









జగన్ మోహన్ రెడ్డి ఒదార్పు యాత్ర ఎడతెగకుండా చేసీ చేసీ, పది నెలలుగా ఎందరో గుండెల్లో ట్యాంకులు కత్తి దాచుకున్న కన్నీటిని బయటకు తీసి మరీ తుడిచి వాళ్ళకు ఒదార్పు నిచ్చి తన కంటి నీటిని వాళ్ళ చేత తుడిపించుకొని అలసి పోయి ఒక చోట అలా నడుము వాల్చాడు కాస్సేపు విశ్రాంతి తీసుకొందామని.మాగన్నుగా నిద్ర పట్టింది.అయినా అతడి గుండెల్లో వేదన,ఆవేదన.
నెహ్రూ చనిపోతే ఇందిర,ఆమె చనిపోతే రాజీవ్,అతడు చనిపోతే సోనియా కాళ్ళ దగ్గరికి ప్రాధాని పదవి వచ్చింది.ఆమె కాదన్నాకే అది పక్కకి పోయింది.ఇప్పుడు రాహుల్ మెడ మీద పూలమాలలా ఆ పదవి వేలాడుతూ ఉంది.అతడు చిటికే వేస్తే మెడలో పడిపోదామని.అలాంటిది తన తండ్రి చనిపోతే తను కావాలి మొర్రో అన్నా ముఖ్యమంత్రి పదవి తనకు దక్కలేదు.ఇంత కన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా?
అప్పుడు"నాయనా జగన్" అన్న పిలుపు వినిపించి లేచి కూర్చున్నాడు.ఎవరూ కనిపించ లేదు.అటూ ఇటూ చూశాడు."నాయనా నేనూ ఆకాశవాణిని" అన్నదా గొంతు."ఆకాశవాణా?శాటిలైట్ చానళ్ళు వఛ్ఛాక కూడా నువ్వింకా ఉన్నావా?" అడిగాడు జగన్.
"నాయనా నేను కథల్లో వినిపించే ఆకాశ వాణిని " అన్నదా గొంతు."సరే ఏమిటో చెప్పు.నేను ఓదార్చాల్సిన లిస్టు ఇంకా చాలా ఉంది" అన్నాడు జగన్ అసహనంగా."నీ సందేహానికి సమాధానం నాకు తెలుసు.చెప్తాను విను."
"ఇందిర్తకు,రాజీవ్ కూ,సొనియాకు,రాహుల్ కూ ప్రధాని పీఠం కాళ్ళ వద్దుకు రావడానికి కారణం వాళ్ళ పేరులో ఉన్న గాంధీ నాయనా"అని చెప్పి ఆకాశవాణి మాయమయ్యింది.
జగన్ కళ్ళు తెరుచుకొన్నాయి.ఇప్పుడు వెంటనే తన పేరులో గాంధీని తగిలించుకోవాలి.అయితే ఎలా?తను గాందీ కుటుంబంలో పుట్టి ఉండాలి లేదా ఎవడైనా గాంధీ తనని దత్తత తీసుకొని వాడి తోక తనకి తగిలించాలి.రెండూ అయ్యే పనులు కావు.ఎలా అని తీవ్రంగా అలోచించాక ఒక ఆలోచన తట్టింది.గాంధీనే తన తండ్రిగా మార్చి పారేస్తే?
అందు వల్లనే రాజ శేఖర్ రెడ్డి గాంధీ లాంటివాడు అన్న స్టేట్ మెంట్ ఇచ్చాడు జగన్. యాత్ర మరో రెండు రోజులు గడిస్తే రాజ శేఖర్ రెడ్డి గాంధీ అయిపోతాడు.మహత్మా గాంధీ చనిపోయాక ఆయన ఆత్మ ఒక 18 నెలలు స్వర్గంలో గడిపి తెలుగు ప్రజలని ఉద్ధరించడానికి పులివెందులలో పుట్టింది అని ఒక స్టోరీ సాక్షి పత్రిక,చానల్ లో ఊదర గొట్టేస్తే సరి.
దీన్ని సమర్దిస్తూ అబటి రాంబాబు లాంటి చెంచా గాళ్ళు మీడియ చానళ్ళలో ప్రచారం చేస్తారు.ఎవడో వర్షాలు కురవాలని రాజశేఖర రెడ్డి గాంధీ యాగాలు చేస్తాడు.పొలాల్లో అధిక దిగుబడి కోసం ఆయన ఫోటోలు పెడతారు.అయితే దిష్టి బొమ్మలకీ వీటికీ తేడా ఉండాలి కాబట్టి ఈ ఫోటోలు పొలమలో ఒక చిన్న మందిరం కట్టి అందులో ఉంచుతారు.ఈలోగా ఇంకెవడో రాజశేఖర మాల అని మొదలు పెడతాడు.ఆయన లాగా పంచె కట్టి మూడు వారాలు ఆయన ఫోటొకి పూజ చేసి కాలి నడకన ఇడుపుల పాయ చేరుకొని మాల తీసేస్తారు.
వెదజల్లడానికి డబ్బు ఉండాలి కానీ వెర్రి వెధవలకి ఏమి తక్కువ?ఇదంతా తిక్క వ్యవహారం అని ఎవరైనా కొచెం ఆలోచించే సన్నాసులకి అనిపిస్తే వాళ్ళు ఎలాగూ బయటకి రారు కాబట్తి అసలు గొడవ ఉండదు.