నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, February 9, 2012

ధర్మాన్ని తల కిందులు చేసి పారేస్తున్నారు కదరా?


భారత ధర్మంలో ఒక సూత్రం ఉంది. ఒక నేరం సైనికుడు చేస్తే విధించే శిక్ష అదే నేరాన్ని సైన్యాధికారి చేస్తే పెరుగుతుంది. అదే నేరం మంత్రి చేసినప్పుడు శిక్ష మరింత పెరిగి, రాజు చేసినప్పుడు ఇంకా పెరుగుతుంది. ఒకే నేరానికి కింది స్థాయి నేరస్తులకన్నా పై స్థాయిలో ఉన్న వారికి శిక్ష తీవ్రంగా ఉంటుంది. స్థాయి పెరిగే కొద్దీ విచక్షణ, బాధ్యత పెరగాలని దీని నిర్దేశకుల అభిప్రాయం అయ్యుండవచ్చు.
 
అయితే ఇప్పుడు ఈ సూత్రాన్ని తలకిందులు చేసి ఆచరిస్తున్నారు. మద్యం ముడుపులు తీసుకున్నందుకు కింది స్థాయి అధికారులను విచారించి అరెస్టు చేస్తుండగా సాక్షాత్తూ మంత్రి మీదే లంచం పుచ్చుకున్నారని ఆరోపణ చేస్తే ఏ చర్యా లేకుండా పోయింది. నా మీద నేరం ఋజువు చేయండి, రాజీనామా చేసేస్తా అని చాలెంజ్ విసురుతున్నారు ఆ మంత్రి గారు. దేశంలో జైళ్ళలో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలందరూ ఇదే బాట పట్టి, "మమ్మల్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. మమ్మల్ని వదిలేయండి. మా మీద నేరం ఋజువయితే మేమే వచ్చి జైల్లో కూర్చుంటాం" అంటే అధికారులు ఏం చేస్తారో?!