నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, July 15, 2010

ఇడుపుల పాయలో పవర్ ప్లాంటు ఎందుకు పెట్టరు?

పవర్ ప్లాంటులన్నీ బలహీనుల(ఆర్ధికంగా,రాజకీయంగా) పొలాలలోనో, తోటల్లోనో మాత్రమె ఎందుకు పెడతారు, అవి సార వంతమైన భూములైనా సరే? ఏ ఇడుపుల పాయ ఎస్టేటులోనో పెట్టాలని ఎప్పుడూ, ఎవడూ ఎందుకు అనుకోడు?

ఇడుపుల పాయ మొత్తం ఒక వ్యక్తికి చెందిన ఆస్తి. ఆ వ్యక్తికి ఆ ఆస్తి మొత్తం కూడా తృణప్రాయం.అంతా పోయినా లెక్క లేనంత ఆసామీ అతను.అలాంటి చోట పవర్ ప్లాంటో ఇంకే నాశనమో పెట్టినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు కదా? అలా బడా బాబులకూ, మంత్రులకూ చెందిన భూములలో ఇలాంటీవి పెట్టాలన్న ప్రతిపాదన ఇప్పటివరకూ రానేలేదెందుకో?

1 comment:

astrojoyd said...

చిన్ని నా బోజ్జకు శ్రీరామరక్ష /నా పచ్చా నా పైరూ అనే ఈ రెండూ వాళ్లకు ఇష్టం కాబట్టీ ----జయదేవ్/చెన్నై-