నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, February 1, 2013

ఈ వృద్ధ కన్యలతో పెట్టుకుంటే మటాషే


మానవ జీవితంలో గృహస్థ దశ అతి ముఖ్యమయినది. అందుకే ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి అంటారు. పెళ్ళి చేసుకొని ఒక భాగస్వామితో, ఆ తరువాత పిల్లలతో వేగడం వల్ల ఇచ్చి పుచ్చుకోవడం, అవసరమయినపుడు అధికారం చెలాయించడం, కొన్ని సార్లు తలొగ్గడం ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి. కానీ కొంతమంది జీవితాలలో ఇది జరగదు. కొన్ని కారణాల చేత కానీ, ఏవో ఆదర్శాలు, ఆశయాలను సాధించాలన్న ప్రయత్నంలో కానీ భాగస్వామి తోడు లేకుండా ఒంటరి ప్రాయాణాలు చేస్తుంటారు కొందరు. వీరికి తమ మాటే చెల్లుబాటు కావాలన్న భావం ఉంటుంది. తాము నమ్మిన వాటి కోసం, తమ మాట చెల్లించుకోవడం కోసం ఎంత దాకా అయినా పోతారు వీరు. 
 
కొన్ని సార్లు ఇది సమాజాన్ని బాగు పరుస్తుంది. ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద లాంటి వారు ఈ కోవలోకి వస్తారు. వీరి వల్ల ప్రపంచం మరింత మెరుగు పడడమే కాకుండా వీరు పదిమందికీ ఆదర్శంగా నిలుస్తారు. మరికొన్ని సార్లు ఇలాంటి వారు నిరంకుశులుగా తయారవుతారు. ఆఫీసులో పై అధికారులుగా ఉంటే తమ కింద ఉద్యోగులని వేపుకు తినడం, ఏడిపించడం చేస్తూ ఉంటారు. కొంపదీసి వీరి చేతికి అధికారం వస్తే ఇంతే సంగతులు.
 
ఈ రెండవ కేటగిరీలోని మగవారి కన్నా ఆడవారితో ఎక్కువ ఇబ్బంది ఉంటుందేమోనని నా అభిప్రాయం. ఉదాహరణకి అటల్ బీహారీ వాజ్‌పేయీ, నరేంద్ర మోడీలని తీసుకుంటే వీరికి పెళ్ళీ పెటాకులూ లేవు, సంసార జంజాటం లేదు కాబట్టి తమ వారికి దోచి పెట్టాలన్న తాపత్రయం లేక ఉన్నంతలో మంచి పాలకులుగా, ముఖ్యంగా అవినీతి మచ్చ అంటకుండా పాలించారు.
  
అదే ఆడవారిని తీసుకుంటే నేను మోనార్క్‌ని అన్నట్టు నియంతలు, నిరంకుశంగా ఉంటారేమోనని అనిపిస్తూంది. ఇందుకు రెందు మంచి ఉదాహరణలు మమతా బెనర్జీ, జయలలిత. తన మీద కార్టూనులు వేసినందుకు ఒక లెక్చరర్‌ని జైలులో పెట్టింది మమతా దీదీ. ఒక టీవీ టాక్‌షోలో ఇబ్బందికరమయిన ప్రశ్నలు వేసినందుకు ఒక విద్యార్ధిని మీద కోప్పడి వాక్ అవుట్ చేసింది.

అలాగే మాయావతి కూడా. రాష్ట్రం దివాళా తీస్తున్నా తాననుకున్నట్లు తన విగ్రహాలు, తమ చిహ్నమైన ఏనుగు విగ్రహాలు రాష్ట్రమంతా పెట్టించి తన మాటే తనకు వేదం కానీ మరేమీ పట్టదని చూపించింది.

 ఇక తాను ప్రధాని పదవిమీద కన్నేసి ఉండగా చిదంబరం ప్రధాని అయితే చూడాలని ఉంది అన్నందుకూ, విశ్వరూపం సినిమా శాటిలైట్ హక్కులు తన చానల్‌కి ఇవ్వకుండా తన ప్రత్యర్ధి చానల్‌కి ఇచ్చినందుకూ కమల్ హసన్‌నీ, ఆయన సినిమాని పురచ్చి తలైవి ఏ విధంగా చెడుగుడు ఆడేస్తుందో చూస్తూనే ఉన్నాం కదా!

ఈ టాపిక్ పైన ఎవరయినా సైకాలజిస్టులు పరిశోధన చెస్తే బావుంటుందేమో.

6 comments:

Anonymous said...

your forgot 'Mayawati' :)

Anonymous said...

ఈయనెవరో స్త్రీ ద్వేషిగా వున్నాడు. మహిళాసంఘాలోళ్ళకు పోలీసులకు పిర్యాదు చేసే పని దొరికింది రండహో. :-)

బుల్లబ్బాయ్ said...

ఇది తాడేపల్లికి సప్పోర్టుగా రాసినట్టుందే

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మాయావతిని తగిలించాను చూడగలరు. గుర్తు చేసినందుకు థాంక్స్.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బాబ్బాబూ, మీకు పుణ్యముంటుంది ఈ సంధ్యక్కనీ, దేవీ అక్కని నామీదికి వదలొద్దు ప్లీజ్.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ తాడేపల్లి ఎవరు సార్. ఆయనకీ ఈ పోస్టుకీ సంబంధమేమిటీ కాస్త చెబ్దురూ.