబ్బంది పడడం భవ్యం కాదని ఆ అస్త్రాన్ని బయటకు తీస్తాడా? జగన్ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే సోనియా ఇబ్బందుల్లో పడుతుందా? ఇలాంటి కిలాడీలని మించిన జగత్ కిలాడీ తను అని ఋజువు చేసుకొని తిప్పి కొడుతుందా? అతిత్వరలో తేలిపొయే ప్రశ్నలు ఇవి. వేచి చూద్దాం.

2 comments:

Anonymous said...

మీరు చెప్పింది బాగానే ఉంది. కాని, ఇప్పటి దాకా సోనియమ్మ తీసిన మూడు కార్డులు సూపర్ హిట్ అయ్యి జగనన్న గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయి. మరో పక్క మన జగనన్న తీసిన రెండు కార్డులు ఫ్లాప్ అయ్యి కూర్చున్నాయి పాపం. ఇంక మూడో కార్డు ఏమి తీస్తే మాత్రం ఏమిటి లాభం?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

పాశుపతాస్త్రం చేతిలో ఉంటే ప్రత్యర్ధి ఎన్ని బాణాలేసినా తిప్పి కొట్టొచ్చు. అయితే మన జగన్ బాబు దగ్గర ఈ అస్త్రం ఉందా లేదా అన్నదే ప్రశ్న.