నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, December 21, 2012

డిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులని శిక్షించకూడదు


అవును వాళ్ళకి శిక్ష పడకూడదు. ఒక వేళ శిక్ష పడితే ఏం పడుతుంది. ఏడాదో, రెండేళ్ళో మహా అయితే ఏ మూడు నాలుగేళ్ళో జైలు. అంతే. ఆ రాక్షసులు జరిపిన అమానుష హింసకి అది సరిపోతుందా? నిస్సందేహంగా సరిపోదు. అంతకు మించి శిక్ష వేయడానికి మన చట్టం ఒప్పుకోదు. అయితే వాళ్ళని ఏం చేయాలి. కాల్చి పారేయాలి. ఆ మధ్య అమ్మాయిల మీద ఆసిడ్ దాడి ఘటనలో వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాన్ని షీలా దీక్షిత్ కూడా తీసుకొని వాళ్ళని కాల్చి పారేయమని పొలీసులకు చెప్పాలి.
 
దానికి ఓ చిన్న పిట్టకథ అల్లి మీడియాకి చెప్పవచ్చు. నిందితులని కోర్టుకి తీసుకెళ్ళే సమయంలో పోలీసుల దగ్గరున్న తుపాకులు లాక్కుని దాడి చేయడానికి ప్రయత్నించారని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపగా అందులో వాళ్ళు మరణించారని చెబితే ఏ ఒక్కరు, చివరికి ఆ చండాలుర కుటుంబ సభ్యులు కూడా నోరెత్తరు. 

వీళ్ళకి ఇది తగిన శిక్షేనా? అవును నిస్సందేహంగా! ఈ వెధవలు చేసింది మామూలు అత్యాచారం కాదు. చాలా పాశవికంగా హింసకి గురి చేశారు ఆమెని. చిన్న పేగు మొత్తం ఆ దాడిలో గాయపడి, కుళ్ళిపోతే డాక్టర్లు దానిని పూర్తిగా తొలగించి వేశారు. అత్యాచారం కేసుల్లో ఎప్పుడూ ఇంత హింస చూడలేదని ఆమెకి వైద్యం చేసే డాక్టర్లు చెప్పారు.

కన్నుకి కన్ను అన్నది ఆటవిక న్యాయం కదా? అయితే కానివ్వండి. నాగరీక న్యాయం పని చేయనప్పుడు ఆటవిక న్యాయమే సరయినది. అయినా న్యాయం, చట్టం అనేవి మనుషులకి వర్తిస్తాయి కానీ జంతువులకి కాదు. ఇలా నిందితులని చంపడం ఈ సమస్యకి పరిష్కారమా? కాకపోవచ్చు. మగవారి మైండ్ సెట్ మార్చి, సమాజంలో ఆడవారికి భయం లేకుండా చేసే ఒక బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసే ప్రోగ్రాం ఒక పక్కన ఎవరయినా చేసేవరకూ ఇలాంటి కౄర మృగాలని ఏరి పారేస్తూ ఉంటే అది ఏ ఒక్క మగ పశువునయినా భయ పెట్టి, ఆడదాని మీద చేయి వేయడానికి భయపడేలా చేసి ఒక్క మానభంగాన్ని అయినా నిరోధించగలిగితే ఈ నిందితుల చావు మంచి ఘటనే కదా?

లెబనాన్‌లో రేపిస్టులకి విధించే శిక్షలు ఇవి


కొంత మంది చెబుతున్నట్లు వృషణాలు కోయడమో, పురుషాంగాన్ని కోసేయడమో వీరికి తగిన శిక్ష కాదు. అది వీరిలో రాక్షసత్వాన్ని మరింత పెంచి వీళ్లని ఇమ్కా పశువులని చేసి వీరిలో హింసా ప్రవృత్తిని ఎక్కువ చేస్తుంది. అప్పుడు వీరివల్ల సమాజానికి మరింత హాని జరుగుతుంది. అది మంచిది కాదు. నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న మన దేశానికి అయిదు మంది చావు వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని వీరిని కాల్చి పారేయడం ఒక్కటే పరిష్కారం. కనీసం ఇప్పటికి.

27 comments:

Anonymous said...

బాగా రాశారు. టైటిలేంట్రా ఇలా ఉంది అని చదివాను. మీతో ఏకీభవిస్తాను. You are right.

Anonymous said...

yes, I agreed.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thanks to both of you.

కాయ said...

మీ బొంద. అత్యాచారమూ చెడే, ఇలా హింసించటమూ చెడే. చేయవలసింది ఇది కాదు. చదువులు ప్రాక్టికల్ చేయాలి, మనుషుల శారీరక, మానసిక వాంఛలను అదిమి పెట్టుకోకుండా జీవించటం అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. ఎంతో కాలంగా అదిమి పెట్టుకున్న కోరికలు సమయం దొరికితే ఇలా మృగత్వాన్ని నిద్ర లేపవా ?

మన చదువులు బిజినెస్ లు నడిపించటానికి, లేక పోతే విదేశాల్లో పనికి సరిపోయేలా, ఇంకా చెప్పాలంటే డబ్బులు సంపాదించటం ఎలా అనే దానికి మాత్రమే సరిపోతున్నాయి. నా చిన్నప్పుడు పెద్ద పెరిగినంక ఏమవుతవ్ రా అని అడిగేవాళ్ళు. ఉట్టి బట్టలు.

ఈ ఆటిట్యూడ్ మారి చదువులు మనిషులను తయారు చేయడానికి ఉపయోగపడితే, మృగాలు అడవుల్లో తప్ప సమాజంలో ఏర్పడవు.

చదువుల్లో కాంపిటీషన్ తగ్గించి నేర్చుకోవటం మాత్రమే ప్రియారిటీ చేస్తే హింస తగ్గి, సృజనాత్మకత పెరుగుతుంది.

కాయ said...

మనుషుల్లో చాలా అంశాల్లో లోటుతో జీవిస్తున్నారు. అందులో ప్రేమ ముఖ్యంగా. సరిగా ఎడ్యుకేట్ చేసేలా వాతావరణాలను ఏర్పరిస్తే ఇలాంటి దారుణాలను నిరోధించవచ్చు. చదువులు అంటే నా ఉద్దేశ్యం సమాజపు చెడు ధోరణులను గుర్తించి సరైన దారిలో నడిపించేవే.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కాయ గారూ తమరి బొంద. మీరు ఈ పోస్టు పూర్తిగా చదివినట్టు లేదు. మగాళ్ల ఆటిట్యూడ్ మార్చే కార్యక్రమం మీరు చేస్తూ ఉండండి. అది ఫలించే లోగా ఇలాంటి రాక్షసులకి ఇది సరయిన శిక్ష అని నా అభిప్రాయం. మీ ప్రయత్నం ఫలించి సమాజంలో మగవారు అందరూ మనుషులుగా మారాలని ఆశిస్తున్నాను. Best of luck.

కాయ said...

మీరు బాధితురాలిని తలచుకుని సామాన్యుడిలా ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటివి వ్రాసి ఎమొషనల్ చేసి అయోమయంలో పడవేస్తున్నారు. మృగత్వం మనిషిలో పెరిగిపోతుంది, దీనికి కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి అని మాట్లాడితే అదొక అర్థం.

ఇది కళ్ళు తెరవాల్సిన సమయం, ఏడ్చి మరిచి పోవాల్సిన సమయం కాదు.

Anonymous said...

ఆటవిక శిక్షలతో సమాజం బాగుపడేట్లైతే - మధ్య యుగాల నుండీ అమలు చేస్తున్నా అరేబియాలో వాటి అవసరం ఇంకా ఎందుకుందంటారు?

మన దేశంలో సమస్య ఆటవిక శిక్షలు లేకపోవటం కాదు. ఉన్న వాటినీ సరిగా అమలు చేసే సత్తా ఉన్న యంత్రాంగం లేకపోవటం. కుళ్లిపోయిందా అమ్మాయి చిన్న పేగులే కాదు. మన వ్యవస్థ మొత్తం. ఆడా మగా తేడాల్లేకుండా అందర్నీ ప్రలోభాలకి గురి చేసి కాసులు చేసుకునే కన్స్యూమర్ యుగంలో ఇలాంటివి జరక్కపోతేనే వింత. దాని ఫలితాలిలా అప్పుడప్పుడూ బయటపడుతుంటాయి. శిక్షలు కఠినతరం చేస్తే ఏం ఉపయోగం - అవి అమలు జరుగుతాయన్న భయం లేనంత కాలం?

Anonymous said...

మరణశిక్ష లాభం లేదు. వాళ్లలో వుపయోగపడే అవయవాలను తీసేసుకుని, 'కాయ'లను చితక్కొట్టి, అవిటివాడిగా ముష్టెత్తుకుని బ్రతికేలా వుంచేయాలి. రేపిస్టులకు వారి కథ దృష్ట్యాంతగా వుండాలి.

bondalapati said...

అత్యాచార అభియోగం ఉన్న వాడిని , ప్రూవ్ కాకుండానే కాల్చి పడేస్తే, అప్పుడు పరిస్థితి ఇంకొక డ్వ్ యాక్ట్ లా బ్రష్టు పట్టి పోతుంది. ఇక మగవాళ్ళు మీద కక్ష సాధింపులకి అంతే ఉండదు.
ప్ర్రొఫ్ లేకుండా కాల్చి పారేస్తే ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతాయి ( ఈ లింకు చూడంది): http://wp.me/pGX4s-L6

Anonymous said...

ఎప్పుడో పొరపాట్లు జరుగుతాయని, ఇలాంటి క్రూర మృగాలను మనుషుల మధ్య వదిలేస్తామా? తప్పుడుకేసులు పెట్టినవారినీ, దుర్వినీయోగం చేసినట్లైతే పోలీసులనూ అంతే కఠినంగా శిక్షించాలి.

bondalapati said...

That's sets a dangerous precedent. ఓ మహిళ కీ ఆమె పక్క ఇంటి పురుషుడికీ తగాదా ఉందనుకొందాం. ఆ మహిళ కి ఆ పురుషుడిని చంపాలన్నంత కోపం ఉండి ఉండవచ్చు. అప్పుడు అమే సింపుల్ గా అతను తనను రేప్ చేశాడని ఆరోపించి సీన్ క్రియేట్ చేస్తే చాలు (ఆఫ్టర్ ఆల్, మగ పురుగే కదా! చాలా సింపుల్. ఓ రేప్ ఆరోపణ చేస్తే సరి! చచ్చి ఊరుకొంటాడు) ప్రూఫ్ లేకుండానే పోలీసులు చక్కగా ఆ మగ వాడిని కాల్చిపెడతారు.
ఇలా misuse చేయటాన్ని సమాజం చాలా త్వరగా నేర్చుకొంటుంది.ఎక్కువ రోజులు పట్టదు. దీనికి అబధ్ధపు DV యాక్ట్ లే ఓ పెద్ద ఉదహరణ. ఆ పై ఇప్పటి కే బిక్క చచ్చి ఉన్న మగవాళ్ళు , ఇక బిక్కు బిక్కు మంటూ బతకాలి. కొన్ని కోట్ల మంది మగ వాళ్ళలో ఏ ఒక్కరో చేసే రేప్ కోసం, మగ వాళ్ళూ కనీస విచారణకూ, నిరూపణ కూ నోచుకోకుండా బలి అయ్యే అవకాశాన్ని కల్పించినట్లౌతుంది. ఇంతటి తో విరమిస్తాను. స్వస్తి.

కాయ said...

జీవితం ఎస్సెన్స్ తెలియని వాళ్ళు కాల్చెస్తాం, నరికేస్తాం,నాలుకలు కోస్తాం అనొచ్చు, అది వారి అవగాహన లోపం. సింపుల్ గా మనం ఎక్కువ హింస లేకుండ ఏ ఎలక్ట్రిక్ చేరో, లేక ఉరో వేస్తే చాలు. హింసించి చంపినా వాళ్ళు పోతారు, హింసించక చంపినా వాళ్ళు పోతారు. హింసిస్తే మాత్రం మనం డిస్టర్బ్ అవుతాం.

Anonymous said...

బొందలపాటి గారుకూడా కాయ లాగా తింగరవాదన చేస్తారనుకోలేదు. తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినీయోగం చేసే వాళ్ళకు శిక్ష అంతకన్నా తీవ్రంగా వుంటుంది, వుండాలనే కోరుకుంటాం. మీ జఠ్మలానీ టైపు తింగర వాదనలు ఆపితే సంతోషిస్తాము.

Anonymous said...

@ kaaya
జీవితంలో ఎసెన్సు తెలుసు కాబట్టే రేపులతో జీవితాన్ని ఆడుకునే ఎదవలకు ఎసెన్సు లేకుండా చేయాలి అని చెప్పేది.

బుల్లబ్బాయ్ said...


వార్నీయయ్య, కాయ/బొంద/చెప్పుదెబ్బలు.... ఇక్కడ అసలు విషయం మీకు అర్థం కాలేదనుకుంటా.. ఢిల్లీ (NCR) లాంటి చోట్ల ఎప్పుడైనా ఒక అపార్టుమెంటు కాంప్లెక్స్ కి వెళ్ళి చూడండి... మొత్తం విషయం అర్థమవుద్ది.

అక్కడ ఒక్కో కాంప్లెక్స్ లో వందలు, వేలు ఇల్లుంటాయ్... ప్రతి ఇంటికి ఒకట్రొండు కార్లు..వాటికి డ్రైవర్లు...ఈ డ్రైవర్లంతా కారుపార్కింగుకాడ కూసుని సొంగా కారత్తా సూత్తావుంటారు... అక్కడి ఆడలేడీసేమో (యువతులే కాదండోయ్, పిల్లల తల్లులు కూడా) మొక్కాల్లపైకి ఉండె నిక్కర్లేసుకుని (ఈమధ్య తొడలు కనొపించేలా... ఇంకొంతమంది ఇంకా పైకి... అనగా పిరుదులు కనపడేలా బట్టలు వేసుకుని తిరుగుతుంటే)

అయ్యన్నీ చూసి, రెచ్చిపోయి ఈ డ్రైవర్లు..టాక్సీ/బస్సు డ్రైవర్లు క్లీనర్లు అవకాశం దొరికినప్పుడల్లా ఇలా తెగబడ్తున్నారు.

కాబట్టి ఈ ఆర్థిక అసమతుల్యత, సాంస్క్రుతిక అసమతుల్యత పొయ్యేవరకు.. ఇలాంటి సంఘటనలు తప్పవ్.

Anonymous said...

అరే బుల్లెబ్బాయ్ నువ్వు చూసినట్టె చెబుతున్నావ్, రెచ్చిపోయి రేపింగులు కాని చేశావా? చూస్తే చేశేయాలా?

బుల్లబ్బాయ్ said...

అరె నీ యెంకమ్మ... అయ్యి చూసి మనమేమైనా పాపాలు చేసేత్తామేమొనని హైద్రాబాద్ లగెట్టుకొచ్చినా.


ఐనా అక్కడ పనిచేసోటోల్లలో చాలమంది UP, బీహారు ఊళ్ళనుంచి వచ్చి బాచెలర్ బతుకులు బతికేటోల్లు

నాసేత బూతుల్రాయించమాక... చూసింతర్వాత, లెగిసింతర్వాత ఆళ్ళేం సేత్తారో నాకు తెల్వదు..

ఐనా, నేసెప్తె మీకెక్కదు. ఆడెవడో అడిగా (Arvind Adiga, White Tiger) అనేటోడు తెల్ల పులి అనే పుస్తకం రాస్తే ఆడికి అడక్కుండానే బుకర్ ప్రైజిచ్చారు....

Anonymous said...

ఆ అమ్మాయి జరిగిన సంఘటన అత్యంత కిరాతకమైనది. మనుషులు అన్న వారు చేయలేని పని. చేసిన వాడు ఒట్టి వెధవని, వాడి మానసిక పరిస్థితి కృరమైనదని,వేగలేక కుటుంబ సభ్యులే వాడిని వదలి వెళ్ళారని పేపర్లో వచ్చింది. అటువంటి ఉన్మాది చేసిన పనికి కఠిన శిక్షలు అమలు చేయాలి.

ఇక డిల్లీ అమ్మాయిల ప్రవర్తన గురించి ఆ ఊరికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. టైమొచ్చింది కదా అని అమ్మాయిలు, ఇండియా గేట్ వద్ద తెగ రెచ్చి పోతున్నారు. ఆ గోల చేసే డిల్లి అమ్మాయీలో 25% మంది కూడా బస్సులో ప్రయాణించరు. అదే మిగతా మేట్రో సిటిలలో అన్ని తరగతుల వారు సిటి బస్సులలో ప్రయాణిస్తారు. డిల్లి లో మాత్రం కారు లో ఎక్కువగా ప్రయాణిస్తారు. తల్లి, కూతుళ్ళు ఇద్దరు ముడ్డి మీద ఎంత తక్కువ గుడ్డలు ధరిస్తే అక్కడ అంత గొప్ప. పెళ్ళిచేసుకొనేది విడాకుల పేరు తో మగవాడినుంచి డబ్బులు గుంజి బాయ్ ఫ్రెండ్ తో చేరి మిడ్డిలు, మినిలు వేసుకొని,పెదవులకు లిఫ్టిక్ కొట్టుకొని,నీట్ గా షేవ్ చేసిన చంకలు,జబ్బలు,స్లీవ్ లేస్ దుస్తులలో చూపిస్తూ తెల్లవారుజామున 3గం|| వరకు మందు కొట్టి పబ్ లో ఎగురుతూండేది.అది డిల్లి ఆడవారికి తెలిసిన సంస్కృతి. అది ఆ ఊరి ప్రస్తుత సంస్కృతి.
ఇంతకి చెప్పొచేదేమిటంటె, మీడీయా చేసే హైపు మాయలో పడి పురుషులు సానుభూతి చూపితే అంత కన్నా వెధవ పని ఉండదు. మగవాళ్ళు నెత్తి మీద చెంగేసుకు పోవలసిందే.

అల్లం

muralibabu kanaparthy said...
This comment has been removed by a blog administrator.
Anila Kancharla said...

sorry, that not my id..its my hubs id.how can i delete that?

EE patakaniki odikattindi baga educated kadu. pottakosam edo kulinali la chesukoni batike vallu..vallu ekkada nundi vacharoo emi chestunnaro aara teeste telustundi..Ammayalu mini lalo tirigutunnaru kadanadam le ..kani balayyindi oka normal ammaye kada..mini lalo tirige pilla kadu kada.....South delhi lo ammayalu chala posh ani vinnamu...evato chesina tappuku oka amayakuralini ila cheyadam sahinchalenidi...evidam ga ayite aa ammayini himsincharo ade vidamga vallani kuda cheyali...hang chesi vadi papanni anta twraga tudichi pettakudadu...shana shanam aa ammayi podutunna badani anu bhavinchi chavali...oka adadaniga nenu korukonedi ide...

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I have deleted it,

Anonymous said...

Good job, keep it up.

కాయ said...

http://pooladebbalu.blogspot.com/2012/12/blog-post.html

బుల్లబ్బాయ్ said...

బావుందయ్యా కాయ! నీ ఈ కొత్తబ్లాగు కు బుల్లబ్బాయ్ అభినందనలు! కానీ మనలాటోల్లు వోపెన్ గా కామెంటెట్టే సదుపాయం పెట్టు

పన్లోపని, మీడియాని కూడ కొంచెం ఏకు.

ఢిల్లి టైంస్ ఆఫ్ ఇండియా వాడు, మొదటి పేజీలో రేపుకు వ్యతిరేకంగా గోల... కానీ వాడి సిటీ ఎడిషన్ (ఢిల్లీ టైంస్) లో మాత్రం "మనం సెక్సు గురించి వోపెన్ గా మాట్లాడాలి, సినిమాల్లో సెన్సారులుండకూడదూ" అని మొత్తం బూతు గుప్పిస్తున్నాడు.

వాడి ఎడిషన్ పెట్టి 18 ఏళ్ళయ్యిందట... అందుకని జనాలందరినీ అడల్ట్ కంటెంట్ మీద ఎడ్యుకేట్ చెస్తన్నాడు

కాయ said...

టాంక్స్ అండీ బుల్లబ్బాయ్ గారు. కొత్తగా బ్లాగు పెట్టాను కదా.. ఈ కామెంట్లు కాకర కాయలు సెట్టింగులూ గట్రా తెలీలేదు. ఇప్పుడు ఓపెన్ కామెటింగులు పెట్టేశానండి. మీరు యదేచ్చగా కామెంటొచ్చు..

Anonymous said...

Its a Defect in the SYSTEM.
Question: How many of the people commented here voted in the last elections??? People who voted need Rs.100/- per day(Paniki Ahara Pathakam)and Rs 1000/5000/- per vote..