నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, December 24, 2011

అక్కడ స్కూల్స్‌లో కాళ్ళూ చేతులూ నరకడమే సిలబస్


సౌదీ అరేబియాలో పాఠశాలల్లో పిల్లల పాఠ్య పుస్తకాలలో షరియా చట్తం విధించే శిక్షలకి అనుగుణంగా చేతులూ నరకడం ఎలాగా అన్నదే సిలబస్‌గా ఉంది. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల పిల్లల పుస్తకాలలో ఈ పాఠాలు ఉన్నాయి. యూదులని నాశనం చేయాలి అని, హొమో సెక్సువల్స్ సమాజానికి హాని కరం కాబట్టి వారిని నాశనం చేయాలి అని ఈ పాఠాల సారాంశం.


Barbaric: These textbooks handed out in Saudi Arabian schools teach children how to cut off a thief's hands and feet under Sharia law 

ఇది ఆ పుస్తకంలో ఒక పేజి

School prayers in Jeddah, Saudi Arabia, where children learn how to chop off the hands and feet of thieves, it is claimed  

చిన్నప్పటి నుండి ఇలా పాఠాలు చెప్తూ ఉంటే టెర్రరిస్టులు తయారు కాకుండా ఉంటారా అని వీటిని చూసిన వారు వాపోతున్నారు. యూదులు, స్వలింగ సంపర్కులనే కాకుండా ఆడవారి మీద కూడా ఈ పుస్తకాలలో తక్కువగా చూపిస్తున్నారు. ఆడవారు బలహీనులు, బాధ్యత లేని వారు అని వీటిలో ఉంటుంది.
 


యూదులతో యుద్ధం చేసి వారిని సమూలంగా నాశనం చేయడమే ప్రతి ఒక్కరి బాధ్యత అన్నది ఈ పాఠాలలో ముఖ్యమైన పాయింట్.

2 comments:

Praveen Mandangi said...

సౌదీ అరేబియా అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఆటవిక రాజ్యం. ఆర్థిక అభివృద్ధి జరిగినంతమాత్రాన సామాజిక అభివృద్ధి జరగదు అనడానికి సౌదీ అరేబియా లాంటి దేశాలే ఋజువులు.

యశోదకృష్ణ said...

ilaantivi chaduvuthunte em maatladaalo kooda ardham kaadu. anthaga manasu vulikki paduthuntundi.