నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, January 7, 2012

భారత బ్యాటింగ్ సత్తా అంచనా వేయలేకపోయిన మైఖేల్ క్లార్క్


సిడ్నీ టెస్టులోమూడవ రోజు, అప్పటికే ఆస్ట్రేలియాకి భారీ ఆధిక్యం లభించింది, కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 329 పరుగులతో అజేయంగా ఉన్నాడు. టీ సమయానికి ఇంకా కొన్ని ఓవర్లు మిగిలున్నాయి, వాటి తరువాత ఒక సెషన్ ఆట, దాని తరువాత రెండు రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటికి అస్ట్రేలియాకి ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి, క్లార్క్ ఇష్టం వచ్చినట్లు బంతిని బాది పారేస్తున్నాడు, ఇంకో వైపు మైఖేల్ హస్సీ కూడా వన్డే లెవెల్లో ఉతికేస్తున్నాడు. క్లార్క్ ముందు ఎన్నో రికార్డులు ఊరిస్తున్నాయి. అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్లేలియన్‌గా రికార్డు సాధించిబ్రాడ్‌మాన్, హెయిడెన్‌ల సరసన చేరవచ్చు, దాన్ని దాటి టెస్టుల్లో అత్యధిక స్కోరు 400 పరుగులతో లారా రికార్డు, అప్పటికీ ఓపిక మిగిలి ఉంటే ఎవరూ దగ్గరికి కూడా రాలేని విధంగా 500 పరుగులు  కూడా  సాధించ వచ్చు. అప్పటికే భారత కెప్టెన్ ధోని వికెట్లు తీసే ప్రసక్తి పెట్టుకోకుండా రక్షణాత్మక వ్యూహాలతో బౌలింగ్ వేయిస్తున్నాడు. కొట్టి కొట్టి కొట్టే వాడే అలిసి పోక పోతాడా అన్న పద్ధతిలో భారత్ బౌలింగ్ సాగుతోంది. ముందుగా డిక్లేర్ చేయకపోతే మిగిలిన రెండు రోజులూ బ్యాటింగ్ చేసి భారత్ మ్యాచ్‌ని కాపాడుకొంటుందేమో అన్న భయానికి తావు లేకుండా అప్పటికి ఆడిన మూడు ఇన్నింగ్స్‌లోనూ ఒక రోజు పూర్తిగా భారత్ ఆడలేకపోయింది.
    


ఇలాంటి స్థితిలో మైఖేల్ క్లార్క్ భారత ఆటగాళ్ళని చూసి భయపడ్డాడు. అరివీర భయంకరులు ఉన్న బ్యాటింగ్ లైనప్ చూసి వీళ్ళు రెండు రోజులూ పూర్తిగా బ్యాటింగ్ చేసి తమకు విజయం అందకుండా చేయగల సమర్ధులు అని బెంబేలెత్తాడు. వ్యక్తిగత రికార్డుల కోసం మ్యాచ్‌ని పణంగా పెట్టలేకపోయాడు. అటు వైపు హస్సీ 150 పరుగుల స్కోరు అందుకోగానే తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అయితే ప్రత్యర్ధి సత్తా సరిగ్గా అంచనా వేయడం అతడికి చేత కాలేదని ఎత్తి చూపిస్తూ  ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే మన జట్టు ఆలౌటయింది.


"నా రికార్డుల కన్నా జట్టు విజయం ముఖ్యం, అందుకే డిక్లేర్ చేశాను. ఒక వేళ విజయం సాధించడానికి మరిన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉందనిపించి ఉంటే బ్యాటింగ్ కొన సాగించి ఉండేవాడిని" అని చెప్పాడు నాలుగవ రోజు ఆట ముగిశాక. 

మన చవటాయిలు కానీ, అంతకన్నా చవటాయి మీడియా కానీ మన వాళ్ళు ఆస్ట్రేలియా పర్యటన లక్ష్యం అక్కడ మ్యాచ్‌లు గెలవడమే కానీ సచిన వందో సెంచరీ కోసం కాదని, సిరీస్ విజయంలో ఆ ముచ్చట తీరితే అనందించాలి కానీ అదే అసలు టార్గెట్ కాదని గుర్తిస్తే మంచిది.

No comments: