నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, August 14, 2012

తప్పు చేస్తే కేసు పెట్టేయడమేనా, వాడిది ఏ కులమో చూసుకోవాలికదా?


ఈ మధ్య ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన ట్రెండ్ మొదలయింది. కోట్లకి కోట్లు ప్రజల డబ్బు కాజేసిన ఘరానా దొంగ నాయకులయినా, బజారు గూండాల్లా ప్రవర్తించే రౌడీ నేతలయినా పొలీసు కెసులో, విచారణో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు సదరు నాయకులకి చెందిన కుల సంఘాల నాయకులు రంగంలోకి దూకేస్తారు. ఒక బిసీ, నాయకుడో, దళిత లీడరో, మైనారిటీ జనాల ఆశాజ్యోతో కావడం వల్లనే మా నాయకుడిని అన్యాయంగా కేసులో ఇరికించారు, ఈ తీరు మారక పోతే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం అంటూ బీరాలు పలుకుతారు. అసలు సదరు నాయకుడో లెదా నాయకురాలో చెసిన తప్పేమిటి, అందులో వాస్తవాలేమిటో చూడకుండా ఈ చోటా మోటా పోటుగాళ్ళు ఇలా రంకెలు ఎందుకు వేస్తారో? అయినా ఏ నేరమూ చేయకుండా కేసుల్లో ఇరికించి కుమ్మేసేది ఎప్పుడూ సాధారణ, బడుగు ప్రజలనే. అంతే కానీ ఈ నాయకులమీద సరయిన ఆధారాల్లేకుండా కేసులు పెట్టడమే? ఈ కుల సంఘాల నాయకులు కూడా తమ కులానికే చెందిన అమాయకులనీ, ఏ అండా లేని వారిని అసలు పట్టించుకున్న పాపాన పోరు. ఆ మధ్యన ఆయేషా అన్న అమ్మాయిని హత్య చెసిన కేసులో ఒక అమాయక దళితుడిని ఇరికించి జైలులో పడేస్తే ఈ సోకాల్డ్ దళిత ఉద్ధారకులు నొరెత్తిన పాపాన పోలేదు.

 ayesha meera 
రక్తం మడుగులో ఆయేషా                                              అమాయకుడు సత్యం బాబు

మోపిదేవి వెంకట రమణ, పార్ధసారధిల మీద కేసులు పెట్టినప్పుడు మేము బలహీనవర్గాల వాళ్ళమనే ఈ కేసులు అని వాళ్ళు, వాళ్ళకి మద్ధతుగా గడ్దం కృష్ణయ్య రంకెలేశారు. నిన్నకి నిన్న ఒక గుడికి తాళమేసి, అడ్డొచ్చిన వారిని కుమ్మేసి, పోలీసు ఇన్స్‌పెక్టర్ని జనమందరి మధ్యలో బండ బూతులు తిట్టిన దానం నాగేందర్‌కి కూడా ఇలాగే కుల ప్రాతిపదికన మద్ధతు లభించింది. ఇప్పుడు ఈ లిస్టులో తాజాగా ధర్మాన ప్రసాదరావు చేరాడు. ఇప్పటికే ముగ్గురు బీసీలపైన కేసులు పెట్టాము, ఇప్పుడు మరొక బీసీనా అని సిఎం కూడా సందేహిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అటూ ఇటూ అయితే దాడి చేయడానికి బీసీ సంఘాలు కూడ సిద్ధం అవుతున్నాయట. వివాదాస్పద జీవోల జారీలో కేబినెట్ అందరికీ సమిష్టి బాధ్యత అని వాదిస్తే అది వేరే విషయం. అంతే కానీ మా కులపోడి మీదా కేసులు పెడతారా అని వాదిస్తే ఎలా?
    
కొన్నాళ్ళకి పోలీసులు ఎవరి పైన అయినా కేసు పెట్టాల్సి వస్తే వాళ్ళ కులమేమిటో, బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో విచారించి మరీ కేసులు పెట్టే పరిస్థితి వస్తుందేమో? దేవుడా నువ్వే కాపాడాలి ఈ దేశాన్ని. సారీ మరీ అసాధ్యమయిన కోర్కెలు కోరుతున్నానా?

5 comments:

Anonymous said...

well said
I am so scared what is going to happen in the future.
Dalits should be arrested by only the same cast inspectors..should go infrnt of same caste judges..should have only leinient terms..etc..etc
The worst is yet to come

Anonymous said...

మరీ అసాధ్యమయిన కోర్కెలు కోరుతున్నారు:}

మాధవ్ said...

తప్పు చేసినా సరే మన కులం కాబట్టి గుడ్డి గా సపోర్టు చెయ్యడమే ఈ సంఘాల నాయకుల పని. వాళ్ళ కుండే రాజకీయ లాభాలే వాళ్ళకి ముఖ్యం.

Anonymous said...

మరి, దోపిడీలో కూడా సామాజిక న్యాయం పాటించాలి కదా?

Praveen Mandangi said...

సత్యం బాబు పేద దళితుడు. తెల్ల చొక్కాలు వేసుకునేవాళ్ళు నడిపే కుల సంఘాలు పేద దళితుల గురించి ఎందుకు పట్టించుకుంటాయి? ధర్మా ప్రసాదరావు ఒక ప్రముఖ గ్రానైట్ కంపెనీ ఓనర్ కాబట్టి కుల సంఘాలు అతని గురించి పట్టించుకున్నాయి.