నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, February 20, 2012

రవికలు విప్పి రొమ్ములు చూపడం వాళ్ళు నిరసన వ్యక్తం చేసే పద్ధతి


ఏదైనా అంశమ్మీద నిరసన తెలియజేయాలనుకుంటే ఒక చోట కూర్చుని నినాదాలు చేయడం అనేది సాధారణంగా చేసే ప్రక్రియ. కొన్ని సార్లు నోళ్ళకి నల్ల రిబ్బన్లు కట్టుకుంటారు. ఇంకొంచెం క్రియేటివ్‌గా కొన్ని సార్లు బూట్ పాలిష్ చేయడం లాంటివి కూడా చేస్తారు. మొన్న ప్రత్యేక తెలంగాణా కోసం రోడ్ల మీద వంటా వార్పు కూడా చేశారు. అర్ధ నగ్న ప్రదర్శన అనేది మరొక ఐటమ్. ఇది కేవలం మగ వాళ్ళే చేస్తారు.


అయితే ఉక్రెయిన్‌లో ఫెమెన్(FEMEN) అని ఒక సంస్థ ఉంది. వీళ్ళు ఏదైనా అంశమ్మీద నిరసన తెలియజేయాలని అనుకుంటే ఆచరించే విధానం అర్ధ నగ్న ప్రదర్శన. అందరూ ఆడవాళ్ళే దీనికి పూనుకుంటారు. వీరి సభ్యులు ఒక చోట చేరి జాకెట్లు, చొక్కాలు విప్పి పారేసి రొమ్ములు చూపించి నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తారు. 
    
పోయిన వారం ఉక్రెయిన్ రాజాధాని కీవ్‌లో భారత రాయబార కార్యాలయం ముందు ఈ సంస్థ కి చెందిన కొందరు అమ్మాయిలు ఇలా అర్ధ నగ్న ప్రదర్శన చేసి భారత జెండాని కాళ్ళతో తొక్కి కాల్చి వేశారు. భారత దేశానికి వచ్చిన ఉక్రెయిన్ అమ్మాయిలు చాలా మంది వ్యభిచారంలోకి దిగుతున్నారని, అంచేత ఉక్రెయిన్ యువతులకి వీసా మంజూరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం తన అధికారులకి సూచనలివ్వడం వీరికి కోపం తెప్పించింది. ఉక్రెయిన్ వ్యభిచారుల కొంప కాదు, మేము వ్యభిచారులం కాదు అని అర్ధ నగ్నంగా నినాదాలు చేశారు ఈ సంస్థ సభ్యులు. 
 
18 నుండి 20 యేళ్ళలోపు వయసున్న యూనివర్సిటీ విద్యార్ధినులు ఈ సంస్థ సభ్యులుగా ఉంటారు. ఇందులో ఇరవై మంది యాక్టివ్ సభ్యులు ఉన్నారు. నిరసన ప్రదర్శనలో రవికలిప్పి చూపడం వీరు చేస్తారు. వీరికి అండగా మరొక మూడు వందల మంది సభ్యులు ఉన్నారు. 2008 లో హన్నా హుట్సోల్ అనే ఆమె ఈ సంస్థని స్థాపించారు. మన పాత బస్తీ అమ్మాయిల్లాగా పెళ్ళిళ్ళ పేరిట విదేశీయుల చేతిలో ఉక్రెయిన్ ఆడ పిల్లలు మోస పోవడం చూసి అందుకు నిరసన తెలియ జేయడానికి ఈ సంస్థ పుట్టింది. 
 
HANNA HUTSOL

 
      AT DAVOS

సెక్స్ టూరిజానికి, ఉక్రెయిన్‌లో పెరిగి పోతున్న వ్యభిచారానికి, ఇంకా అనేక అంతర్జాతీయ అంశాలమీద వీరు తమదయిన పద్ధతిలో నిరసన తెలియజేస్తారు. ఆ మధ్య వ్యభిచార నేరం అరోపించబడి రాళ్లతో కొట్టి చంపే శిక్షకి గురయిన ఇరాన్ యువతి మహ్మది సకినేకి మద్ధతుగా కూడా వీళ్ళు టాప్‌లెస్ ప్రదర్శన చేశారు. ఉక్రెయిన్‌లో ఆడవారికి పబ్లిక్ టాయిలెట్‌లు కావాలని కొందరు సభ్యులు పిరుదులు చూపించి ప్రదర్శన చేశారు. ఇది తప్పితే మిగతా అన్ని ప్రదర్శనల్లో వీళ్ళు కేవలం రొమ్ములు మాత్రమే చూపించి నిరసన వ్యక్తం చేస్తారు.
 
నిరసన తెలియజేయాలంటే రొమ్ములు చూపడం ఎందుకు అని ఎవరయినా అడిగితే "ఈ దేశంలో మా ఆవేదన అందరికీ తెలియాలంటే ఇదొక్కటే మార్గం. ఏదో బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తే ఎవరూ పట్టించుకోరు" అన్న సమాధానం వస్తుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఈ సంస్థ భావిస్తోంది. 

2 comments:

Anonymous said...

Really a novel method.

SANDHYA said...

Is it?