నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, August 22, 2012

పోలీసులా? రాక్షసులా?


చావు బతుకుల్లో ఉన్న వాడు ఫామ్ నింపడం అవసరమా అనడుగుతాడు శంకర్ దాదా సినిమాలో చిరంజీవి. అవును, వాడి ప్రాణాలు పోతున్నా సరే, ఫార్మాలిటిస్ ఫాలో అవ్వాల్సిందే అని నిరూపించారు ఇండోర్ పోలీసులు. 

మనిషన్న వాడు ఎవరయినా ఒక పక్క మరొక మనిషి చావుకి దగ్గరవుతూ ఉంటే ముందు అతడి ప్రాణాలు ఎలా కాపాడాలా అని చూస్తారు. కానీ ఇండోర్ పోలీసులు మాత్రం ముందు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవాలి, ఆ తరువాత మాత్రమే ప్రాణాలు కాపాడే పని అన్నట్లు ప్రవర్తించి, ఒక యువకుడి ప్రాణం పోవడానికి కారణమయ్యారు.

రవి అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి తన సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులని ఎదిరించడంతో రెచ్చిపోయిన ఆ అల్లరి మూకలు అతడిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అతడిని నేరుగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా స్టేట్‌మెంట్ కోసం స్టేషనుకి తీసుకెళ్ళి, నింపాదిగా 108కి ఫోన్ చేసి, స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ అంబులెన్స్ వచ్చి అతడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపు దారిలోనే చనిపోయాడు.

ఈ విషయమై పోలీసులని ప్రశ్నించిన విలేఖరులు వాళ్ళు స్టేట్‌మెంట్ ఇచాకే వైద్యం అని పోలీసులు చెప్పడంతో అవాక్కయ్యారు.

3 comments:

Meraj Fathima said...

కొన్ని రూల్స్ విరుద్దంగా చెయ్య కూడదు కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కాదు.
అయినా ఏదైనా ప్రమాదం సంబవిస్తే జనాలు శ్రోతలు అవుతారు గాని కార్య శూరులు కారు.
పోలీసులు అంతే ప్రజలూ అంతే దొందూ దొందే. చక్కటి పోస్ట్, ఇలాంటి అర్ధవంతమైన విషయాలను వెలుగులోకి తీసికురావాలి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ధన్యవాదాలు.

Anonymous said...

Statement appudu kaakapote taruvatha ayina teesukovachu. pranam pote yevaru teesukuvastaaru? debbala to baadha padutunna manishi noppi kaani, atanu pote vaalla family pade baadha kaani yemi pattakunda veella formalities poorthi chestunnarante vellaki common sense, civic sense yemi levu. sahaanubhooti kaadu kada saanubhooti kuda ledu. Its very sad to have people like this working especially in departments which are supposed to protect and serve people.