జగన్ మోహన్ రెడ్డి ఒదార్పు యాత్ర ఎడతెగకుండా చేసీ చేసీ, పది నెలలుగా ఎందరో గుండెల్లో ట్యాంకులు కత్తి దాచుకున్న కన్నీటిని బయటకు తీసి మరీ తుడిచి వాళ్ళకు ఒదార్పు నిచ్చి తన కంటి నీటిని వాళ్ళ చేత తుడిపించుకొని అలసి పోయి ఒక చోట అలా నడుము వాల్చాడు కాస్సేపు విశ్రాంతి తీసుకొందామని.మాగన్నుగా నిద్ర పట్టింది.అయినా అతడి గుండెల్లో వేదన,ఆవేదన.
నెహ్రూ చనిపోతే ఇందిర,ఆమె చనిపోతే రాజీవ్,అతడు చనిపోతే సోనియా కాళ్ళ దగ్గరికి ప్రాధాని పదవి వచ్చింది.ఆమె కాదన్నాకే అది పక్కకి పోయింది.ఇప్పుడు రాహుల్ మెడ మీద పూలమాలలా ఆ పదవి వేలాడుతూ ఉంది.అతడు చిటికే వేస్తే మెడలో పడిపోదామని.అలాంటిది తన తండ్రి చనిపోతే తను కావాలి మొర్రో అన్నా ముఖ్యమంత్రి పదవి తనకు దక్కలేదు.ఇంత కన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా?
అప్పుడు"నాయనా జగన్" అన్న పిలుపు వినిపించి లేచి కూర్చున్నాడు.ఎవరూ కనిపించ లేదు.అటూ ఇటూ చూశాడు."నాయనా నేనూ ఆకాశవాణిని" అన్నదా గొంతు."ఆకాశవాణా?శాటిలైట్ చానళ్ళు వఛ్ఛాక కూడా నువ్వింకా ఉన్నావా?" అడిగాడు జగన్.
"నాయనా నేను కథల్లో వినిపించే ఆకాశ వాణిని " అన్నదా గొంతు."సరే ఏమిటో చెప్పు.నేను ఓదార్చాల్సిన లిస్టు ఇంకా చాలా ఉంది" అన్నాడు జగన్ అసహనంగా."నీ సందేహానికి సమాధానం నాకు తెలుసు.చెప్తాను విను."
"ఇందిర్తకు,రాజీవ్ కూ,సొనియాకు,రాహుల్ కూ ప్రధాని పీఠం కాళ్ళ వద్దుకు రావడానికి కారణం వాళ్ళ పేరులో ఉన్న గాంధీ నాయనా"అని చెప్పి ఆకాశవాణి మాయమయ్యింది.
జగన్ కళ్ళు తెరుచుకొన్నాయి.ఇప్పుడు వెంటనే తన పేరులో గాంధీని తగిలించుకోవాలి.అయితే ఎలా?తను గాందీ కుటుంబంలో పుట్టి ఉండాలి లేదా ఎవడైనా గాంధీ తనని దత్తత తీసుకొని వాడి తోక తనకి తగిలించాలి.రెండూ అయ్యే పనులు కావు.ఎలా అని తీవ్రంగా అలోచించాక ఒక ఆలోచన తట్టింది.గాంధీనే తన తండ్రిగా మార్చి పారేస్తే?
అందు వల్లనే రాజ శేఖర్ రెడ్డి గాంధీ లాంటివాడు అన్న స్టేట్ మెంట్ ఇచ్చాడు జగన్. యాత్ర మరో రెండు రోజులు గడిస్తే రాజ శేఖర్ రెడ్డి గాంధీ అయిపోతాడు.మహత్మా గాంధీ చనిపోయాక ఆయన ఆత్మ ఒక 18 నెలలు స్వర్గంలో గడిపి తెలుగు ప్రజలని ఉద్ధరించడానికి పులివెందులలో పుట్టింది అని ఒక స్టోరీ సాక్షి పత్రిక,చానల్ లో ఊదర గొట్టేస్తే సరి.
దీన్ని సమర్దిస్తూ అబటి రాంబాబు లాంటి చెంచా గాళ్ళు మీడియ చానళ్ళలో ప్రచారం చేస్తారు.ఎవడో వర్షాలు కురవాలని రాజశేఖర రెడ్డి గాంధీ యాగాలు చేస్తాడు.పొలాల్లో అధిక దిగుబడి కోసం ఆయన ఫోటోలు పెడతారు.అయితే దిష్టి బొమ్మలకీ వీటికీ తేడా ఉండాలి కాబట్టి ఈ ఫోటోలు పొలమలో ఒక చిన్న మందిరం కట్టి అందులో ఉంచుతారు.ఈలోగా ఇంకెవడో రాజశేఖర మాల అని మొదలు పెడతాడు.ఆయన లాగా పంచె కట్టి మూడు వారాలు ఆయన ఫోటొకి పూజ చేసి కాలి నడకన ఇడుపుల పాయ చేరుకొని మాల తీసేస్తారు.
వెదజల్లడానికి డబ్బు ఉండాలి కానీ వెర్రి వెధవలకి ఏమి తక్కువ?ఇదంతా తిక్క వ్యవహారం అని ఎవరైనా కొచెం ఆలోచించే సన్నాసులకి అనిపిస్తే వాళ్ళు ఎలాగూ బయటకి రారు కాబట్తి అసలు గొడవ ఉండదు.
25 comments:
అయ్యయ్యో మీకు రాజశేఖర మాల గురించి తెలియదా. దీన్ని పాపం ఆయన పోయినప్పుడే గుంటూరులో ఎవరో అభిమానులు వేసేసుకున్నారు కూడా. అప్పట్లో ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది. "పరమ" భక్తి మరి
http://www.apreporter.com/andhra-politics/830-tdpleadererrannaiducommentsonysjaganstour.html
అదిరింది బాస్. ఈ అంశం మీద నేను ఒక సెటైర్ ప్లాన్ చేసి ఏమీ తట్టక వదిలేశా..
అద్భుతం. ఇలాంటి చెప్పు దెబ్బలు కావాలి సార్
రాము
apmediakaburlu.blogspot.com
vyaktuluga manaku kondaru nacchavacchu,nacchakapovacchu.manaku nacchina nacchaka poyina y.s.r konni manchi panulu chesadu.swacchamaina rajakeeyalu ippudu levu.jagan yaatra valana saamaanyulaku nastamu ledu,kontamandiki laabame vundi.eg;vehicles vallaki,hotels vallaki,wineshops vallaki,youthku,chanipoinakutumbalaku,patrikalavallaku,chanelsvallaku,inka chalamandikiinthamandiki upayogapade yatranuswagadiddam .gajula
Cool post!
Meeru janaalinji(JAGAN ki?) leni ideas isthunnatlunnaru!
-Bhaskar
చురుక్కుమనే వ్యంగ్యంతో బాగా వ్రాసారు!:))
జగన్ అంత మంచి ఎంపిక కాకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలనని ఒక గాడిన పెట్టడానికి, రోశయ్యలాంటి పనికిమాలిన అసమర్థుణ్ణి వదిలించుకోవడానికీ, అన్నింటి కంటే ముఖ్యంగా తెలుగుజాతి సమైక్యాన్ని కాపాడ్డానికీ జగన్ కంటే వేరే దిక్కు లేదు. కనీసం కోస్తా-రాయలసీమ ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చి వ్యూహాత్మకంగా ఒక్కసారి జగన్ పార్టీని గెలిపించడం ఇప్పుడు మన చారిత్రిక అవసరం.
lol
నాకు రాజశేఖర మాల అంటూ ఒకటుందని తెలీదు కానీ ఆయన అనుచరులు అలాంటి దానిని ఒకటి మొదలు పెట్టి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.తెలియజేసినందుకు థాంక్స్.
రాము గారూ మీకు థాంక్స్.నేను మీ బ్లాగ్ క్రమ తప్పకుండా చదువుతుంటాను
భాస్కర్,నువ్వుశెట్టీ,అమ్మ ఒడీ గాజులా,ఎనోనిమస్ థాంక్ యూ.
జగన్ యాత్రలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు.ఎటొచ్చీ రాజ శేఖర్ రెడ్డిని దేవుడి లాగానో,మహానుభావుడిలాగానో చూపాలని చూడడంతోనే వచ్చిన తంటా అంతా.
పదితరాల వరకూ కూర్చుని తినగలిగే ఆస్తి వున్నా
రాత్రనకా పగలనకా ఎండనకా వాననకా అధిస్టానానికి ఎదొరొడ్డీ తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెడుతున్న ఒక యువ ప్రజా ప్రతినిధి పడుతున్న కష్టాన్ని చూసి గర్వించక.
ఈ కాపిటలిస్టిక్ రాతలెందుకు సార్.
"పదితరాల వరకూ కూర్చుని తినగలిగే ఆస్తి వున్నా
రాత్రనకా పగలనకా ఎండనకా వాననకా అధిస్టానానికి ఎదొరొడ్డీ తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెడుతున్న ఒక యువ ప్రజా ప్రతినిధి"
నిజంగానా ఎవరి గౌరవం ఎవరు నిలబెడుతున్నారు, తండ్రి పోగానే ముఖ్య మంత్రి పదవి తన ఇంట్లో ఆస్తి అయినట్టు శవ రాజకీయాలు నడిపిన మనిషి మన గౌరవాన్ని నిలబెడతాడా?
"పదితరాల వరకూ కూర్చుని తినగలిగే ఆస్తి వున్నా
రాత్రనకా పగలనకా ఎండనకా వాననకా అధిస్టానానికి ఎదొరొడ్డీ తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెడుతున్న ఒక యువ ప్రజా ప్రతినిధి పడుతున్న కష్టాన్ని చూసి గర్వించక"
____________________________________
looooooooool. Rofl Rofl Rofl
జగన్ వచ్చి నిలబెట్టాలి ఆత్మ గౌరవాన్ని .... joke of the millennium
ఎక్సలెంట్ సార్! చాలా చాలా బాగా రాసారు. అసలు సిసలు అదిరిపోయే వ్యగ్యం. ఇన్నాళ్లు మీ బ్లాగుని ఎలా మిస్సయానో అని తెగ ఇది అయిపోతున్నాను :)
@ శ్రీ కృష్ణా చింతలపాటి గారు,
మీ కామెంటు సెటైరని అనుకుంటున్నాను, ( కాకపోతే ఆశ్చర్యమే !) అసలు ఆ పది తరాలు తిన్న ఆస్థి ఎవరి సొమ్ము అండి ? మన కడుపులు , నడుములు , వీపులు ఏది వదలకుండా కొట్టి సంపాదించే కదా! ఇప్పుడు పదవిలో తను కానీ, తన వారు కానీ లేకపోతే ఆర్ధికంగా నష్టం లేకపోవచ్చు గాని, అక్రమ ఆర్జన కేసులు.. వేదింపులు వుండొచ్చు..మనోడి కి మూడీ కాంగ్రెస్సు తదుపరి ఎన్నికలలు లో ఓడిపోతే, ఇంకా ఇబ్బంది కావచ్చు.. అంతే గానీ ప్రజలు కోసం ఉత్తి పుణ్యానికే తెగ ఇది అయిపోడానికి వాడేమన్నా వెర్రి నాగన్నా ?
typo.. corrected.
*** అసలు ఆ పది తరాలు తిన్నా 'తరగని' ఆస్థి ఎవరి సొమ్ము అండి ?
మీడియా చేస్తున్న్ అబ్రెయిన్ వాష్ కి విరుగుడుగా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు అవసరం.
పై జోకు బావుంది. ఆస్తులు వదులుకుని రావడం లేదు ఎవరూ ప్రజాసేవకు. అవి నిలబెట్టుకోడానికీ, ఇంకా పెంచుకోడానికీ. ఈ కనీస సత్యం అందరికీ తెలియనిదాకా మన రాజకీయాలంతే! తెలిసీ లాభం లేదన్నా వొప్పుకోక తపాదేమో!
చింతలపాటి గారికి నేను సమాధానం ఇచ్చేలోగానే క్రిష్ణ,శ్రీనివాస్ లు సరిగ్గా నా మనసులో ఉన్న సమాధానాన్ని కాపి కొట్టినట్లుగా రాసేశారు.వారికి ధన్యవాదాలు.
చింతలపాటి గారికి నేను సమాధానం ఇచ్చేలోగానే క్రిష్ణ,శ్రీనివాస్ లు సరిగ్గా నా మనసులో ఉన్న సమాధానాన్ని కాపి కొట్టినట్లుగా రాసేశారు.వారికి ధన్యవాదాలు.
మన ఖర్మ ఇదే!
"వాడు తెగ దోచేసుకుంటున్నాడ"ంటే, "అందరూ దోచుకుంటున్నారు గదా, వీడింకా తక్కువే!" అంటారు, లేకపోతే "తిన్నా మంచి పనులు చేయలేదా" అని దబాయిస్తారు. తన వాళ్ళకు దోచిపెడుతుంటే "నమ్మిన వాళ్ళకు అన్యాయం చేయని మారాజు" అని కీర్తిస్తారు.
ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని ఆగలేక పిసుక్కుని పిసుక్కుని ఇక లాభం లేదన్న తెగింపే కానీ దమ్ముండి కాదు. రేపు ముఖ్యమంత్రిని చేస్తానంటే వెళ్ళి సోనియా కాళ్ళు నొక్కడా, నాకడా?
అవినీతిపరులు కాని నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు పేపర్లలో కనపడవు. అడిగారు కనక ఒకరు - జేపీ.
యాత్ర తప్పు/ఒప్పు అనడంలేదు,
జీ హుజూర్ అనే వాళ్ళ కన్నా,అధిష్టానం మెడలు వంచగలిగే వాడు ఒక్కడన్న ఉండాలి పార్టీలో.
earo devudante,mahanubhavudante nammalsina avasaramu ledu.manaku telivivundikada.raajakeeyallo neethy gurinchi vethakadamu avivekamu.100%neethimanthulu evaru leru including j.p.gajula
@ శ్రీ కృష్ణ గారు,
దీనిని మీరు అధిష్టానం కి ఎదురొడ్డే తెగింపు అనుకుంటున్నారా? నాకు చావు తెగింపు అనిపిస్తుంది. ఒక్క విషయం ఆలోచించండి. ముఖ్య మంత్రి పదవి కాకపోతే, ఏదొ ఒక పదవి మనొడికి ఇవ్వొచ్చు కదా అధిష్టానం, నీకింకా అనుభవం లేదు కొన్నాళ్లు మోశయ్య తాతయ్య దగ్గర పాఠాలు నేర్చుకో అని ! పదవిలో, అసెంబ్లీలో ఒక యువ నాయకుడు, అది కూడా ఒక అయిదేళ్ళలో బోలేడంత ఆదాయ పన్ను కట్టి వుంటే, అవినీతి అరోపణలు కలిగి వుంటే.. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకే! కానీ పదవి లేక పోతే, మనవాడికి భయం! తెలుగు దేశం వాళ్లు చాలా హాపీగా ఫీలు అవుతారు,ఒకవేళ తనకి ముఖ్య మంత్రి పదవి కాకపోయినా, ఏదొ ఒక పదవి ఇచ్చినా! నేను వేరు కుంపటి పెట్టుకుంటాను అన్నది కూడా బెదిరింపు మాత్రమే, దాని వలన ప్రభుత్వం భయపడి ఏదొ ఒకటి చేస్తుంది అని! కానీ తెగే వరకు లాగితే జగన్ కే నష్టం!
కానీ మన ఖర్మ చూసారా! ఎంచుకోడానికి చూస్తే అందరు ఎదవలే! ఎవడు తక్కువ ఎదవా అనే చూసుకొవాలి మనం!
Post a Comment