నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, January 31, 2012

దళిత ముద్ర లేకపోతే అంబేద్కర్‌కి ఇంత సీనుండేదా?


మొన్న అమలాపురంలో కొందరు దుండగులు అంబేద్కర్ విగ్రహాలు నాశనం చేయగానే అన్ని పార్టీలకు చెందిన నాయకులు యుగాంతం వచ్చినట్లు రియాక్ట్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ వచ్చి ఆ విగ్రహాలను పరిశీలించి ఆ సంఘటనని ఖండించారు. చివరికి వి. హనుమంత రావు కూడా రంగంలోకి వచ్చాడు. అంబేద్కర్ విగ్రహాలని ప్రభుత్వమే పునరుద్ధరించాలని, కాంస్య  విగ్రహాలని ఏర్పాటు చేయాలని, అన్ని అంబేద్కర్ విగ్రహాలకి ప్రభుత్వం రక్షణ ఏర్పాటు చేయాలని ఇలా ఎవరికి తోచినట్లు వారు స్టేట్‌మెంట్లు ఇచ్చి అంబేద్కర్ అంటే తమకి ఎంతో భక్తి ఉందని చాటుకోవాలని ప్రయత్నించారు. మరి కొందరయితే అంబేద్కర్ అసహ్యించుకున్న బ్రాహ్మణవాద రిచువల్స్ అయిన క్షీరాభిషేకం, గంగా జల, గంధపు అభిషేకం లాంటి వాటితో ఆ విగ్రహాలని శుద్ధి చేసే తిక్క పనులు కూడా చేశారు.
   

ఈ ఎపిసోడ్ మొత్తంలో అందరూ వినిపించిన రాగం ఏమంటే అంబేద్కర్ ఏ ఒక్క మతానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు, భారత రాజ్యాంగ నిర్మాతగా మొత్తం జాతికే ఆరాధ్యనీయుడు, భారత జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తి అన్నది. అంబేద్కర్ దళితుడు కాకపోయినా, దళిత ఓటు బ్యాంకుకి ఆయన ఐకాన్ కాకపోయి ఉన్నట్లయితే ఈ నాయకులు ఈ విషయంలో ఇంతగా స్పందించి ఉండేవాళ్ళా? రాజ్యాంగాన్నే ఎప్పుడో తుంగలో తొక్కిన ఈ నాయకులు రాజ్యాంగ నిర్మాతకి ఈ విలువ ఇచ్చేవారా? 

11 comments:

Saahitya Abhimaani said...

Your post is politically not correct.

But frankly speaking, "Well Said"

Venhu said...

Well Said. khacchitamga icchevallu kadu.

Anonymous said...

1. Indian constitution was a borrowed one, just lifted from British with minor changes.
2. Ambedkar did not write the constitution,,if anybody say it his life is ruined..no politian would dare to utter it..that'd be end of his carreer
3. Ambedkar was not even a member of the origenal committee to oversee the constitution. He was included at the last moment at the insistence of NG Ranga.
4. There are hundreds of his statues with broken hands, legs, faded colours birds nests on them with missing parts. nobody cares,...
5. He is black at one place blue at other place...white .gold yu name it..different colours and sizes erected next to mutton shop and public shops..where were all these deciples then...
6. A mockery of democracy...

rajachandra said...

అంబేద్కర్ ఏ ఒక్క మతానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు అని అందరు బల్ల గుద్ది.. ఎన్ని స్టేట్మెంట్లు ఈచ్చిన మన రాజకీయానాయకులు ఒప్పొకోరండి.. మోన్న జయప్రకాశ్ గార్ని అసంబ్లిలో కోట్టినప్పుడు ఈ నాయకులు అంత ఎమయ్యరు?

Praveen Mandangi said...

దళిత ముద్ర ఉన్నంత మాత్రాన అంబేద్కర్ విగ్రహాల ద్వంసాన్ని జస్టిఫై చెయ్యలేము. నిజమైన కులగజ్జి హీరో అయిన వంగవీటి రంగా విగ్రహాలని ఎవరైనా ద్వంసం చేస్తారా? కాపులు గొడవ చేస్తారని సమాధానం చెప్పి ద్వంసం చెయ్యము అంటే సమాధానం పనికి రాదు. అంబేద్కర్ విగ్రహాలని ద్వంసం చేసినా దళితులు గొడవ చేస్తారు. ఈ విషయం విగ్రహాలని ద్వంసం చేసేవాళ్ళకి తెలుసు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం చేయడాన్ని జస్టిఫై చేయడం నా ఉద్ధేశ్యం కాదు. ఆయన వెనక దళిత ఓటు బ్యాంకే గనుక లేకుండా ఉంటే ఈ నాయకులు ఎవరూ ఆయన్ని ఇసుమంతయినా పట్టించుకొనేవాళ్ళు కాదు అని చెప్పాలనుకొన్నాను.

Praveen Mandangi said...

అంబేద్కర్ వెనుకాల దళిత వోట్ బ్యాంక్ ఉంది, నిజమే. అయితే వంగవీటి రంగా లాంటి నిజమైన కుల గజ్జి హీరోల విగ్రహాలు కాపులు ఎక్కువగా ఉన్న గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్నాయి. వాటిని ఎవరూ ద్వంసం చెయ్యరు. కులగజ్జి అనేది అగ్రకులాలవాళ్ళకి ఉంటే ఫర్వా లేదు కానీ దళితులకి మాత్రం ఉండకూడదు అని అక్కడివాళ్ళు అనుకుంటారు.

మన దేశంలో రిజర్వేషన్ విధానం ఉంది. ఆ విధానం వల్ల ఒక వర్గంవాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి, ఇంకో వర్గంవాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి. రిజర్వేషన్‌ల వల్ల తమకి అవకాశాలు పెరుగుతాయనిపిస్తే రిజర్వేషన్‌లని సమర్థిస్తారు, రిజర్వేషన్‌ల వల్ల తమకి అవకాశాలు తగ్గుతాయనిపిస్తే రిజర్వేషన్‌లని వ్యతిరేకిస్తారు. కులం మీద, మతం మీద వ్యక్తిగతంగా నమ్మకం లేని నాస్తికులు కూడా తమ అవకాశాల విషయానికొచ్చేసరికి ఇలాగే బిహేవ్ చేసి కులం పేరుతో ఇతరులని దూషిస్తారు. వాళ్ళు రిజర్వేషన్‌లని వ్యతిరేకించే వర్గంవాళ్ళైతే అంబేద్కర్ గాడే రిజర్వేషన్‌లని తెచ్చాడంటూ అంబేద్కర్‌ని తిడతారు. నిజానికి రిజర్వేషన్‌లని తెచ్చింది అంబేద్కర్ కాదు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కొల్‌హాపుర్ సంస్థానంలో రిజర్వేషన్‌లు ఉండేవి. వాటిని దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని డిమాండ్ వస్తే ఆ డిమాండ్‌ని అంబేద్కర్ సమర్థించాడు. కనుక రిజర్వేషన్‌లని వ్యతిరేకించడానికి అంబేద్కర్ విగ్రహాలని కూల్చడం కూడా హాస్యాస్పదమే.

Anonymous said...

you should also think whether nehru would have become pm had he not been a brahmin,whether raja sekhara reddy would have become a powerful cm had he not belonged to reddy community,had ntr become a film hero had he not been a khamma.you should realise that ambedkar could have beeen regarded as a greatest intelectual in the entire history of india by people like you had he not been a dalit and had he belonged to some upper caste.
it is indeed foolishness eulogised as caste arrogance to say that ambedkar has not written constitution.i pray to buddha to shower some wisdom on these ignorants.

Bolloju Baba said...

i second the last anon comment.

regarding statues damage - every one knows why it happened- why it has been made a big issue - all have hidden agendas. అర్ధం అవ్వాల్సిన వారికి అర్ధం అయ్యే ఉంటాయి.
కానీ ఈ సందర్భంలో అంబేద్కర్ గుణగణాలను చర్చించటం సబబు కాదు.

Praveen Mandangi said...

అమలాపురంలో వంగవీటి రంగా విగ్రహం చూసి "ఈ వీధి రౌడీకి విగ్రహాలు అవసరమా!" అని ఆశ్చర్యపోయాను. రాజోలులో ఒక వ్యక్తిని ఇలా అడిగాను "అమలాపురంలో వంగవీటి రంగా విగ్రహం ఉందేమిటి? అతను ఎవరో అక్కడివాళ్ళకి తెలుసా?" అని. అతను ఇలా సమాధానం చెప్పాడు "ఒళ్ళు కొవ్వెక్కి, తిన్నది అరక్క వంగవీటి విగ్రహం పెట్టారు" అని. వీధి రౌడీల విగ్రహాలు ఎవరూ కూల్చరు కానీ జాతి నాయకుల విగ్రహాలు కూల్చడానికీ లేదా చెప్పుల దండలు వెయ్యడానికీ మాత్రం సంసిద్ధంగా ఉంటారు.

Praveen Mandangi said...

ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/1regavjdrMt