నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, February 18, 2012

టాయిలెట్‌లో కూడా ప్రయాణీకులని ఎక్కిస్తున్న పాక్ విమానాలుసాధారణంగా పల్లెలకి వెళ్ళే ఎర్ర బస్సుల్లోనూ, పండగలూ పబ్బాలూ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ గురించి పట్టించుకోరు. వచ్చిన ప్రతివాడిని బస్సెక్కించి ఎక్కడో చోట సర్దేస్తారు. అయితే విమానంలో కూడా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు. మొన్న గురువారం(ఫిబ్రవరి 16)న పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇలాంటి వింత జరిగింది. PIA(pakistan international airlins) కి చెందిన PK303 విమానాన్ని నడిపే కెప్టెన్‌కి గతంలో ఇలా బస్సులని నడిపిన నుభవం ఉందేమో తెలియదు గానీ, విమానంలో సీట్లన్నీ నిండాక ఇద్దరు ప్రయాణీకులు వస్తే వారిని తిప్పి పంపలేదు. టాయిలెట్ ఖాళీగా ఉంది కదా దాన్ని వృధా చేయడం ఎందుకని అనుకున్నాడో ఏమో ఆ ఇద్దర్నీ అందులో కూర్చోబెట్టి లాహోర్ నుండి కరాచీకి విమానాన్ని నడిపేశాడు. 
  
 


ఈ విషయం తెలిశాక, సదరు కెప్టెన్ ’పెట్టె బయటి ఆలోచనా విధానాన్ని(out of the box thinking” మెచ్చుకోవలసింది పోయి బధ్రతా అధికారులు అతని మీద విచారణకి అదేశించారు. 


No comments: